Isha ambani: ఇషా అంబానీ ఈ ట్విన్ రోబోలను ఎందుకు ఎత్తుకుంది? ఈ వైరల్ ఫోటో అర్థం ఏంటంటే..-know about twin robos that isha ambani carried in ambani pre wedding celebrations ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Isha Ambani: ఇషా అంబానీ ఈ ట్విన్ రోబోలను ఎందుకు ఎత్తుకుంది? ఈ వైరల్ ఫోటో అర్థం ఏంటంటే..

Isha ambani: ఇషా అంబానీ ఈ ట్విన్ రోబోలను ఎందుకు ఎత్తుకుంది? ఈ వైరల్ ఫోటో అర్థం ఏంటంటే..

Koutik Pranaya Sree HT Telugu
Jun 26, 2024 03:00 PM IST

ఇషా అంబానీ రోబోను ఎత్తుకున్న ఫోటో ఒకటి ఇంటర్నెట్‌లో వైరల్ అయ్యింది. దాని వెనక ఉన్న అర్థం ఏంటో తెల్సుకోండి. వాటి విశేషాలు చూడండి.

ట్విన్ రోబోలను ఎత్తుకున్న ఇషా
ట్విన్ రోబోలను ఎత్తుకున్న ఇషా (Instagram)

ఇటలీలో జరిగిన అనంత్ అంబానీ, రాధికా మర్చంట్ ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ లో ఇషా అంబానీ కాస్టూమ్ ఒకటి అందర్నీ ఆశ్చర్యపరిచింది. సెలబ్రిటీ స్టైలిస్ట్ అనితా ష్రాఫ్ అడ్జానియా తన టెక్ ఫ్యూజన్ లుక్స్ ఫోటోను షేర్ చేశారు. ఈ ఫోటో ఇంటర్నెట్ ను ఆశ్చర్యపరిచింది. షియాపరెల్లి స్ప్రింగ్ 2024 కౌచర్ కలెక్షన్ నుండి స్ట్రాప్ లెస్ డ్రెస్‌ను ఇషా వేసుకుంది.

ట్విన్ రోబోలను ఇషా అంబానీ ఎందుకు ఎత్తుకున్నారు?

ఇషా అంబానీ యొక్క షియాపరెల్లి హౌట్ కౌచర్ లుక్ పారిశ్రామికవేత్త కోసం కస్టమ్ డిజైన్ చేశారని అనిత చెప్పారు. బయోనిక్ రోబో బొమ్మలు ఇషా కవల పిల్లలైన కృష్ణ , ఆద్యా పిరమల్ లకు సూచిస్తాయి. షియాపరెల్లి రోబో బేబీలు 2000 ల సంవత్సర ప్రారంభ సాంకేతికత, 90 ల నాటి సాంకేతికత కలయికను ప్రతిబింబించే ఉదాహరణ.

ఇషా స్ట్రాప్ లెస్ డ్రెస్సులో చతురస్రాకార నెక్ లైన్, మెటాలిక్ బస్టియర్, టాజెల్స్, వెల్వెట్ స్కర్ట్, మిడి-లెంగ్త్ హేమ్, శరీరాన్ని హత్తుకుని సిల్హౌట్ ఉన్నాయి. ట్విన్ రోబో బేబీస్ ను కస్టమ్ లుక్ లో మెరిపించింది ఇషా. జతగా హీల్స్, సొగసైన పోనీటైల్, బ్రాస్లెట్లు, అందమైన చెవి స్టడ్స్‌తో లుక్ పూర్తిచేశారు.

జనవరిలో పారిస్ ఫ్యాషన్ వీక్ లో జరిగిన షియాపరెల్లి స్ప్రింగ్ 2024 కౌచర్ కలెక్షన్ సందర్భంగా క్రియేటివ్ డైరెక్టర్ డేనియల్ రోజ్ బెర్రీ రోబో బేబీని రన్ వేపై పరిచయం చేశారు. ఈ ఆసక్తికర యాక్సెసరీని స్వరోవ్స్కీ స్టోన్స్, పాత బ్యాటరీలు, ఎలక్ట్రానిక్ చిప్, ఫ్లిప్ ఫోన్లు, ఐఫోన్ యుగానికి ముందు నుండి మరిన్ని ఎలక్ట్రానిక్ వ్యర్థాలతో ఎంబ్రాయిడరీ చేశారు.

షియాపరెల్లి యాక్ససరీ ధరించిన రిహానా:

తెల్లటి సిల్క్ స్కర్టులో రిహన్నా షియాపరెల్లి రూపొందించిన బేబీని మ్యాగజైన్ ఫోటోషూట్ కోసం పట్టుకుంది. వైల్డ్ విగ్, చిత్రంగా దిద్దిన కనుబొమ్మలు, డార్క్ లిప్ షేడ్ తో వింటేజ్ లుక్‌లో రిహానా మెరిసింది.

Whats_app_banner