Best prebiotic foods: మీ డైట్‌లో చేర్చాల్సిన ప్రిబయోటిక్ ఫుడ్స్ ఇవే
Best prebiotic foods: మీ జీర్ణ వ్యవస్థను మెరుగుపరిచే ఆరోగ్యకరమైన బ్యాక్టీరియాకు పోషకాహారాన్ని అందించే ప్రిబయోటిక్స్ గురించి తెలుసుకోండి.
ప్రొబయాటిక్స్ గురించి మీరు ఇదివరకే విని ఉంటారు. మన జీర్ణ వ్యవస్థకు సంబంధించిన ఆరోగ్యాన్ని మెరుగుపరిచే బ్యాక్టిరియాతో కూడి ఉన్నవే ప్రొబయాటిక్స్. ఇక ప్రిబయోటిక్స్ అంటే ఈ బ్యాక్టిరియా తన విధులు నిర్వర్తించేలా చేయగలిగే ఆహారం అన్నమాట. జీర్ణవ్యవస్థల్లో వేల కోట్ల సూక్ష్మజీవులు ఉంటాయి. ఆహారం జీర్ణమయ్యేలా, మెటబాలిజం సక్రమంగా జరిగేలా, రోగనిరోధకత పెంపొందేలా ఇవి చూస్తాయి. మన పేగుల్లో ఒకవేళ ఆరోగ్యకరమైన సూక్షజీవుల కంటే అనారోగ్యకరమైనవే ఎక్కువగా ఉంటే అది బరువు పెరగడానికి, రక్తంలో అధికస్తాయిలో చక్కెర ఉండడానికి, కొలెస్టరాల్ పెరగడానికి, ఇతర వ్యాధులకు దారితీస్తుంది. అందువల్ల మీ జీర్ణ వ్యవస్థకు సాయపడే బ్యాక్టీరియా ఉండేలా చూసుకోవాలి. ప్రిబయాటిక్స్ అనేవి ప్రత్యేకమైన ప్లాంట్ ఫైబర్ అని చెప్పాలి. ఈ మంచి బ్యాక్టీరియా పెంచేలా చేస్తాయి. జీర్ణ వ్యవస్థ మెరుగ్గా ఉండేలా చేస్తాయి. అంటే ఆరోగ్యకరమైన బ్యాక్టీరియాకు పోషకాహారాన్ని ఈ ప్రిబయోటిక్స్ ఇస్తాయన్నమాట. ఇవి నేరుగా దిగువ జీర్ణ వ్యవస్థకు చేరుకుని బ్యాక్టీరియా పెరిగేలా, మీ పేగు వ్యవస్థ ఆరోగ్యంగా ఉండేలా చేస్తాయి. ఆపిల్, బెర్రీ, బార్లీ, అరటి పండు, వెల్లుల్లి, ఆకుపచ్చని కూరగాయలు, చిక్కుళ్లు, ఉల్లి, టమాటాలు వంటివన్నీ ప్రిబయోటిక్స్‌కు ఉదాహరణలు.
GARLIC: వెల్లుల్లి
వెల్లుల్లి ప్రిబయోటిక్‌లా పనిచేస్తుంది. ఆరోగ్యకరమైన బ్యాక్టీరియా అయిన బైపైడోబ్యాక్టీరియా పెరిగేలా చేస్తుంది. వ్యాధికారక బ్యాక్టీరియాలను నిరోధించేందుకు సాయపడుతుంది.
ONION: ఉల్లి
ఇనులిన్, ఎఫ్ఓఎస్ పుష్కలంగా ఉండే ఉల్లిగడ్డలు మీ గట్ ఫ్లోరాను బలోపేతం చేస్తాయి. కొవ్వును కరిగిస్తాయి. నైట్రిక్ ఆక్సైడ్ ఉత్పత్తి చేసి రోగనిరోధకతను మెరుగుపరుస్తాయి.
FLAXSEEDS: అవిశె గింజలు
ఫ్లాక్స్ సీడ్స్‌లో ఉండే ఫైబర్ కంటెంట్ మ్యూకైలేజ్ గమ్, సెల్యూలోజ్, లిగ్నిన్‌ల ద్వారా లభిస్తుంది. ఇది ఆరోగ్యవంతమై పేగు బ్యాక్టీరియాను పెరిగేలా చేస్తుంది. అలాగే ఆహారంలో ఉండే కొవ్వులను కరిగించి జీర్ణమయ్యేలా, శోషణం అయ్యేలా చేస్తుంది.
BANANA: అరటి పండ్లు
తక్కువ ఫ్రక్టోజ్ కలిగిన అరటి పండ్లలో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. మంచి బ్యాక్టీరియాను పెంచేలా చేసే ఇనులిన్ అరటి పండ్లలో పుష్కలంగా ఉంటుంది.
BARLEY: బార్లీ గింజలు
బీటా-గ్లూకాన్ సమృద్ధిగా ఉండే తృణధాన్యం బార్లీ గింజలు. బీటా-గ్లూకాన్ ప్రిబయోటిక్ ఫైబర్‌లా పనిచేసి ఆరోగ్యకరమైన బ్యాక్టీరియాను పెంచుతుంది. అలాగే ఇది చెడు కొలెస్ట్రాల్‌ను కూడా తగ్గిస్తుంది.
టాపిక్