Kick Day 2023 | మీ ఎదుగుదలకు అడ్డంకి ఉన్న వాటన్నింటినీ ఒక తన్ను తన్నండి!-kick off the all negativity in life created by your ex celebrate anti valentines day in style ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Kick Day 2023 | మీ ఎదుగుదలకు అడ్డంకి ఉన్న వాటన్నింటినీ ఒక తన్ను తన్నండి!

Kick Day 2023 | మీ ఎదుగుదలకు అడ్డంకి ఉన్న వాటన్నింటినీ ఒక తన్ను తన్నండి!

HT Telugu Desk HT Telugu
Feb 16, 2023 08:26 AM IST

Happy Kick Day 2023: యాంటీ-వాలెంటైన్స్ వీక్‌లో రెండవ రోజు ఫిబ్రవరి 16న కిక్ డేగా జరుపుకుంటారు. అంటే తన్నమని అర్థం. మరి ఈ కిక్ డే రోజున ఎవరిని తన్నాలి, ఎలా జరుపుకోవాలి? ఇక్కడ తెలుసుకోండి.

Happy Kick Day 2023
Happy Kick Day 2023 (Stock Pic)

Happy Kick Day 2023: ఫిబ్రవరి 14న వాలెంటైన్స్ డే ముగిసిన తర్వాత, దానికి వ్యతిరేకంగా ఇప్పుడు యాంటీ-వాలెంటైన్స్ వీక్‌ను జరుపుకుంటున్నారు. ఫిబ్రవరి 15న స్లాప్ డేతో మొదలైన ఈ యాంటీ-వాలెంటైన్స్ వీక్‌ ఫిబ్రవరి 21న బ్రేకప్ డేతో ముగుస్తుంది. యాంటీ-వాలెంటైన్స్ వీక్‌లో రెండవ రోజును కిక్ డేగా, అది ప్రతీ ఏడాది ఫిబ్రవరి 16న వస్తుంది. మరి ఈ కిక్ డేను ఎలా జరుపుకోవాలి, దీని ఉద్దేశ్యం ఏమిటో తెలుసుకుందాం.

యాంటీ-వాలెంటైన్స్ వీక్ వేడుకలు ప్రేమలో విఫలమైన వారికి, ప్రేమలో మోసపోయినవారికి, చెడు సంబంధంలో కొనసాగుతున్నవారికి, ఆ ఆలోచనల నుంచి బయటపడేలా ప్రేరణను అందిస్తాయి. ఈ వేడుకలు మరొకరిని ప్రేమించడం కంటే కూడా మిమ్మల్ని మీరే ప్రేమించుకోవాలని గుర్తు చేస్తాయి.ప్రేమికుల వారంతో చిరాకుపడిన సింగిల్స్ ఈ ప్రేమలేని వారంలో ప్రతీరోజును వేడుక చేసుకోవచ్చు.

Kick Day Significance- కిక్ డేను ఎలా జరుపుకోవాలి?

- యాంటీ-వాలెంటైన్స్ వీక్‌లో రెండవ రోజు కిక్ డే. మీ ఎదుగుదలకు అడ్డుగా వచ్చే అంశాలను తన్ని తరిమేసి, ముందుకు సాగాలని ఈరోజు సూచిస్తుంది.

- కిక్ డే అనేది ప్రతికూలతలతో కూడిన సంబంధానికి చరమగీతం పాడటానికి ధైర్యంగా ఉండే రోజు. ఈ రోజున మీ జీవితంలో మిగిలిపోయిన అన్ని చేదు జ్ఞాపకాలను చెరిపేసుకోవడానికి సిద్ధంగా ఉండండి.

- మీరు అన్ని రకాల ఆనందాలకు అర్హులు. మీ జీవితం మీది, ఆనందంగా జీవించడం మీ హక్కు. మీ ఆ లక్ష్యాలను చేరుకోకుండా ఏదీ మిమ్మల్ని ఆపకూడదు.

- జీవితంలో మిమ్మల్ని మోసం చేసిన వారు అందించిన అన్ని బహుమతులను తీసిపారేయండి, లేదా జ్ఞాపకాలను చెరిపేయండి.

- ఒకసారి బంధం నుంచి విడిపోయాక కూడా మీ మాజీ మీతో ఆన్-అండ్-ఆఫ్ రిలేషన్‌షిప్‌లో ఉండటం జరగవచ్చు. మీకు చాలా మానసిక క్షోభను కలిగించడం వలనే మీరు వారి నుంచి దూరం జరిగారు. మళ్లీ ఆ చేదు జ్ఞాపకాలు, ఆ విషపూరిత సావాసాలు, ఆ హానికరమైన సంభాషణాలు ఇంకా ఎందుకు? వాటన్నింటిని ఒక తన్ను తన్ని తరిమేయండి.

- ఇప్పుడు మీ మాజీ కష్టకాలంలో ఉన్నారని మీరు అపరాధ భావంతో ఉండాల్సిన అవసరం లేదు. దేనినీ పట్టించుకోవలసిన అవసరం లేదు. ఇది మీరు జీవితంలో ముందుకు సాగాల్సిన సమయం. మీకు అనవసరం అయిన వాటిని తన్నుకుంటూ అడుగు ముందుకు వేయండి. - కిక్ డే శుభాకాంక్షలు!

Whats_app_banner

సంబంధిత కథనం