Happy Slap Day 2023 । మీ మనసును గాయపరిచిన వారి చెంప చెల్లుమనేలా యాంటీ-వాలెంటైన్స్ వీక్ జరుపుకోండి!-happy slap day 2023 know how to celebrate the anti valentines week 2023 ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  Lifestyle  /  Happy Slap Day 2023, Know How To Celebrate The Anti-valentines Week 2023

Happy Slap Day 2023 । మీ మనసును గాయపరిచిన వారి చెంప చెల్లుమనేలా యాంటీ-వాలెంటైన్స్ వీక్ జరుపుకోండి!

HT Telugu Desk HT Telugu
Feb 15, 2023 09:56 AM IST

Anti-Valentines Week- Slap Day: ప్రేమికుల వారం అయిపోయింది, ఇక ఈరోజు నుంచి ప్రేమలేని వారం.. యాంటీ-వాలెంటైన్స్ వీక్ ప్రారంభమవుతుంది. ఫిబ్రవరి 15న స్లాప్ డే అంటే చెంప చెల్లుమనిపించే రోజు. ఎలా జరుపుకోవాలో తెలుసుకోండి.

 Anti-Valentines Week- Slap Day
Anti-Valentines Week- Slap Day (Pixabay)

Happy Slap Day 2023: మొత్తానికి వాలైంటైన్స్ వీక్ అయిపోయింది, ఇక ఇప్పుడు యాంటీ-వాలెంటైన్స్ వీక్ ప్రారంభమవుతుంది. గత వారం రోజులుగా వాలెంటైన్స్ వీక్‌లో హగ్ డే అని, కిస్ డే అని ప్రేమజంటలు జరుపుకుంటుంటే, మరోవైపు సింగిల్స్ ఎంతో మనోవేదనకు గురై ఉంటారు. దానికి విరుగుడుగానే ఈ యాంటీ-వాలెంటైన్స్ వీక్ ఉండనుంది.

యాంటీ-వాలెంటైన్స్ వీక్ వేడుకలు ప్రేమతో సంబంధం లేనివి. ఇది ఫిబ్రవరి 15న స్లాప్ డేతో ప్రారంభమై ఫిబ్రవరి 21న బ్రేకప్ డేతో ముగుస్తుంది. మధ్యలో ఈ వారం అంతా కిక్ డే, పెర్ఫ్యూమ్ డే, ఫ్లర్ట్ డే, కన్ఫెషన్ డే, మిస్సింగ్ డే అంటూ జరుపుకుంటారు.

ఎవరైనా వేరొకరి చేతిలో ప్రేమ పేరుతో మోసానికి గురైనపుడు, ప్రేమ మీద నమ్మకం కోల్పోయినవారు, హార్ట్‌బ్రేక్ లేదా టాక్సిక్ రిలేషన్‌షిప్‌తో బాధపడుతున్న సింగిల్స్ కోసం ఉద్దేశించినది ఈ యాంటీ-వాలెంటైన్స్ వీక్. ఈ వారంలో మొదటి రోజును స్లాప్ డేగా జరుపుకుంటారు. మరి ఈరోజుకు ఉన్న ప్రాముఖ్యత, దీనిని ఎలా జరుపుకోవాలి మొదలైన అన్నీ విషయాలు ఇక్కడ తెలుసుకోండి.

Slap Day, Anti-Valentines Week- చెంపదెబ్బ కొట్టేరోజు

స్లాప్ డే అనేది యాంటీ-వాలెంటైన్స్ వీక్‌లో వచ్చే మొదటి రోజు. ఇది వాలెంటైన్స్ డే (ఫిబ్రవరి 14) కు తర్వాత రోజు, అనగా ఫిబ్రవరి 15న జరుపుకుంటారు. తమను మోసం చేసిన, తమ హృదయ విదారకానికి కారణమైన లేదా వారితో తప్పుగా ప్రవర్తించిన వారి మాజీ ప్రియులను చెంప చెల్లుమనిపించే రోజు ఇది.

అంటే మరి మీరు నిజంగానే వెళ్లి వారిని చెంపదెబ్బ కొట్టాలని ఇక్కడ ఉద్దేశ్యం కాదు. కానీ, వారిపై మీకున్న భావాలపై దెబ్బ కొట్టండి, వారితో మీకున్న జ్ఞాపకాలపై కొట్టండి, మిమ్మల్ని మీరు ప్రేమించుకోండి, స్వతంత్రంగా ఉండండి, జీవితంలో ముందుకు సాగండి అని ఈరోజుకు ఉన్న ముఖ్య ఉద్దేశ్యం.

స్లాప్ డే అనేది వ్యక్తులు తమ జీవితంలోని చెడు సంబంధాల నుండి బయటకు వచ్చేసి ముందుకు సాగడానికి, కొత్త వ్యక్తులను కలుసుకోవడానికి, తమ జీవితంలో ఉన్న చేదు జ్ఞాపకాలను తొలగించుకోడానికి రిమైండర్.

ఈ స్లాప్ డే అనేది ఎలా మొదలయింది అనేది కచ్చితమైన చరిత్ర లేదు, కానీ ఇది యాంటీ-వాలెంటైన్స్ వారంలో చాలా ముఖ్యమైన రోజు. ప్రేమలో గాయపడ్డ వ్యక్తులు తమ బాధకు కారణమైన వారి జ్ఞాపకాలను వదిలించుకొని, తమ కోసం తామే ఏదైనా చేసుకునే రోజు. తమకు ఇష్టమైన వస్తువులను కొనుగోలు చేయడం, నచ్చేలా ఉండటం, తమకు నచ్చిన ఆహారాన్ని తినడం ద్వారా వారి కోపాన్ని బయటపెట్టే రోజు. మీరూ ప్రేమలో గాయపడ్డారా, అయితే కొట్టండి వారి ఆలోచనలు, జ్ఞాపకాలపై దెబ్బ. పడండి మీతో మీరే ప్రేమలో. స్లాప్ డే శుభాకాంక్షలు!

WhatsApp channel