Rats: ఇంట్లో ఎలుకలు చేరకుండా ఉండాలంటే ఈ చిట్కా పాటించండి చాలు, ఎలుకలన్నీ బయటికి పోతాయి-just follow this tip to prevent mice from entering the house and all the mice will be out ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Rats: ఇంట్లో ఎలుకలు చేరకుండా ఉండాలంటే ఈ చిట్కా పాటించండి చాలు, ఎలుకలన్నీ బయటికి పోతాయి

Rats: ఇంట్లో ఎలుకలు చేరకుండా ఉండాలంటే ఈ చిట్కా పాటించండి చాలు, ఎలుకలన్నీ బయటికి పోతాయి

Haritha Chappa HT Telugu
Nov 11, 2024 09:58 AM IST

Rats: పల్లెటూరు ఇళ్లల్లో ఎలుకలు ఎక్కువగా చేరుతాయి. అలాంటి వారు చిన్న చిట్కా పాటించడం ద్వారా వాటిని తరిమేయవచ్చు. ఇంట్లోనే ఎలుకలను పారద్రోలే చిన్నచిన్న మాత్రలను ఎలా తయారుచేయాలో తెలుసుకోండి.

ఎలుకలు ఇంట్లో చేరకుండా ఇలా చేయండి
ఎలుకలు ఇంట్లో చేరకుండా ఇలా చేయండి (shuttersock)

పల్లెటూర్లలో ఇంట్లోకి ఎలుకలు వచ్చే సమస్య కూడా చాలా ఎక్కువ. బయటి డ్రైనేజీల నుంచి ఎలుకలు ఇంట్లోకి ప్రవేశించి భయాందోళనలకు గురిచేస్తుంటాయి. ఇంటిని పరిశుభ్రంగా ఉంచకపోయినా కూడా ఎలుకలు చేరి ఎలుక పిల్లలను పెట్టే అవకాశం ఉంది.

ఎలుకలు వస్తువులు, బట్టలను కొరికేస్తాయి. అలాగే ఆహారం, పానీయాలకు ఎక్కువ హాని కలిగిస్తాయి. ఇవి ఎక్కువగా రాత్రిపూట ఇంట్లోకి ప్రవేశిస్తాయి. పదేపదే ఎలుకల రాకతో ఇబ్బంది పడుతుంటే ఈ మాత్రను ఇంటి మూలలు, తలుపులపై రాసుకోవాలి. ఎలుకలు ఎప్పటికీ తిరిగి రావు. ఈ మాత్ర ఎలా తయారు చేయాలో తెలుసుకోండి.

ఎలుకలను ఇంటి నుండి తరిమికొట్టాలనుకుంటే, పిండితో మాత్ర తయారు చేసుకోవాలి. అది తిన్న తర్వాత ఎలుకలు ఇంట్లో అస్సలు ఉండవు, వెంటనే పారిపోతాయి. ఈ మాత్ర తయారీకి ఇవన్నీ అవసరం అవుతాయి.

ఎలుకలను తరిమే మాత్ర

ఒక గిన్నెలో రెండు మూడు చెంచాల పిండి తీసుకోవాలి. అందులో రెండు నుంచి మూడు టీస్పూన్ల బెల్లం లేదా పంచదార కలపాలి. ఇప్పుడు ఒక టీస్పూన్ ఉప్పు, ఒక టీస్పూన్ బేకింగ్ సోడా వేసి నీళ్లు మిక్స్ చేసి పిండిలా కలపాలి. పాత సెల్ లేదా బ్యాటరీని తీసుకొని దానిని పగులగొట్టండి. నల్లటి పొడిని ఒక కాగితంపై ఉంచండి. ఇప్పుడు తయారుచేసిన పిండిని ఒక చిన్న బంతి తీసుకుని అందులో ఈ నల్లటి పొడిని వేసి మాత్రలా తయారు చేసుకోవాలి. అన్ని మాత్రలను ఒకే విధంగా తయారు చేయండి. ఎలుకలు వచ్చే చోట తలుపుల మూలల్లో, వంటింటి మూలల్లో ఈ మాత్రలను ఉంచండి. ఎలుకలు తిన్న వెంటనే ఇంటి నుంచి పారిపోతాయి.

ఈ పిండి మాత్రలను ఏ పాత్రలోనూ తయారు చేయవద్దు. పిల్లల చేతులకు ఇవి అందకుండా చూసుకోండి. ఆహారం, పానీయాల్లో వీటిని కలవనీయకుండా జాగ్రత్త పడండి.

ఎలుకలను తరిమి కొట్టేందుకు పుదీనా ఆయిల్ ను వాడవచ్చు. దీని నుంచి వచ్చే ఘాటు వాసన వాటికి నచ్చదు. చిన్న చిన్న కాటన్ బాల్స్ కు పుదీనా నూనెలో ముంచి వంటింట్లో మూలనుంచాలి. అలాగే ఎలుకలు తిరిగే చోట పెట్టాలి. లేదా ఆ పుదీనా ఆయిల్ స్ప్రే చేసినా కూడా మంచి ఫలితం ఉంటుంది.

వెల్లుల్లి వాసన కూడా ఎలుకలకు నచ్చదు. వాటి నుంచి వచ్చే వాసనకు అవి దూరంగా పోతాయి. వెల్లుల్లిని బాగా దంచి నీటిలో కలిపి ఆ నీటిలో స్ప్రే బాటిల్ లో వేయాలి. ఆ నీటిని ఇంటి మూలల్లో చల్లాలి. ఇది ఎంతో చక్కగా పనిచేస్తుంది. వెల్లుల్లి పాయలను దంచకుండా వాడితే మాత్రం ఎలాంటి ఉపయోగం ఉండదు.

ఇంటిని పరిశుభ్రంగా పెట్టుకుంటే ఎలాంటి పురుగులు, కీటకాలు, ఎలుకలు ఇంట్లో చేరకుండా ఉంటాయి. కాబట్టి ముందుగా ఇంట్లో చెత్త, చెదారాన్ని బయటపడేయండి.

Whats_app_banner