Tea for Heart: గుండె కోసం ప్రతిరోజూ ఈ టీని తాగడం అలవాటు చేసుకోండి, గుండె పోటు రాకుండా ఉంటుంది
Tea for Heart: గుండె జబ్బులు వయసుతో సంబంధం లేకుండా వస్తున్నాయి. గుండె ఆరోగ్యం కోసం ప్రతిరోజు లెమన్ గ్రాస్ టీ తాగడం చాలా అవసరం.
Tea for Heart: గుండెపోటు, గుండె వైఫల్యం వంటి సమస్యలు ఎప్పుడు ఎవరి మీద దాడి చేస్తాయో చెప్పడం చాలా కష్టం. వయసుతో సంబంధం లేకుండా 20 ఏళ్ల నుంచి 60 ఏళ్ల వరకు అందరికీ గుండెపోటు వస్తోంది. కాబట్టి గుండె రక్షణ కోసం ప్రతిరోజూ ప్రత్యేకమైన ఆహారాన్ని తీసుకోవాలి. గుండెకు రక్షణ కల్పించే ఆహారంలో లెమన్ గ్రాస్ టీ కూడా ఒకటి. ఇది నిమ్మకాయ వాసన వస్తుంది. అందుకే లెమన్ గ్రాస్ అని అంటారు. దీన్ని ఇంట్లోనే పెంచుకోవచ్చు. ఈ నిమ్మగడ్డి చాలా సులువుగా ఇంట్లో పెరిగేస్తుంది. దాంతో టీ ఇంట్లోనే నచ్చినప్పుడు చేసుకోవచ్చు.
లెమన్ గ్రాస్ టీలో ఎన్నో పోషకాలతో పాటు యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. ఇవి శరీరంలో ఉన్న ఫ్రీ రాడికల్స్ ను స్వీకరిస్తాయి. దీర్ఘకాలిక వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తాయి. గుండె జబ్బులు, స్ట్రోక్ వంటి సమస్యలు రాకుండా అడ్డుకుంటాయి. లెమన్ గ్రాస్‌లో సిట్రల్, జేరేనియల్ అనే రెండు ప్రధాన పదార్థాలు ఉంటాయి. ఇవి గుండెకు రక్షణ కల్పిస్తాయి.
లెమన్ గ్రాస్ టీతో ఉపయోగాలు
లెమన్ గ్రాస్ టీ ని ప్రతిరోజు తాగడం వల్ల గుండెపోటు వచ్చే అవకాశం చాలా వరకు తగ్గుతుంది. అలాగే లెమన్ గ్రాస్ ఉన్న సిట్రల్ శరీరంలో క్యాన్సర్ పెరగకుండా అడ్డుకుంటుంది. ఇది ప్రభావంవంతమైన యాంటీ క్యాన్సర్ సామర్ధ్యాలను కలిగి ఉంటుంది. క్యాన్సర్ తో పోరాడటానికి ఎంతో సాయం చేస్తుంది. రోగనిరోధక శక్తిని పెంచుతుంది. శరీరానికి క్యాన్సర్ కణాలతో పోరాడే శక్తిని అందిస్తుంది. అలాగే క్యాన్సర్ బారినపడి కీమోథెరపీ, రేడియేషన్ తీసుకుంటున్న వారు కూడా లెమన్ గ్రాస్ టీని తాగడం చాలా మంచిది.
లెమన్ గ్రాస్ టీ తాగడం వల్ల అది రక్తపోటు కూడా అదుపులో ఉంటుంది. ఈ లెమన్ గ్రాస్ సిస్టోలిక్ రక్తపోటులో కాస్త తగ్గుదలను, డయాస్టోలిక్ రక్తపోటులో స్వల్ప పెరుగుదలను తీసుకురావడంలో ప్రభావంతంగా పనిచేస్తుంది. దీనివల్ల రక్తపోటు నియంత్రణలో ఉంటుంది. దీనిలో పొటాషియం ఎక్కువగా ఉండటం వల్ల రక్తపోటు కూడా తగ్గుతుంది. మూత్ర ఉత్పత్తిని పెంచుతుంది.
కొలెస్ట్రాల్ తగ్గించుకోవాలనుకునే వారు ప్రతిరోజూ లెమన్ గ్రాస్ టీని తాగడం చాలా ముఖ్యం. ఎందుకంటే దీనిలో చెడు కొలెస్ట్రాల్ ను కరిగించే శక్తి ఉంది. గుండె ఆరోగ్యాన్ని కాపాడుతుంది. లెమన్ గ్రాస్ లో క్వెర్సెటిన్ పుష్కలంగా ఉంటుంది. ఇది యాంటీఆక్సిడెంట్ లక్షణాలతో కూడి ఉంటుంది.
లెమన్ గ్రాస్ టీ తాగడం వల్ల జీవక్రియ నియంత్రణలో ఉంటుంది. బరువు తగ్గడానికి సహాయపడుతుంది. ఇది ఆహారాన్ని వేగంగా జీర్ణం కాకుండా నెమ్మదిగా జీర్ణమయ్యేలా చేస్తుంది. దీనివల్ల ఎక్కువ కాలం పాటు ఆహారం ఆకలి వేయదు. ఇతర ఆహారాలు తినకుండా ఉంటారు. కాబట్టి ఆరోగ్యంగా బరువు తగ్గొచ్చు.
లెమన్ గ్రాస్ సైడ్ ఎఫెక్టులు
అలా అని లెమన్ గ్రాస్ అధికంగా తాగకూడదు. రోజుకు రెండుసార్లు కన్నా అధికంగా తాగితే తల తిరగడం, నోరు ఎండిపోయినట్టు అవ్వడం, మూత్రానికి అధికంగా వెళ్లాల్సి రావడం, శ్వాస ఆడక పోవడం, గుండె కొట్టుకునే రేటు పెరగడం వంటి సమస్యలు కనిపిస్తాయి. గర్భవతులుగా ఉన్నవారు లెమన్ గ్రాస్ టీని దూరంగా ఉంచడమే మంచిది.
టాపిక్