శృంగారం తర్వాత మీ శరీరంలో ఈ సంకేతాలు కనిపిస్తే జాగ్రత్త!-is it normal to feel tired after sex ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  శృంగారం తర్వాత మీ శరీరంలో ఈ సంకేతాలు కనిపిస్తే జాగ్రత్త!

శృంగారం తర్వాత మీ శరీరంలో ఈ సంకేతాలు కనిపిస్తే జాగ్రత్త!

Galeti Rajendra HT Telugu
Oct 17, 2024 07:45 PM IST

శృంగారం తర్వాత కొంత మందికి చాలా అలసటగా అనిపిస్తుంటుంది. మరికొంత మంది అయితే నిమిషాల్లోనే ఒళ్లు తెలియకుండానే నిద్రపోతారు. అయితే మీ శరీరంలో ఈ సంకేతాలు కనిపిస్తే మాత్రం జాగ్రత్తగా ఉండాలి.

శృంగారం తర్వాత ఈ లక్షణాలతో జాగ్రత్త
శృంగారం తర్వాత ఈ లక్షణాలతో జాగ్రత్త

శృంగారం అనేది మనసుకే కాదు శరీరానికి కూడా ఆనందంతో పాటు అలసటని ఇస్తుంటుంది. అయితే చాలా మంది శృంగారం తర్వాత అతిగా అలసిపోతుంటారు. దాంతో కేవలం వీకెండ్‌లో మాత్రమే కలవాలనే నియామాల్ని కూడా పెట్టుకుంటూ ఉంటారు. వాస్తవానికి ఇలా శృంగారం తర్వాత అలసిపోవడానికి కారణాలు అనేకం.. వాటిని తెలుసుకుంటే మీ రోజువారి శృంగారం జీవితాన్ని చక్కగా ఆస్వాదించొచ్చు.

ఎందుకు అలసిపోతారు?

2020లో ఎవల్యూషనరీ బిహేవియరల్ సైన్సెస్‌లో వచ్చిన పరిశోధన కథనం ప్రకారం..శృంగారం తర్వాత స్త్రీలకు భావప్రాప్తి కలిగినా.. కలగపోయినా పురుషుల కంటే వారు త్వరగా అలసిపోయి నిద్రపోతారు. శృంగార సమయంలో ఆక్సిటోసిన్, ప్రోలాక్టిన్ అనే హార్మోన్‌లు శరీరంలో విడుదల అవుతాయి. ఇవి రెండూ నిద్రను ప్రోత్సహించేవే. అందుకే శృంగారం తర్వాత చాలా మంది వెంటనే నిద్రలోకి జారుకుంటూ ఉంటారు

శృంగారంతో 69 కేలరీలు బర్న్

ఫోర్‌ప్లేతో కలిపి 25 నిమిషాల పాటు సాగే శృంగార సెషన్‌తో మహిళల్లో సగటున 69 కేలరీలు బర్న్ అవుతాయి. కాబట్టి శృంగారాన్ని ఒక వ్యాయామంగా కూడా పరిగణించవచ్చు . అందుకే చాలా మంది విశ్రాంతి తీసుకోవాలనే తలంపుతోనే శృంగారంలో పాల్గొంటారట. శ‌ృంగారం తర్వాత శరీరంలోని కండరాలపై ఒత్తిడి తగ్గి.. ఉపశమనంగా అనిపించొచ్చు.

మీరు నిద్రలేమి సమస్యను ఎదుర్కొంటున్నప్పుడు శృంగారం మిమ్మల్ని అలసిపోయేలా చేస్తుంది. దాంతో వేగంగా నిద్రలోకి జారుకుంటారు. లైంగిక చర్య సాధారణంగా రక్తంలో చక్కెర స్థాయిని తగ్గిస్తుంది. ప్రత్యేకించి మీరు శృంగారానికి కొన్ని గంటల ముందు నీరు లేదా ఆహారం తీసుకోకపోతే అది మీ అలసటకు దారితీస్తుంది.

ఈ సంకేతాలు కనిపిస్తే జాగ్రత్త

శృంగారం తర్వాత అలసిపోవడం సాధారణమైనప్పటికీ, కొన్ని సంకేతాలు ఉంటే మాత్రం మీరు జాగ్రత్తలు తీసుకోవాలి. మీరు శృంగారం తర్వాత గంటలు లేదా రోజుల పాటు తీవ్రమైన అలసటను అనుభవిస్తే అది రక్తహీనత లేదా థైరాయిడ్ సమస్య కావచ్చు. కాబట్టి నిర్ధారించుకోవడానికి వైద్యుడిని సంప్రదించండి. అలసటతో పాటు వెన్నునొప్పి, తలనొప్పి, వికారం, మైకం లేదా శ్వాస ఆడకపోవడం వంటి ఇతర లక్షణాలు ఉంటే మీరు తప్పకుండా సంబంధిత వైద్యడిని సంప్రదించాలి.
 

ఫోర్‌ప్లే మర్చిపోవద్దు

మీ శరీరం ఇచ్చే అలసట సంకేతాల్ని అనుసరించి శృంగారంలో విరామం తీసుకుంటూ.. ఆ అనుభూతిని ఆస్వాదించండి. నేరుగా సంభోగం కంటే ఫోర్‌ప్లేలో ద్వారా మీ భాగస్వామికి దగ్గరయ్యి.. ఆ తర్వాత ఇద్దరూ శృంగారాన్ని ఎంజాయ్ చేయవచ్చు. శృంగారం ద్వారా మీ బంధాలను మరింత బలపోతం చేసుకోవచ్చు. అలానే భాగస్వామిని అర్థం చేసుకోవడం, గౌరవించడం ద్వారా ప్రేమ జీవితాన్ని మరింత పదిలం చేసుకోవచ్చు.

Whats_app_banner