ఆ కొండపై శృంగార పండుగ.. తెలియనివారితో శృంగారం చేయోచ్చు
శృంగారం గురించి మాట్లాడితే అదో రకంగా చూస్తారు. కానీ ఓ ప్రాంతంలో మాత్రం.. శృంగార పండుగ నిర్వహిస్తారు. అది ఎక్కడో.. దాని వెనుక కథ ఏంటో తెలుసుకుందాం..
లైంగికత గురించి మాట్లాడటం.. ప్రపంచంలోని అనేక ప్రాంతాలలో తప్పుగా పరిగణిస్తారు. ఎందుకంటే అవి సాంప్రదాయ విలువలకు విరుద్ధంగా ఉన్నట్లుగా భావిస్తారు. కానీ ఓ ప్రాంతంలో మాత్రం.. శతాబ్దాల నాటి ఆచారాలు, నమ్మకాలు వేరేలా ఉన్నాయి. అక్కడ శృంగారం కోసం ప్రత్యేకంగా ఓ పండగనే నిర్వహిస్తారు. అది కూడా.. అపరిచిత వ్యక్తులతో చేయాలి. వింతగా ఉందా.. కానీ ఇది నిజం.
కొత్తవారితో మాట్లాడాలి అంటేనే.. ఇబ్బంది. డైరెక్ట్ శృంగారం అంటే.. మాటాలా? అయినా.. ఈ తిక్క.. తిక్క ఏంటి అనుకుంటున్నారా? అసలు విషయం వేరే ఉంది. ఇండోనేసియాలోని ఓ కొండపై అపరిచితులతో శృంగారంలో పాల్గొంటే అదృష్టం కలిసి వస్తుందట. దీన్ని చాలా బలంగా నమ్ముతారు అక్కడి వాళ్లు. జావా ద్వీపంలో కెముకస్ అనే పర్వతంపై ఈ శృంగారం నిర్వహిస్తారు. అపరిచితులతో కలిసేవారికి.. అంతకుముందు పెళ్లైన కూడా పర్వాలేదట. అట్లుంది అక్కడ ఆచారం. ఇంతకీ ఇలాంటి ఫెస్టివల్ అక్కడ ఎందుకు చేస్తారు?
అయితే ఈ ఆచారం ఇండోనేషియాలో వందల ఏళ్లుగా కొనసాగుతోంది. యాత్రికులు గునుంగ్ కెముకుల అనే ప్రాంతానికి వచ్చి కలుస్తారు. ఒకరికి ఒకరు నచ్చితే.. కలిసి వెళ్తారు. దీని వెనుక పెద్ద కథే ప్రచారంలో ఉంది. 16వ శతాబ్దంలో ఒక రాజు పరిపాలించాడు. అతనికి ఓ కొడుకు ఉన్నాడు. అతను తన సవతి తల్లి ఒంట్రోవులన్‌తో శారీరక సంబంధం కలిగి ఉన్నాడని ప్రజల నమ్మకం. ఈ విషయం రాజుకు తెలుస్తుంది. వెంటనే ఇద్దరూ అదే రాజ్యంలో మరొక ప్రాంతానికి పారిపోయారు. వారు శృంగారంలో ఉండగా.. వారిని చూసిన స్థానికులు చంపేస్తారు. చనిపోయే ముందు.. ఎవరైతే వారి సమాధి దగ్గర సంభోగం చేస్తారో.. వారికి మేలు జరుగుతుందని చెబుతారు.
అప్పటి నుంచి వేలాది మంది ఇక్కడి వస్తుంటారు. అపరిచితులతో శృంగారం చేసి.. తమ అదృష్ఠాన్ని పరీక్షించుకుంటారు. అయితే ఇక్కడ ఇష్టం వచ్చినట్టుగా చేయడం ఉండదు. దీనికంటూ ఓ ప్రాసెస్ ఉంది. ఫెస్టివల్ జరిగే సమయంలో.. ఉదయాన్నే.. ప్రార్థన జరుగుతుంది. రాకుమారుడు, అతడి సవతి తల్లి సమాధి దగ్గర పూలు ఉంచుతారు. స్నానాలు చేసి.. తమ భాగస్వామి కోసం వెతుకుతారు.
రాత్రిపూట ఇక్కడ జంటలు శృంగారంలో పాల్గొంటారు. 35వ రోజున తప్పకుండా కలయికలో పాల్గొనాలి. ఏడుసార్లు చేయాలి. ఒకరికొకరు మొబైల్ నంబర్లు, అడ్రసులు కూడా ఇచ్చేసుకుంటారు. అయితే కొన్ని కొన్ని జంటలు ప్రేమలో కూడా పడిన సందర్భాలూ ఉన్నాయి. అంతేకాదు.. సుఖవ్యాధుల బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకునేలా ప్రభుత్వం కూడా అవగాహన కల్పిస్తోంది.