International Bikini day: అంతర్జాతీయ బికినీ డే, ఈ పొట్టి డ్రెస్సును తొలిసారి ధరించిన అమ్మాయి ఎవరో తెలుసా?-international bikini day do you know the girl who wore this short dress for the first time ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  International Bikini Day: అంతర్జాతీయ బికినీ డే, ఈ పొట్టి డ్రెస్సును తొలిసారి ధరించిన అమ్మాయి ఎవరో తెలుసా?

International Bikini day: అంతర్జాతీయ బికినీ డే, ఈ పొట్టి డ్రెస్సును తొలిసారి ధరించిన అమ్మాయి ఎవరో తెలుసా?

Haritha Chappa HT Telugu
Jul 05, 2024 03:04 PM IST

International Bikini day: సముద్ర తీరంలో బికినీలు ధరించి సరదాగా గడపడం ఈ రోజుల్లో ఎంతోమంది అమ్మాయిలు తిరుగుతూ ఉంటారు. తొలిసారి బికినీ ఎవరు వేసుకున్నారో, దాన్ని ఎవరు తయారు చేశారో తెలుసుకోండి.

అంతర్జాతీయ బికినీ దినోత్సవం
అంతర్జాతీయ బికినీ దినోత్సవం (shutterstock)

బికినీ వేసుకుని సముద్రతీరంలో అందమైన చేపల్లా ఈదే యువతులు ఎంతో మంది. ఆ బికినీల్లో అమ్మాయిలు మెరుపు తీగల్లా కనిపిస్తారు. టూ పీస్ డ్రెస్సుగా పేరు తెచ్చుకుంది బికినీ. దీని పేరు చెబితేనే మనదేశంలో ఎంతో మంది అమ్మాయిలు సిగ్గుతో ముడుచుకుపోతారు. కానీ పాశ్చాత్య దేశాల్లో యువతులు మాత్రం నిత్యం బికినీల్లో సముద్రపు ఒడ్డున జల కన్యల్లా కనిపిస్తూ ఉంటారు. బికినీ అనే పదం పుట్టుక వెనుక ఒక చరిత్ర ఉంది.

అంతర్జాతీయ బికినీ దినోత్సవం ప్రతి సంవత్సరం జూలై 5 న నిర్వహించుకుంటారు. బీచ్ వాక్ కు అమ్మాయిలలో బికినీ బాగా ఫేమస్. కానీ తొలిసారి బికినీని తయారు చేసినప్పుడు దాన్ని ధరించడానికి ఎవరూ ఇష్టపడలేదు. 1946లో తొలిసారిగా జూలై 5న బికినీని తయారు చేశారు. అందుకే ఈ రోజును బికినీ డేగా జరుపుకుంటారు. బికినీ మహిళల స్వేచ్ఛ, స్వాతంత్య్రంతో ముడిపడి ఉంది.

బికినీ రూపకర్త

ఫ్రెంచ్ డిజైనర్ లూయిస్ రీర్డ్ మొదట బికినీని తయారుచేశాడు. మొదట్లో మోడల్స్ ఈ టూ పీస్ డ్రెస్ ను వేసుకునేందుకు ఇష్టపడలేదు. బికినీలో శరీరమంతా కనిపిస్తుండడంతో అప్పట్లో అమ్మాయిలు వేసుకోవడానికి అయిష్టత చూపించారు. చివరికి మిషెల్లీ బెర్నార్డి అనే అమ్మాయి బికినీ ధరించేందుకు ఒప్పకుంది. ఆమె అప్పట్లోనే న్యూడ్ గా డ్యాన్సులు చేసేది. ఆమెకు అదే జీవనాధారం.

బికినీ పేరెలా వచ్చింది?

ఈ టూ పీస్ క్లాత్ పేరు వెనుక ఒక కథ కూడా ఉంది. నిజానికి బికినీ తయారు చేసిన ప్రదేశానికి బికినీ అటోల్ అని పేరు పెట్టారు. పసిఫిక్ మహాసముద్రంలోని మార్షలీస్ అనే దీవుల సమూహం ఉన్నాయి. అందులో ఒక దీవి పేరు ‘బికినీ అటోల్’. ఈ దీవిలోనే అమెరికా తొలిసారి అణుబాంబు పరీక్షలు నిర్వహించింది. ఈ దీవి పేరునే తీసుకుని లూయిజ్ రియర్డ్ తాను రూపొందించిన టూ పీస్ డ్రెస్ కు పెట్టాడు.

దాదాపు అప్పట్లోని అందరు మోడల్స్, నటీమణులు తొలిసారి బికినీని ధరించడానికి నిరాకరించారు. ప్రకటనల కోసం ఎంత డబ్బు ఇస్తామన్న ఎవరూ ముందుకు రాలేదు. అప్పుడు 19 ఏళ్ల డ్యాన్సర్ మిషెల్లీ బెర్నార్డిని బికినీ ధరించింది. ఆ తర్వాత ప్రపంచవ్యాప్తంగా బికినీ ప్రాచుర్యం పొందింది.

బికినీ కనిపెట్టిన తర్వాత పలు దేశాల్లో దీన్ని నిషేధించారు. ఇందులో ఇటలీ, అమెరికా, స్పెయిన్ ఉన్నాయి. కానీ బికినీ వేసుకోవడం అనేది మహిళా స్వేచ్ఛకు, భావ ప్రకటనా స్వేచ్ఛకు మధ్య ఉన్న సంబంధం కారణంగా నిషేధాన్ని ఎత్తివేశారు. కేవలం 4 సంవత్సరాల తర్వాత 1950లో బికినీపై నిషేధాన్ని ఎన్నో దేశాలు ఎత్తి వేశాయి. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా బికినీలకు ఫుల్ డిమాండ్ ఉంది. ఇటలీ, స్పెయిన్ వంటి దేశాల మార్కెట్లలో బికినీలకు చాలా డిమాండ్ ఉంది.

బికినీలలో ఇప్పుడు ఎన్నో రకాలు వచ్చాయి. బాండేకిని... అంటే ఎలాంటి స్ట్రాప్స్ లేకుండా వక్షోజాలను పట్టి ఉంటుంది. మైక్రోకిని, మోనోకిని, ఫ్యూబికిని, స్కర్టిని, స్ట్రింగ్ బికినీ.. ఇలా టూ పీస్ క్లాత్ రకరకాల అవతారాలు ఎత్తింది.

Whats_app_banner