Semya Dosa Recipe : ఇన్‌స్టంట్‌గా తయారు చేసుకోగలిగే సేమ్యా దోశ.. రెసిపీ చాలా సింపుల్
Semya Dosa Recipe : మీరు ఇప్పటివరకు చాలా దోశలు తిని ఉంటారు. కానీ మీరు ఎప్పుడైనా సేమ్యా దేశ తిన్నారా? కనీసం విన్నారా? అయితే మీరు ఈసారి సేమ్యా దోశ ట్రై చేయండి. మళ్లీ మళ్లీ అదే కావాలని అంటారు.
Semya Dosa Recipe : ఉదయాన్నే బ్రేక్‌ఫాస్ట్‌లలో దోశకు ఎప్పుడూ ప్రత్యేక స్థానం ఉంటుంది. అందులోనూ కరకరలాడే దోశ ప్లేస్ వేరు. అయితే మీరు సేమ్యాలతో కూడా ఇలాంటి టేస్టీ, కరకరలాడే దోశను తయారు చేసుకోవచ్చని తెలుసా? పైగా ఇది చాలా ఈజీ రెసిపీ. తయారు చేయాడానికి ఎక్కువ సమయం కూడా పట్టదు. మరి దీనిని ఎలా తయారు చేయాలి? కావాల్సిన పదార్థాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
కావాల్సిన పదార్థాలు
* సేమియా - ½ కప్పు
* బియ్యం పిండి - 1 కప్పు
* రవ్వ - ¼ కప్పు
* జీలకర్ర - 1 tsp
* ఉప్పు - తగినంత
* నీరు - 5 కప్పులు
* ఉల్లిపాయ - 1 (సన్నగా తరిగిన)
* క్యారెట్ - 1 (తురిమిన)
* కరివేపాకు - కొన్ని (తరిగిన)
* కొత్తిమీర - 2 టేబుల్ స్పూన్ (తరిగిన)
* పచ్చిమిర్చి - 2 (సన్నగా తరిగినవి)
* అల్లం - 1 అంగుళం (తురిమిన)
* నూనె - వేయించడానికి
తయారీ విధానం
ముందుగా ½ కప్పు సేమియాను బంగారు గోధుమ రంగులోకి వచ్చే వరకు వేయించాలి. పూర్తిగా చల్లారిన తర్వాత, దానిని పెద్ద గిన్నెకు బదిలీ చేయండి. దానిలో బియ్యం పిండి, రవ్వ, జీలకర్ర, ఉప్పు, నీరు వేసి బాగా కలపండి. దానిని కవర్ చేసి 10 నిమిషాలు పక్కన పెట్టేయండి.
అనంతరం దానిలో ఉల్లిపాయ, క్యారెట్, కరివేపాకు, కొత్తిమీర, పచ్చిమిర్చి, అల్లం వేసి బాగా కలపండి. ఇంకా నీరు పడుతుంది అనుకుంటే.. నీళ్లు వేయండి. ఇప్పుడు వేడిగా ఉన్న పాన్ మీద పిండిని వేయండి. అంచుల వెంబడి నూనె వేసి.. దోశను కాల్చండి. దీనిని ఉల్లిపాయ చట్నీతో తింటే మరింత టేస్ట్ మీరు పొందవచ్చు.
సంబంధిత కథనం