Curd Dosa Recipe | కనుమ నాడు కమ్మని బ్రేక్‌ఫాస్ట్.. పెరుగు దోశ, దీని రుచికి తిరుగు లేదు!-relish the taste of curd dosa in your breakfast on the day of festival of feast kanuma ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Curd Dosa Recipe | కనుమ నాడు కమ్మని బ్రేక్‌ఫాస్ట్.. పెరుగు దోశ, దీని రుచికి తిరుగు లేదు!

Curd Dosa Recipe | కనుమ నాడు కమ్మని బ్రేక్‌ఫాస్ట్.. పెరుగు దోశ, దీని రుచికి తిరుగు లేదు!

HT Telugu Desk HT Telugu
Jan 16, 2023 06:06 AM IST

Curd Dosa Recipe: కనుమ పండగ నాడు కమ్మగా తినండి, ప్రత్యేకమైన పెరుగు దోశ రెసిపీ ఇక్కడ ఉంది. ఇలా ఒకసారి దోశలను తిని చూడండి.

Curd Dosa Recipe
Curd Dosa Recipe (Slurrp)

కనుమ పండగ అంటేనే కమ్మని విందులు చేసుకునే ఒక సందర్భం. మరి ఈ ప్రత్యేకమైన రోజున ఎప్పుడూ తినేలా కాకుండా మరింత ప్రత్యేకమైన రుచులను ఎందుకు ఆస్వాదించకూడదు? అందుకే మీ కోసం ఇక్కడ ఒక స్పెషల్ రెసిపీని పరిచయం చేస్తున్నాం. చాలా మందికి దోశ ఇష్టమైన అల్పాహారం, ఇందులో చాలా వెరైటీలు ఉంటాయి. అయితే మీరు ఎప్పుడైనా పెరుగు దోశ తిన్నారా? ఈ పెరుగు దోశ తయారు చేసే విధానం కాస్త విభిన్నంగా ఉంటుంది, కానీ రుచిలో అద్భుతంగా ఉంటుంది.

ఈ పెరుగు దోశను అటుకులతో కలిపి చేస్తారు, కాబట్టి దీనిని అటుకుల దోశ, పోహ దోశ అని కూడా పిలుస్తారు. ఈ రకమైన దోశలు మెత్తగా, మృదువుగా ఉంటాయి. వీటిని ఉదయం అల్పాహారంలా మాత్రమే కాకుండా మధ్యాహ్నం మాంసాహారం అద్దుకుంటూ తినడానికి, ప్రయాణాలలో చిరుతిండిగా, రాత్రికి అల్పాహారంగా కూడా తినవచ్చు.

మరి ఆలస్యం చేయకుండా పెరుగు దోశ తయారీకి కావలసిన పదార్థాలు, తయారీ విధానం తెలుసుకోండి. పెరుగు దోశ రెసిపీ ఇక్కడ ఉంది. ఇక్కడ ఇచ్చిన సూచనల ప్రకారం సులభంగా సిద్దం చేసుకోవచ్చు.

Curd Dosa Recipe కోసం కావలసినవి

  • 1 కప్పు ఇడ్లీ బియ్యం లేదా సోనా మసూరి రైస్
  • 1/2 కప్పు మందపాటి అటుకులు
  • 2 టేబుల్ స్పూన్లు మినప పప్పు
  • 1/2 కప్పు పెరుగు, 1 కప్పు నీరు
  • 1/4 టీస్పూన్ బేకింగ్ సోడా
  • 1/2 టీస్పూన్ ఉప్పు
  • దోశలు కాల్చటానికి నూనె

పెరుగు దోశ తయారీ విధానం

  1. ముందుగా సాదా పెరుగును తీసుకొని మజ్జిగ చేసుకోవాలి, మరోవైపు అటుకులు, బియ్యం, మినప పప్పును రెండు సార్లు నీటితో శుభ్రం చేసుకోవాలి.
  2. మజ్జిగలో అటుకులు, బియ్యం, మినప పప్పును 2-3 గంటల పాటు నానబెట్టండి.
  3. ఆపై గ్రైండర్‌లో వేసి అవసరం మేరకు నీళ్లు పోసుకొని మెత్తని బ్యాటర్ చేసుకోండి.
  4. ఈ పిండి బ్యాటర్‌లో బేకింగ్ సోడా, ఉప్పు వేసి 4- 5 గంటలు పులియబెట్టండి.
  5. అనంతరం పాన్ వేడి చేసి, పులియబెట్టిన పిండితో దోశలు చేసుకోండి.

పెరుగు దోశలు రెడీ కొబ్బరి చట్నీ, సాంబార్‌తో వడ్డించుకుంటే చాలా రుచిగా ఉంటాయి.

WhatsApp channel

సంబంధిత కథనం

టాపిక్