Spring Onion Dosa Recipe : వింటర్ సీజన్లో స్ప్రింగ్ ఆనియన్ దోశ.. రెసిపీ ఇదే..
Spring Onion Dosa Recipe : చాలా మంది టిఫెన్ అనగానే దోశకోసం ఎదురు చూస్తూ ఉంటారు. అయితే ఈ దోశలను మనం రకరకాలుగా వేసుకుంటాము. ఇప్పుటివరకు ఎన్నో దోశలు రుచి చూసిన మీరు.. ఒక హెల్తీ, టేస్టీ దోశను తినాలనుకుంటే స్ప్రింగ్ ఆనియన్ దోశను ట్రై చేయండి.
Spring Onion Dosa Recipe : స్ప్రింగ్ ఆనియన్ దోశ అనేది రుచికరమైన దోశ. దీనిని స్ప్రింగ్ ఆనియన్స్‌తో తయారు చేస్తారు కాబట్టి ఇవి మంచి టేస్ట్, స్మెల్ కలిగి ఉంటాయి. సాధారణందా స్ప్రింగ్ ఆనియన్స్‌ను సలాడ్‌లు, సూప్‌లు, చట్నీలలో ఉపయోగిస్తారు. అయితే వీటిని మనం దోశల్లో కూడా ఉపయోగించవచ్చు. మరి దీనిని ఎలా తయారు చేయాలి? కావాల్సిన పదార్థాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
కావాల్సిన పదార్థాలు
* స్ప్రింగ్ ఆనియన్ - 1 కప్పు తరిగినవి
* బియ్యం - 2 కప్పులు
* పోహా - 1/2 కప్పు
* మిన పప్పు - 2 టేబుల్ స్పూన్లు
* మెంతి గింజలు - 1 టేబుల్ స్పూన్
* ఎండు మిరపకాయలు - 6
* తాజా కొబ్బరి - 1/4 కప్పు
* బెల్లం - 2 టేబుల్ స్పూన్లు, తురిమినది
* నీరు - తగినంత
* నూనె - తగినంత
* ఉప్పు - రుచికి తగినంత
స్ప్రింగ్ ఆనియన్ దోశ తయారీ విధానం
స్ప్రింగ్ ఆనియన్ దోశ కోసం.. బియ్యాన్ని బాగా కడిగి.. 4 గంటలు నీటిలో నానబెట్టండి. మిన పప్పు, మెంతి గింజలను విడివిడిగా మరో గిన్నేలో 4 గంటల ముందు నానబెట్టండి. అనంతరం మినపప్పు, బియ్యం, మెంతి గింజలను మిక్సీ చేసుకోవాలి. దీనిని ప్రారంభించడానికి 15 నిముషాల ముందు నీటిలో పోహాను నానబెట్టండి. ఇప్పుడు మిక్సీ జార్‌లో నానబెట్టిన పోహా, ఎర్ర మిరపకాయలు, కొబ్బరి వేసి మెత్తగా మిక్సీ చేసుకోవాలి.
ఈ పిండిని ఓ గిన్నెలోకి తీసుకుని.. అన్ని బాగా కలపండి. అనంతరం తురిమిన బెల్లం వేసి బాగా కలపండి. తర్వాత సన్నగా తరిగిన స్ప్రింగ్ ఆనియన్ పిండిలో వేసి.. ఉప్పు వేసి బాగా కలపాలి. మీడియం మందపాటి పిండిని సిద్ధం చేయడానికి అవసరమైన నీటిని వేసి కలపండి. ఇప్పుడు దోశ పాన్ వేడి చేసుకుని దానిపై ఈ పిండితో దోశ వేసుకోవాలి. దోశను రెండు వైపులా సరిగ్గా ఉడికించాలి. అంతే వేడి వేడి స్ప్రింగ్ ఆనియన్ దోశ రెడీ. మీకు నచ్చిన చట్నితో దీనిని హ్యాపీగా లాగించేయవచ్చు.
సంబంధిత కథనం