Happy Kanuma 2023 Greetings । కనుమ శుభాకాంక్షలు.. కమ్మని విందులతో కలకాలం వేడుకలు జరుపుకోవాలి!
Happy Kanuma 2023 Greetings: మీ ఆత్మీయులకు కనుమ శుభాకాంక్షలు తెలియజేయండి. ఇక్కడ Kanuma Shubhakankshalu, Kanuma Messages, Happy Kanuma Greetings, Happy Kanuma Wishes అందిస్తున్నాం చూడండి.
Happy Kanuma 2023: సంక్రాంతి పండగలో భాగంగా మూడవ రోజు జరుపుకునే పండుగను కనుమ అంటారు. దీనిని పశువుల పండుగగా కూడా చెబుతారు. ఇది వ్యవసాయదారులు, రైతులు పాడి పశువులు ఉన్న వారందరూ జరుపుకునే పండగ. వ్యవసాయంలో పశువులు కూడా భాగమే, ఏడాదంతా పంటలు పండించే రైతులకు చేదోడుగా పశువులు ఉంటాయి. దుక్కి దున్నడంలో, ధాన్యరాశులు మోయడంలో పశువులు సేవ చేస్తాయి. రైతుల జీవితంలో ఆవులు, గేదేలు వంటి పాడి పశువుల పాత్ర ఎంతో ఉంటుంది. ఈ నేపథ్యంలో వ్యవస్యాయ పండుగ అయిన మకర సంక్రాతి పండుగల వరుసలో కనుమను పశుపక్షాదులకు అంకితం ఇస్తారు. సంవత్సరం పాటు సహాయకరంగా ఉండే మూగజీవులని ఆరాధించే రోజిది.
కనుమ రోజున గోవుల పూజ, గోవర్ధన పూజ కూడా చేస్తారు, ఈ పండుగకు ఎంతో ఆధ్యాత్మిక ప్రాముఖ్యత ఉంది. పురాణాల ప్రకారం, గోకులంలో భారీ వరదలు వచ్చినప్పుడు ప్రజలను రక్షించడానికి శ్రీకృష్ణుడు తన చిటికెన వేలితో గోవర్ధన కొండను ఎత్తుకుని ఆపదలో ఉన్న ప్రజలను, పశుపక్షాదులను రక్షిస్తారు. శ్రీకృష్ణుడికి గోవులంటే ఎంతో మక్కువ ఈ నేపథ్యంలో కనుమ రోజున గోవుల ఆరాధన చేస్తారు.
కనుమకు ఉన్న మరొక విశిష్టత ఏమిటంటే.. ఈరోజున కుటుంబ సభ్యులు, బంధువులు అంతా కలిసి విందు భోజనాలు చేయాలి. ముఖ్యంగా ఇంటికి వీచ్చేసిన అల్లుళ్లను మాంసాహార వంటలతో విందు ఏర్పాటు చేస్తారు. కుటుంబ సభ్యులంతా కలిసి ఎల్లప్పుడూ ఇంతే ఆనందంగా ఉండాలి, మళ్లీ ఏడాదికి కూడా పంటలు సమృద్ధిగా పండాలని వేడుక చేసుకుంటారు.
మరి ఈ కనుమ రోజున మీరు కూడా ఆనందంగా విందులు, వేడుకలు చేసుకోండి. మీ ఆత్మీయులకు కనుమ శుభాకాంక్షలు తెలియజేయండి. మీరు కనుమ శుభాకాంక్షలు తెలియజేసేందుకు, సామాజిక మాధ్యమాలలో పంచుకునేందుకు ఇక్కడ Kanuma Shubhakankshalu, Kanuma Messages, Happy Kanuma Greetings, Happy Kanuma Wishes అందిస్తున్నాం చూడండి.
Happy Kanuma 2023 Greetings- కనుమ శుభాకాంక్షలు
- ఈ కనుమ పర్వదినాన్ని మీ కుటుంబ సభ్యులంతా కలిసి గొప్పగా జరుపుకోవాలని, ఈ సంక్రాంతి వేడుకలు ఏడాదికి సరిపోయే మధుర జ్ఞాపకాలు మిగిల్చాలని ఆకాంక్షిస్తూ- కనుమ శుభాకాంక్షలు!
- కమ్మని విందుల కనుమ, కలకాలం మీ బంధాలను నిలిపి ఉంచాలి, మీరు ఎల్లప్పుడూ సంతోషంగా ఉండాలని కోరుకుంటూ- కనుమ శుభాకాంక్షలు!
- కనుమలోని కమనీయం మీ జీవితాన్ని రమణీయంగా మార్చాలని మనస్ఫూర్థిగా కోరుకుంటూ - కనుమ శుభాకాంక్షలు!
- మిత్రులకు, శ్రేయోభిలాషులకు, ఆత్మీయులకు, నా ప్రియమైన వారందరికీ మకర సంక్రాంతి- కనుమ శుభాకాంక్షలు!
- మీ ఇల్లు ధాన్యరాశులతో నిండుగా, పాడి పంటలతో పచ్చగా, ఎల్లప్పుడూ సంతోషంగా ఉండాలని- కనుమ శుభాకాంక్షలు!
- ఈ కనుమ మీ కష్టాలన్నింటినీ తొలగించి, సుఖ సంతోషాలు, సిరిసంపదలు అందించాలని కోరుకుంటూ- కనుమ శుభాకాంక్షలు!
ఈ సందేశాలను మీ ఆత్మీయులతో పంచుకోండి.. కమ్మనైన కనుమ వేడుకలు మళ్లీ మళ్లీ జరుపుకోండి. మరొక్క సారి తెలుగు వారందరికీ హిందూస్తాన్ టైమ్స్- తెలుగు తరఫున కనుమ శుభాకాంక్షలు.
సంబంధిత కథనం