Indian Toilet Vs Western Toilet : ఇండియన్ టాయిలెట్ Vs వెస్ట్రన్ టాయిలెట్.. ఆరోగ్యానికి ఏది బెటర్?-indian toilet vs western toilet why indian toilets better than western toilets ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Indian Toilet Vs Western Toilet : ఇండియన్ టాయిలెట్ Vs వెస్ట్రన్ టాయిలెట్.. ఆరోగ్యానికి ఏది బెటర్?

Indian Toilet Vs Western Toilet : ఇండియన్ టాయిలెట్ Vs వెస్ట్రన్ టాయిలెట్.. ఆరోగ్యానికి ఏది బెటర్?

Anand Sai HT Telugu
Mar 12, 2024 04:30 PM IST

Indian Toilet Vs Western Toilet : ఈ రోజుల్లో దాదాపు అన్ని ఇళ్లలో వెస్ట్రన్ టాయిలెట్ల వాడకం పెరిగింది. భారతీయ టాయిలెట్ చాలా తక్కువ ఇళ్లలో మాత్రమే కనిపిస్తుంది. అయితే ఇందులో ఏ రకమైన టాయిలెట్ ఆరోగ్యానికి మంచిదో తెలుసుకోవాలి.

ఇండియన్ టాయిలెట్ Vs వెస్ట్రన్ టాయిలెట్
ఇండియన్ టాయిలెట్ Vs వెస్ట్రన్ టాయిలెట్

ఒకప్పుడు బహిరంగ మరుగుదొడ్ల వ్యవస్థపైనే ఆధారం ఉండేది. తర్వాత మరుగుదొడ్లు నిర్మించుకునే విధానం వచ్చింది. మొదట్లో గ్రామానికి మరుగుదొడ్డి, తర్వాత ఇంటింటికీ మరుగుదొడ్ల నిర్మాణం వచ్చాయి. మరుగుదొడ్లు నిర్మించేందుకు ప్రభుత్వం ప్రణాళికలు కూడా మెుదలుపెట్టింది. క్రమంగా విదేశీ సంస్కృతిని అనుసరించి ఇళ్లలో విదేశీ టాయిలెట్ కమోడ్‌లను తీసుకొచ్చారు. వెస్ట్రన్ టాయిలెట్ వాడకం ఎక్కువైంది.

చాలా గృహాలు వెస్ట్రన్ టాయిలెట్లను పెట్టుకున్నప్పటికీ అనేక మంది భారతీయ-శైలి టాయిలెట్లను ఇష్టపడతారు. వెస్ట్రన్ టాయిలెట్లు సౌకర్యవంతంగా ఉన్నాయని చెప్పినప్పటికీ, వాటి వల్ల అనేక నష్టాలు కూడా ఉంటాయి.

ఇదోక వ్యాయామం

భారతీయ టాయిలెట్లలో కూర్చోవడం, నిలబడటం రోజువారీ వ్యాయామం అవుతుంది. ఇది మొత్తం ఆరోగ్యానికి మంచిది. వ్యాయామం ప్రాముఖ్యత మనలో చాలా మందికి తెలిసినప్పటికీ, మనం దానిని నిర్లక్ష్యం చేస్తాం. భారతీయ మరుగుదొడ్లపై కూర్చోవడం ఒక చిన్న వ్యాయామ కార్యకలాపం అవుతుంది. ఇది రక్త ప్రసరణను పెంచుతుంది. మీ చేతులు, కాళ్ళకు మంచి వ్యాయామం.

జీర్ణక్రియకు ఉపయోగం

ఇండియన్ టాయిలెట్లపై కూర్చోవడం వలన జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. స్క్వాటింగ్ మీ కడుపుని పిండుతుంది, ఇది కడుపులోని ఆహారాన్ని కుదించడం ద్వారా జీర్ణక్రియలో సహాయపడుతుంది. పాశ్చాత్య తరహా టాయిలెట్‌పై కూర్చోవడం వల్ల కడుపుపై ​​ఎలాంటి ఒత్తిడి ఉండదు.

వెస్ట్రన్ మరుగుదొడ్లకు టాయిలెట్ పేపర్‌ను ఉపయోగించడం అవసరం. ఇది మంచిది కాదు. భారతీయ టాయిలెట్లతో పోలిస్తే వెస్ట్రన్ టాయిలెట్లకు మరింత ఎక్కువ నీరు అవసరం.

గర్భిణులకు మంచిది

భారతీయ టాయిలెట్లను ఉపయోగించడం వల్ల గర్భిణీ స్త్రీలకు మంచిది. గర్భాశయంపై ఒత్తిడి ఉండదు. భారతీయ టాయిలెట్‌ని క్రమం తప్పకుండా ఉపయోగించడం వల్ల సాఫీగా, సహజంగా ప్రసవానికి సిద్ధమవుతారని చెబుతారు. ఎందుకంటే ఇదోక వ్యాయామంలాగా జరుగుతుంది. మలబద్ధకం, అపెండిసైటిస్ ఇతర కారకాల అవకాశాలను నివారిస్తుంది.

వెస్ట్రన్ టాయిలెట్ సమస్యలు

వెస్ట్రన్ టాయిలెట్ షీట్‌కు కూడా చాలా ప్రయోజనాలు ఉన్నాయి. వెస్ట్రన్ టాయిలెట్ ముఖ్యంగా కాలు నొప్పి సమస్య కారణంగా కూర్చోలేని వారికి, కీళ్ల నొప్పులతో బాధపడేవారికి చాలా సౌకర్యంగా ఉంటుంది. అయితే దీని వల్ల నష్టాలు ఎక్కువగా ఉన్నాయి. ఆరోగ్యకరమైన వ్యక్తులు కూడా వెస్ట్రన్ టాయిలెట్ ఉపయోగిస్తున్నారు. దీనితో అనారోగ్యానికి గురవుతారు.

వెస్ట్రన్ టాయిలెట్‌కి వెళ్లే అలవాటు వల్ల శరీరంలో ఇన్‌ఫెక్షన్లు వచ్చే ప్రమాదం ఉంది. అతిసారం, అనేక కడుపు సమస్యలను కలిగిస్తుంది. వెస్ట్రన్ టాయిలెట్ సీటును ఉపయోగించినప్పుడు చర్మందానికి తగులుతుంది. దీంతో క్రిములు సులభంగా వ్యాపిస్తాయి. దీని ఎక్కువగా ఉపయోగిస్తే ఆరోగ్య సమస్యలు కూడా పెరుగుతుంది. అందుకే ఇండియన్ టాయిలెట్ వాడండి.

Whats_app_banner