Immunity Boosting Herbs : ఇమ్యూనిటీ పెంచుకోవాలంటే టీతో పాటు.. వీటిని కలిపి తీసుకోండి..
Immunity Boosting Herbs : చలికాలంలో రోగనిరోధక శక్తి చాలా అవసరం. ఎందుకంటే ఈ సమయంలోనే సీజనల్ వ్యాధులు వచ్చే అవకాశం ఎక్కువ. అయితే.. దీనికోసం పెద్దగా ఇబ్బంది పడకుండా.. మీ టీతో పాటు కొన్ని మూలికలు కలిపి తీసుకుంటే.. మీ ఇమ్యూనిటీ పెరుగుతుంది అంటున్నారు నిపుణులు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
Immunity Boosting Herbs : కరోనా ఎఫెక్ట్ వల్ల చాలా మంది తమ రోగ నిరోధక శక్తిని పెంచుకోవడం ప్రారంభించారు. అయితే చలికాలంలో ఇమ్యూనిటీ కచ్చితంగా పెంచుకోవాలి అంటున్నారు నిపుణులు. సీజన్ మారుతున్న సమయంలో, చలికాలంలో ఫ్లూ, ఫీవర్, దగ్గు వంటి వ్యాధులు ఈజీగా వ్యాపిస్తాయి. కాబట్టి అవి దరిచేరకుండా ఉండాలంటే కొన్ని ఫాలో అవ్వాల్సి ఉంటుంది.
దీనికోసం పెద్దగా ఏమి కష్టపడాల్సిన అవసరం లేదు. మీరు తాగే.. టీతోపాటు.. కొన్ని మూలికలు మీ రొటీన్లో భాగం చేసుకుంటే చాలు.. రోగనిరోధక శక్తి పెరుగుతుంది అంటున్నారు. ఇంతకీ.. మీ టీని ఎలా ఆరోగ్యవంతం చేయాలో.. ఏ మూలికలతో టీని తీసుకోవచ్చో ఇప్పుడు తెలుసుకుందాం.
ఏలకులు
ఏలకులు టీకి సువాసన ఇస్తాయి. అంతేకాకుండా ఇవి ఆరోగ్యానికి మంచివి అంటున్నారు ఏలకులు. ఏలకులపొడి.. శరీరంలోని వైరస్-పోరాట కణాలను పెంచడంలో సహాయం చేస్తుంది. మీరు జీర్ణ సమస్యలతో పోరాడుతున్నట్లయితే.. ఏలకులతో తయారు చేసిన టీ ఈ లక్షణాలను తగ్గించడంలో మీకు సహాయపడుతుంది. ఇది వ్యాధిని కలిగించే బ్యాక్టీరియాను చంపుతుంది. వివిధ వ్యాధుల నుంచి మిమ్మల్ని రక్షిస్తుంది.
తులసి
తులసి సహజంగా విటమిన్ సి, జింక్‌తో నిండి ఉంటుంది. ఇది యాంటీవైరల్, యాంటీ బాక్టీరియల్, యాంటీ ఫంగల్ లక్షణాలను కూడా కలిగి ఉంది. ఇది ఇన్ఫెక్షన్లు, వ్యాధుల నుంచి మిమ్మల్ని సురక్షితంగా ఉంచుతుంది. అదనంగా ఇది ఫైటోకెమికల్స్, బయోఫ్లేవనాయిడ్స్, యాంటీఆక్సిడెంట్లతో నిండి ఉంది. ఇవి మీ శ్వాసకోశాన్ని స్పష్టంగా ఉంచుతాయి. అంతేకాకుండా మీ రోగనిరోధక వ్యవస్థను బలంగా మారుస్తాయి.
అల్లం
అల్లం అనేది యాంటీ బాక్టీరియల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలతో నిండిన మసాలా. ఇది ఇన్ఫెక్షన్‌లను దూరంగా ఉంచుతుంది. ఫ్లూ నుంచి బయటపడటానికి ఇది సరైన నివారణ మాత్రమే కాదు.. జీవక్రియను పెంచడంలో, జీర్ణక్రియను మెరుగుపరచడంలో కూడా సహాయం చేస్తుంది. ఆయుర్వేద ఔషధాలలో కూడా దీనిని ఉపయోగిస్తారు. దీనిలో ఉండే జింజెరాల్ చురుకైన రోగనిరోధక శక్తిని పెంచుతుంది.
ములేతి
ఇంగ్లీషులో దీనిని లైకోరైస్ అని పిలుస్తారు. దీనిలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ములేతి మీ శ్వాసకోశాన్ని ఆరోగ్యంగా ఉంచే లక్షణాలతో నిండి ఉంటుంది. అదనంగా ఇది జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. కాలేయ ఆరోగ్యాన్ని కాపాడుతుంది. మీ టీలో ములేతీని జోడించడం వల్ల జలుబు, దగ్గు, ఛాతీ సమస్య కూడా తగ్గిస్తుంది. ఇది మిమ్మల్ని అలర్జీలు, సూక్ష్మజీవులు, ఇతర కాలుష్య కారకాల నుంచి మిమ్మల్ని రక్షిస్తుంది. తద్వారా మీ రోగనిరోధక శక్తి పెరుగుతుంది.
బ్రహ్మి
ఆయుర్వేదంలో బ్రహ్మి అత్యంత ప్రజాదరణ పొందింది. ఇది రోగనిరోధక శక్తిని పెంచుతుంది అంటారు. ఎందుకంటే ఇది ముఖ్యమైన పోషకాలు, యాంటీఆక్సిడెంట్లతో నిండి ఉంటుంది. ఇది ఇన్ఫెక్షన్ల నుంచి దూరంగా ఉండటానికి సహాయం చేస్తుంది.
వీటిని మీరు రోజూ టీలో కలిపి తీసుకోవడం వల్ల మీ రోగనిరోధక శక్తి పెరుగుతుంది అంటున్నారు నిపుణులు. పెద్దగా కష్టాపడాల్సినదేమి లేదు.. మీ టీలో వీటిని వేసి మరిగించి తీసుకుంటే చాలు. వీటిని ఉపయోగించే ముందు మీ వైద్యుని సలహాలు కూడా తీసుకోండి.
సంబంధిత కథనం