Chanakya Niti Telugu : మీ జీవితంలో ఇలాంటి స్నేహితులు ఉంటే మిమ్మల్ని ఎవరూ కాపాడలేరు
Chanakya Niti In Telugu : చాణక్య నీతిలో ఆచార్య చాణక్యుడు స్నేహం గురించి గొప్ప మాటలు చెప్పాడు. అయితే కొంతమంది స్నేహితులు ఉంటే మీకు సమస్యలు వస్తాయని కూడా వివరించాడు.
చాణక్య నీతి అనేది మనిషిని సరైన మార్గంలో నడిపించే సలహాలు, సూత్రాల సమాహారం. జీవితంలోని అన్ని అంశాలకు చాణక్యుడు దాచి చూపిస్తాడు. నిత్య జీవితంలో చాణక్యుడి మాటలను పాటించేవారు తప్పకుండా విజయం సాధిస్తారు. అంతేకాకుండా మీరు సంపదలకు దేవత అయిన లక్ష్మీ దేవి శాశ్వతమైన అనుగ్రహాన్ని కూడా పొందవచ్చు.
అన్ని సంబంధాలలో స్నేహం బలమైనదని అంటారు. పుట్టుకతోనే ఎన్నో బంధుత్వాలను మనిషి పొందుతాడు. కానీ స్నేహం అనేది వారి స్వంతంగా సృష్టించే ఏకైక సంబంధం. అందుకే స్నేహం చాలా పెద్దదిగా, ముఖ్యమైనదిగా పరిగణిస్తారు. ఆచార్య చాణక్యుడు స్నేహం గురించి కొన్ని విషయాలు చెప్పాడు. నవ్వుతూ మాట్లాడే ప్రతి ఒక్కరూ స్నేహితులేనని చెప్పలేం. అలాంటి వారు స్నేహితులుగా మారితే వారికి ఎప్పుడూ దూరంగా ఉండాలని చాణక్యుడు అంటాడు. ఎలాంటి వారితో స్నేహం మంచిది కాదో చాణక్య నీతి వివరిస్తుంది.
స్వార్థపరులకు దూరంగా ఉండండి
చాణక్య నీతిలో స్వార్థపరులు, అత్యాశగల స్నేహితులకు దూరంగా ఉండమని చెప్పాడు. ఎందుకంటే అలాంటి వారు తమ సంక్షేమం గురించి మాత్రమే ఆలోచిస్తారు. అలాంటి వారు తమ అవసరాలు తీర్చుకోవడానికి ఏం చేయడానికైనా సిద్ధంగా ఉంటారు. అలాంటి వారితో జాగ్రత్తగా ఉండాలని చాణక్యుడు సలహా ఇస్తున్నాడు. కౌగిలించుకొని కరచాలనం చేసే ప్రతి ఒక్కరూ స్నేహితులు కాలేరు. దీన్ని అర్థం చేసుకోలేని వారు జీవితాంతం పశ్చాత్తాపపడవచ్చు.
తెలివిలేనివారితో స్నేహం వద్దు
తెలివితక్కువ మిత్రుడు మిమ్మల్ని ఎప్పుడూ తప్పుడు పనులు చేయించగలడు. జ్ఞానులను ఎప్పుడూ స్నేహితులుగా ఉంచుకోవాలని చాణక్యుడు నీతిలో చెప్పాడు. తెలివిలేని వారితో తిరిగితే మీరు కూడా అదే లిస్టులో చేరిపోతారు. చూసేవారు కూడా మిమ్మల్ని తక్కువగా అంచనా వేస్తారు.
స్నేహం చేసేప్పుడు జాగ్రత్త
మీరు ఎవరితోనైనా స్నేహం చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలని చాణక్యుడు చెప్పాడు. ఎట్టి పరిస్థితుల్లోనూ మీ రహస్యాలన్నింటినీ మీ స్నేహితుడికి చెప్పకండి. ఎందుకంటే మీ స్నేహితుడు నమ్మదగినవాడు కాకపోతే అది మీకు తర్వాత హాని చేస్తుంది. మీ రహస్యాలను మీకు వ్యతిరేకంగా ఉపయోగిస్తారు. స్వార్థపూరిత స్నేహితులకు దూరంగా ఉండండి. ఎందుకంటే అలాంటి వ్యక్తులు మిమ్మల్ని సద్వినియోగం చేసుకోవాలనుకుంటున్నారు. మీరు చెడు సమయాల్లో ఉన్నప్పుడు అలాంటి వ్యక్తులు మిమ్మల్ని కచ్చితంగా విడిచిపెడతారు.
చెడు వ్యక్తులకు దూరంగా ఉండాలి
చాణక్యుడి ప్రకారం చెడు వ్యక్తులకు ఎప్పుడూ దూరంగా ఉండాలి. చాణక్య నీతి ప్రకారం, చెడు అలవాట్లతో ఉన్న వారితో స్నేహం మీకు ఎప్పటికీ ప్రయోజనం కలిగించదు. చెడు అలవాట్లు మీ జీవితాన్ని కూడా ప్రభావితం చేస్తాయి. ఒక తప్పు వ్యక్తి మీతో ఎప్పుడైనా చెడు పనులు చేయించవచ్చు. ఎప్పుడైనా మిమ్మల్ని ఇబ్బంది పెట్టవచ్చని చాణక్య నీతి చెబుతుంది.
పాపాత్ములతో స్నేహం వద్దు
పాపాత్ములతో స్నేహం చేయకూడదని చాణక్యుడు తన నీతి శాస్త్రంలో చెప్పాడు. అలాంటి వ్యక్తితో స్నేహం మిమ్మల్ని ఎప్పుడూ ఇబ్బందుల్లోకి నెట్టేస్తుంది. పాపి మీ కుటుంబానికి ఆనందాన్ని కలిగించడు. దీని కారణంగా మీ సమస్యలు ఎప్పుడైనా ఎక్కువ అవుతాయి. అందుకే చాణక్యుడు చెప్పినట్టుగా మంచివారితో స్నేహం చేయండి.