Beauty with Ghee: రోజుకో స్పూను నెయ్యి ఇలా తింటే బరువు పెరగరు, పైగా చర్మం మెరిసిపోతుంది-if you eat a spoonful of ghee daily like this you will not gain weight and your skin will glow ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Beauty With Ghee: రోజుకో స్పూను నెయ్యి ఇలా తింటే బరువు పెరగరు, పైగా చర్మం మెరిసిపోతుంది

Beauty with Ghee: రోజుకో స్పూను నెయ్యి ఇలా తింటే బరువు పెరగరు, పైగా చర్మం మెరిసిపోతుంది

Haritha Chappa HT Telugu
Sep 19, 2024 09:30 AM IST

Beauty with Ghee: నెయ్యిలో ఉండే యాంటీఆక్సిడెంట్ లక్షణాలు ఫ్రీ రాడికల్స్ నుంచి శరీరాన్ని కాపాడుతుంది. ఆక్సీకరణ ఒత్తిడి నుండి రక్షిస్తుంది. నెయ్యిని ప్రతి రోజూ ఒక స్పూను తినడం వల్ల చర్మం మెరిసిపోతుంది. బరువు పెరుగుతామన్న భయం పెట్టుకోకండి.

నెయ్యితో అందం
నెయ్యితో అందం (shutterstock)

ఆహారం రుచిని పెంచేందుకు నెయ్యిని వాడుతూ ఉంటారు. బిర్యానీ, పులావుల్లో నెయ్యిని వేస్తే వాటి రుచి రెట్టింపవుతుంది. నెయ్యిని ఆయుర్వేదంలో ఔషధంగా భావిస్తారు. నెయ్యిలో విటమిన్ కె, విటమిన్ ఎ, విటమిన్ డి, కాల్షియం, పొటాషియం, ఫాస్పరస్ వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి ఆరోగ్యానికే కాదు చర్మం, జుట్టుకు కూడా మేలు చేస్తాయి. ఇది కాకుండా, నెయ్యిలో ఉండే యాంటీఆక్సిడెంట్ లక్షణాలు ఫ్రీ రాడికల్ డ్యామేజ్, ఆక్సీకరణ ఒత్తిడి నుండి కూడా రక్షిస్తాయి. డాక్టర్ రవి కె గుప్తా తన ఇన్ స్టాగ్రామ్ లో ఒక వీడియోను షేర్ చేసి నెయ్యి తినడం వల్ల కలిగే ప్రయోజనాలను వివరించారు. నెయ్యిని క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల ఆరోగ్యం చేకూరుతుందని, రోజులో ఎంత నెయ్యి తీసుకోవచ్చో చెబుతున్నారు.

నెయ్యి శరీరంలో మంచి కొలెస్ట్రాల్‌ను పెంచుతుంది. నెయ్యిలో ఉన్నవి చెడు కొవ్వు కాదు, కాబట్టి గుండె జబ్బులను కలిగించదు. జీర్ణ వ్యవస్థను ఆరోగ్యంగా ఉంచడానికి నెయ్యి ఉత్తమంగా పనిచేస్తుంది. ఇది పేగులను లూబ్రికేషన్ చేయడం ద్వారా జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. నెయ్యి తీసుకోవడం వల్ల పేగు ఆరోగ్యంగా ఉంటుంది. ఇది అల్సర్లు, క్యాన్సర్ వచ్చే అవకాశాలను తగ్గిస్తుంది.

నెయ్యిలో ఉండే బ్యూటిరిక్ ఆమ్లం… శరీరంలో వ్యాధులతో పోరాడే T-కణాలను ఉత్పత్తి చేయడానికి సహాయపడుతుంది. దీని వల్ల శరీరంలో రోగనిరోధక శక్తి మెరుగ్గా ఉండి వ్యాధులతో పోరాడే శక్తి లభిస్తుంది. పేగు గోడలను బలోపేతం చేయడానికి, జీవక్రియను పెంచడానికి, మంచి గట్ ఆరోగ్యాన్ని నిర్వహించడానికి బ్యూట్రిక్ ఆమ్లం చాలా సహాయపడుతుంది.

చర్మానికి మెరుపు తెచ్చే నెయ్యి

నెయ్యి తినడం వల్ల చర్మానికి మెరుపు వస్తుంది. కాబట్టి రోజూ ఒక స్పూను నెయ్యి తినాలి. నెయ్యిలో ఉండే ఒమేగా 3, ఒమేగా 9 ఫ్యాటీ యాసిడ్స్ జ్ఞాపకశక్తిని, ఏకాగ్రతను పెంచి మెదడు పనితీరును మెరుగుపరుస్తాయి. నెయ్యి తీసుకోవడం వల్ల చర్మం హైడ్రేట్ గా ఉంటుంది. ఇందులో ఉండే విటమిన్లు చర్మాన్ని బిగుతుగా ఉంచి వృద్ధాప్యం రాకుండా కాపాడతాయి.

రోజూ ఒక చెంచా వేడి నెయ్యి తింటే పొట్ట ఆరోగ్యంగా ఉంటుంది. దీని వల్ల అజీర్ణం, మలబద్ధకం, కడుపులో గ్యాస్ ఏర్పడటం వంటి సమస్యలు వ్యక్తిని ఇబ్బంది పెట్టవు.

రోజులో ఎంత నెయ్యి తినాలి?

రోజుకు 1 నుండి 2 టీస్పూన్ల నెయ్యి తినాలని వైద్యులు సిఫారసు చేస్తున్నారు. అంతకుమించి నెయ్యి తింటే మాత్రం అజీర్ణ సమస్యలు వస్తాయి. అన్నం ముద్దలో ఒక స్పూను నెయ్యి వేసుకుని తినేందకు ప్రయత్నించండి. ఇది ఆరోగ్యానికి, చర్మానికి ఎంతో మేలు చేస్తుంది.

పిల్లలకు కచ్చితంగా రోజుకు ఒక స్పూను నెయ్యిని పెట్టేందుకు ప్రయత్నించండి. ఇది వారి మెదడు ఎదుగుదలకు కూడా ఎంతో మంచిది. నెయ్యి తింటే బరువు పెరుగుతామని చాలా మంది అనుకుంటారు. అందుకే నెయ్యిని తినకుండా ఉంటారు. రోజుకో స్పూను నెయ్యి తినడం వల్ల బరువులో ఎలాంటి మార్పు రాదు. కాబట్టి ఎలాంటి భయం లేకుండా రోజుకో స్పూను నెయ్యి తినవచ్చు.