Women After 40: నలభై ఏళ్లు దాటి మహిళలు ఇలా చేస్తే పదిహేను రోజుల్లోనే శరీరంలో ఆరోగ్యకరమైన మార్పులను చూస్తారు-if women over forty do this they will see healthy changes in their body within fifteen days ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Women After 40: నలభై ఏళ్లు దాటి మహిళలు ఇలా చేస్తే పదిహేను రోజుల్లోనే శరీరంలో ఆరోగ్యకరమైన మార్పులను చూస్తారు

Women After 40: నలభై ఏళ్లు దాటి మహిళలు ఇలా చేస్తే పదిహేను రోజుల్లోనే శరీరంలో ఆరోగ్యకరమైన మార్పులను చూస్తారు

Haritha Chappa HT Telugu
Oct 23, 2024 04:30 PM IST

Women After 40: నలభై ఏళ్లు దాటాక మహిళలు నిరుత్సాహంగా మారుతారు. వారి శరీరం బరువు కూడా తగ్గడం కష్టంగా మారిపోతుంది. నలభై ఏళ్ల దాటాక కూడా త్వరగా బరువు తగ్గేందుకు, శరీరం ఉత్సాహంగా మారేందుకు కొన్ని చిట్కాలు ఉన్నాయి.

నలభై ఏళ్లు దాటాక మహిళలు చేయాల్సిన పనులు
నలభై ఏళ్లు దాటాక మహిళలు చేయాల్సిన పనులు

ఒక వయస్సు వచ్చాక బరువు తగ్గడం కష్టంగా అనిపిస్తుంది. అలాగే శరీరం చురుగ్గా అనిపించదు. ముఖ్యంగా మహిళల్లోనే ఇలాంటి లక్షణాలు ఎక్కువగా కనిపిస్తాయి. నలభై ఏళ్లు దాటి మహిళలు బరువు పెరగడమే కానీ, తరగడం కనిపించదు. అలాగే వారు త్వరగా అలిసిపోతారు. ఉత్సాహంగా పనులు చేయలేరు. నలభై ఏళ్లు రాగానే వయసు ముదరిపోయినట్టు స్త్రీలు కూడా మానసికంగా భావిస్తారు. నిజానికి నలభై ఏళ్లు దాటాక కూడా సులువుగా బరువు తగ్గవచ్చు, చురుగ్గా పనులు చేసుకోవచ్చు. ఇందుకోసం చిన్న చిట్కాలు పాటిస్తే సరిపోతుంది.

నలభై ఏళ్లు దాటిన తర్వాత చాలా మంది మహిళలు పెరుగుతున్న బరువును తగ్గించుకోవడానికి ప్రయత్నిస్తుంటారు. వారు బరువు నడుము దగ్గర ఎక్కువగా కనిపిస్తుంది, బెల్లీ ఫ్యాట్ అధికమైపోతుంది. ఇది చెడు జీవనశైలి అలవాట్ల వల్ల పెరుగుతుంది. ఈ పెరిగిన కొవ్వును తగ్గించుకోవడానికి మహిళలు ఈ పద్ధతులను అనుసరించవచ్చు.

40 ఏళ్లు దాటిన తర్వాత శరీరంలో మెటబాలిజం మందగిస్తుంది. ఈ కారణంగా కేలరీలను బర్న్ చేయడం చాలా కష్టం. అటువంటి పరిస్థితిలో, వారానికి రెండు నుండి నాలుగు సార్లు స్ట్రెంత్ ట్రైనింగ్ చేయండి. ఈ శిక్షణతో సన్నని కండరాలు మళ్లీ పెరగడం ప్రారంభిస్తాయి. అంతేకాకుండా ఎముకలు, శరీరాన్ని దృఢంగా, ఆరోగ్యంగా ఉంచడానికి తోడ్పడుతుంది. దీని వల్ల మీరు బరువు తగ్గడమే కాదు, మెరుపుతీగలా మారి ఉత్సాహంగా పనులు కూడా చేయగలుగుతారు.

నిద్ర నాణ్యతపై శ్రద్ధ వహించండి

నిద్ర లేకపోవడం హార్మోన్ల సమతుల్యతను నిరోధిస్తుంది, ఇది అధిక కేలరీల ఆహారాల కోసం కోరికలను పెంచుతుంది. జీవక్రియను నెమ్మదించేలా చేస్తుంది. సహజ కొవ్వును కరిగించడానికి, రాత్రిపూట 7-9 గంటల నిద్ర తీసుకోవడం అవసరం. నిద్ర తగ్గితే బరువు పెరిగిపోయే అవకాశం ఉంది.

జీవక్రియ సహజంగా వయస్సుతో నెమ్మదిస్తుంది, కాబట్టి మనం ఏం తింటున్నాము, ఎంత తింటున్నాము అనే దానిపై శ్రద్ధ వహించడం చాలా ముఖ్యం. ఇష్టంగా తినడంపై శ్రద్ధ వహించడం చాలా ముఖ్యం. ఇలా తినేటప్పుడు ప్రతి ముక్కను ఆస్వాదించడం, మీ పొట్ట నిండినప్పుడు గుర్తించడం ఇందులో ముఖ్యమైన అంశాలు. వీటితో పాటు పోర్షన్ కంట్రోల్ విషయంలో కూడా జాగ్రత్తలు తీసుకోవాలి. పోషకాలు అధికంగా ఉండే ఆహారాన్ని తినాలి. మీ ఆహారంలో ప్రధానంగా పండ్లు, కూరగాయలు, లీన్ ప్రోటీన్లను పుష్కలంగా చేర్చుకోవాల్సిన అవసరం ఉంది.

రోజంతా సరైన మొత్తంలో నీరు త్రాగటం ఆరోగ్యానికి చాలా ముఖ్యం. ఇది బరువు నిర్వహణకు కూడా సహాయపడుతుంది. తగినంత నీరు త్రాగటం జీవక్రియను నిర్వహించడానికి సహాయపడుతుంది. పొట్ట నిండిన అనుభూతిని కలిగిస్తుంది. ఇలా చేయడం వల్ల అతిగా తినకుండా ఉంటారు. కాబట్టి రోజంతా ఎక్కువ నీరు తాగేందుకు ప్రయత్నించండి.

పైన చెప్పిన విధంగా పాటిస్తే మీరు నలభై ఏళ్లు దాటాక కూడా చాలా సులువుగా బరువు తగ్గగలరు. అంతేకాదు ఇంటా బయటా పనులు చురుగ్గా చేసుకోగలరు.

Whats_app_banner