WeightLoss Recipe: ఈ రెసిపీ ప్రతిరోజూ డిన్నర్లో తిన్నారంటే బెల్లీ ఫ్యాట్ వారంలో తగ్గిపోతుంది-eating this recipe for dinner every day will reduce belly fat in a week ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Weightloss Recipe: ఈ రెసిపీ ప్రతిరోజూ డిన్నర్లో తిన్నారంటే బెల్లీ ఫ్యాట్ వారంలో తగ్గిపోతుంది

WeightLoss Recipe: ఈ రెసిపీ ప్రతిరోజూ డిన్నర్లో తిన్నారంటే బెల్లీ ఫ్యాట్ వారంలో తగ్గిపోతుంది

Haritha Chappa HT Telugu
Jul 25, 2024 11:30 AM IST

ఈ రోజు మేము మీకు ఒక సులభమైన రెసిపీని చెప్పబోతున్నాము, ఇది రుచికరమైనది మరియు బరువు తగ్గడానికి చాలా త్వరగా పనిచేస్తుంది. దీని ప్రభావం కేవలం ఏడు రోజుల్లోనే కనిపిస్తుంది.

వెయిట్‌లాస్ రెసిపీ
వెయిట్‌లాస్ రెసిపీ (Shutterstock)

ఈ రోజుల్లో బరువు పెరగడం ప్రతి ఒక్కరికీ తలనొప్పిగా మారింది. చెడు జీవనశైలి, చెడు ఆహారపు అలవాట్లు, జంక్ ఫుడ్ అధికంగా తినడం వల్ల, రోజంతా ఒకేచోట కూర్చుని పనిచేయడం వల్ల ఎంతో మంది ఊబకాయం బారిన పడుతున్నారు. ఈ ఊబకాయాన్ని తగ్గించుకోవాలంటే గంటల తరబడి జిమ్ లో కష్టపడాలని అనుకుంటారు ఎంతో మంది. అలాగే ఎన్నో ఖరీదైన సప్లిమెంట్లు కూడా తీసుకోవాలని భావిస్తారు. చాలాసార్లు డైటింగ్ పేరుతో ఆకలితో అలమటిస్తారు కూడా. ఇలా చేయడం వల్ల నీరసం తప్ప మరేమీ రాదు. బరువు తగ్గాలనుకునేవారు చాలా ఆరోగ్యకరంగా బరువు తగ్గేందుకు ప్రయత్నించాలి. ఇక్కడ మేము మీకు ఒక బరువు తగ్గించే రెసిపీని చెబుతున్నారు, ఇది ఒక వారంలోనే ఎంతో కొంత బరువు తగ్గించేందుకు సహాయపడుతుంది. దీన్ని వండడం కూడా చాలా సులభం. పైగా ఇది రుచిగానూ ఉంటుంది.

రెసిపీ ఇదిగోండి…

ఈ వెయిట్ లాస్ రెసిపీని తయారు చేయడానికి, ఒక ఉల్లిపాయ, రెండు టమోటాలు, క్యాబేజీ తరుగు, క్యాప్సికమ్, క్యారెట్ అవసరం. వాటిలో ముఖ్యమైనది క్యాబేజీ. ఇతర కూరగాయలు లేకపోయినా క్యాబేజీ మాత్రం కచ్చితంగా ఉండాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు ఈ కూరగాయలన్నింటినీ శుభ్రంగా కడిగి సన్నగా తరిగి పెట్టుకోవాలి. కుక్కర్ ను గ్యాస్ మీద పెట్టి అందులో కొద్దిగా నీళ్లు పోసి కలపాలి. కొద్దిగా వేడి అయ్యాక ఆ నీటిలో ఉల్లిపాయలు వేయాలి. ఉల్లిపాయను రెండు నిమిషాలు వేయించి, తర్వాత క్రమంగా మిగిలిన కూరగాయలను వేయాలి. ఇప్పుడు అందులో కొద్దిగా ఉప్పు, మిరియాల పొడి కలపాలి. దీన్ని 15 నిమిషాలు పాటూ చిన్న మంటపై ఉడికించాలి. ఇది రుచిగా ఉంటుంది. ఈ మిశ్రమం గోరువెచ్చగా ఉన్నప్పుడు తినేయాలి. ప్రతి రోజూ డిన్నర్లో ఇదే ఆహారాన్ని తీసుకుని చూడండి. వారంలోనే మీకు మంచి మార్పు కనిపిస్తుంది. ఏడురోజుల్లో ఇది ఎంతో కొంత బరువును తగ్గించడం ఖాయం. రుచి కోసం చూసుకోకుండా… ఆరోగ్యం కోసం ఈ ఆహారాన్ని తినడం అలవాటు చేసుకోండి.

ఈ రెసిపీని మీ భోజనంలో చేర్చవచ్చు, కానీ ఇది విందు సమయంలో తినేటప్పుడు చాలా ప్రభావవంతంగా ఉంటుంది. మీరు వేగంగా బరువు తగ్గాలని ప్లాన్ చేస్తుంటే, ఈ బరువు తగ్గించే రెసిపీని రాత్రి భోజనంలో ఒక వారం పాటు తినండి. ఎంత కావాలంటే అంత తినొచ్చు. ఇది మీ శరీరంలో కొవ్వును కరిగించేస్తుంది. నీరసం కూడా రాదు. ఇది బెస్ట్ రెసిపీ అని చెప్పుకోవచ్చు.

వారం రోజుల పాటు కూడా ఈ రెసిపీని డైట్ లో చేర్చుకుంటే ఎన్నో బెనిఫిట్స్ కనిపిస్తాయి. ఇది మీ బరువును తగ్గిస్తుంది. పొట్ట చుట్టూ వేలాడుతున్న కొవ్వును కూడా చాలా వరకు నిరోధిస్తుంది. ఈ కూరగాయలలో లభించే యాంటీఆక్సిడెంట్ల కారణంగా, మీ చర్మం కూడా ప్రకాశించడం ప్రారంభిస్తుంది. శరీరం మొత్తం ఆరోగ్యానికి ఇది చాలా ప్రయోజనం చేకూరుతుంది.

Whats_app_banner