శ్రీ మహావిష్ణువు ఆరాధనకు ఏకాదశి ఉపవాసం చాలా ముఖ్యమైనదిగా భావిస్తారు. ఏకాదశి వ్రతాన్ని వ్రతరాజ్యం అంటారు. ఈ ఏడాది అక్టోబర్ 13న పాపాంకుశ ఏకాదశి వ్రతాన్ని భక్తులు జరుపుకుంటున్నారు.
పాపాంకుశ ఏకాదశి రోజున భక్తిశ్రద్ధలతో ఉపవాసం ఉండే వ్యక్తుల ఇంట్లో శాంతి, సంతోషం నెలకొంటాయి. ఈ ఉపవాసానికి విష్ణువు, లక్ష్మీదేవి అమ్మవారు ఎంతో సంతోషిస్తారని నమ్మకం.
ఆశ్వయుజ మాసం.. శుక్ల పక్షంలో వచ్చిన ఈ పాపాంకుశ ఏకాదశి రోజున తులసి దేవికి నీటిని సమర్పించవద్దు. ఎందుకంటే ఈ రోజున తులసి దేవి స్వయంగా ఏకాదశి ఉపవాసం ఉంటుందని నమ్ముతారు. అందువల్ల నీరు పోస్తే ఉపవాసానికి ఆటంకం కలుగుతుంది. ఈ కారణంగా తులసి మాతకు నీరు ఇవ్వకూడదు. కానీ తులసి వేసి చేసిన నైవేద్యాన్ని పద్మనాభ స్వామికి ఖచ్చితంగా సమర్పించాలి.
తులసి లేని నేవేద్యాన్ని విష్ణువు స్వీకరించరు అని నమ్ముతారు.
పురాతన కాలంలో వింధ్య పర్వతాలపై ఆంగర్ అనే క్రూరమైన బహేలియా అనే రాక్షసుడు ఉండేవాడు. తన జీవితమంతా దోపిడీ, తప్పుడు సహవాసం, హింస, తాగుడు వంటి పాపకార్యాలు చేసేవాడు. అతని జీవితపు చివరి క్షణం వచ్చినప్పుడు యమ ధర్మరాజు పంపిన దూతలు అతడి వద్దకు వెళ్తారు.
నీ జీవిత కాలం ముగిసిందని, త్వరలోనే నిన్ను నరకానికి తీసుకెళ్లడానికి వస్తామని చెప్తారు. అది విన్న రాక్షసుడు భయపడి అంగీరా రిషి ఆశ్రమానికి చేరుకుంటాడు . ఆ మహర్షి అంగీర పాదాలపై పడి ఓ మునివర్యా నేను నా జీవితంలో ఎన్నో పాపకార్యాలు చేశాను.. దయచేసి ఈ పాపాల నుంచి విముక్తి విముక్తి మార్గం చెప్పమని వేడుకుంటాడు.
అప్పుడు అంగీరా మహర్షి ఆశ్వయుజ మాసం.. శుక్ల పక్షంలో వచ్చే ఏకాదశి రోజున పూర్తి నియమ నిష్టలతో ఉపవాసం ఉండి శ్రీ మహా విష్ణువుని పూజించమని సూచిస్తాుడ. ఆ ఉపవాస దీక్షను బహేలియా నియమ నిష్టలతో పూర్తి చేయడంతో అతని పాపకర్మలన్నీ ముగిసి శ్రీ మహా విష్ణువు అనుగ్రహం పొందుతాడు.
ఏకాదశి తిథి అక్టోబర్ 13, 2024 ఉదయం 09:08 గంటలకు ప్రారంభమై.. అక్టోబర్ 14, 2024 ఉదయం 06:41 గంటలకు ముగియనుంది.
గమనిక : పైన ఇచ్చిన సమాచారం నమ్మకాల మీద ఆధారపడి ఉంది. ఇంటర్నెట్‌లో దొరికిన వివరాల ఆధారంగా ఇచ్చాం. ఇది కేవలం సమాచారం కోసం మాత్రమే. పైన చెప్పిన విషయాలకు HT Telugu ఎలాంటి బాధ్యత వహించదు. మీకు ఏమైనా అనుమానాలు ఉంటే సంబంధిత నిపుణులను సంప్రదించండి.
టాపిక్