ఎముకలు బలంగా, ఆరోగ్యంగా ఉండాలంటే కొన్ని సూచనలు పాటించాలి. జీవనశైలిలో కొన్ని మార్పులు చేసుకోవాలి. ఎముకలు దృఢంగా ఉండాలంటే పాటించాల్సిన ఐదు ముఖ్యమైన టిప్స్ ఇక్కడ చూడండి.
Photo: Pexels
ఎముకలు బలంగా ఉండేందుకు కాల్షియం చాలా ముఖ్యమైన పోషకం. అందుకే కాల్షియం ఎక్కువగా ఉండే ఆహారాలను తీసుకోవాలి. వీటి వల్ల ఎముకల ఆరోగ్యానికి మేలు జరుగుతుంది.
Photo: Pexels
శరీరం కాల్షియంను మెరుగ్గా శోషించుకునేందుకు, ఎముకల సాంద్రత పెరిగేందుకు విటమిన్-డీ చాలా ఉపయోగపడుతుంది. అందుకే ప్రతీ రోజు కాసేపు సూర్యరశ్మిలో ఉండడం, విటమిన్ డీ ఎక్కువగా ఉండే ఆహారాలు తీసుకోవడం ఎముకలకు మంచి చేస్తుంది.
Photo: Pexels
స్ట్రెంత్ ట్రైనింగ్, బరువులు ఎత్తడం లాంటి వ్యాయామాలను రెగ్యులర్‌గా చేయాలి. వీటివల్ల ఎముకలు దృఢంగా, ఆరోగ్యంగా ఉంటాయి.
Photo: Pexels
పోలిఫెనోల్స్, పొటాషియమ్ ఎక్కువగా ఉండేందుకు మీ ఆహారంలో ఆకుపచ్చ కూరగాయలను అధికంగా తీసుకోవాలి. ఈ పోషకాల వల్ల ఎముకల సాంద్రత మెరుగ్గా ఉంటుంది.
Photo: Pexels
ప్రొటీన్లు ఎక్కువగా ఉండే కోడిగుడ్లు, డ్రైఫ్రూట్స్ లాంటివి ప్రతీ రోజు తినాలి. ఎముకల దృఢత్వంలో ప్రోటీన్స్ కీలకంగా ఉంటాయి.
Photo: Pexels
వర్షాకాలానికి అనుగుణంగా డైట్ మార్చుకుంటే రకరకాల అనారోగ్య సమస్యలకు దూరంగా ఉండవచ్చు.