Egg Shells Benefits : ఈ ఉపయోగాలు తెలిస్తే గుడ్డు పెంకులు ఇకపై పారేయరు
Egg Shells Benefits In Telugu : గుడ్లను మనం కచ్చితంగా తింటాం. కానీ దానిపై పెంకును మాత్రం పడేస్తాం. కానీ దీనివలన అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి.
గుడ్లు మన ఆహారంలో తప్పక తినాల్సినవి. కోడిగుడ్లు ఉడకబెట్టినా, ఆమ్లెట్ వేసుకున్నా గుడ్డు పెంకులను చెత్తబుట్టలో పడేయడం చాలా మందికి అలవాటు. ఇది మనం చేసే అతి పెద్ద తప్పు. ఎందుకంటే గుడ్డు పెంకులో మనం అనుకున్నదానికంటే ఎక్కువ ప్రయోజనాలను దొరుకుతాయి. వాటి గురించి తెలుసుకుందాం..
పక్షులకు వేయవచ్చు
మీరు ఉపయోగించిన గుడ్డు పెంకులను చెత్తబుట్టలో పడేయడానికి బదులుగా, మీరు పెంచే పక్షులకు వాటిని తినిపించవచ్చు. పక్షులకు కాల్షియం అధికంగా ఉండే ఆహారాన్ని అందించాలనుకుంటే గుడ్డు పెంకులను పగలగొట్టి ఇవ్వవచ్చు. ఇంటి ముందు పగలగొట్టడం ద్వారా ఇంటికి పక్షులను ఆకర్షిస్తుంది.
గాయాలపై వాడుకోవచ్చు
అల్సర్, కీళ్ల నొప్పులతో బాధపడేవారికి గుడ్డు పెంకులు అద్భుతమైన ఉపశమనాన్ని అందిస్తాయి. గుడ్డు పెంకులను ఒక గాజు కూజాలో పగలగొట్టి, వాటిని ఆపిల్ సైడర్ వెనిగర్ కలపండి. వెనిగర్‌లో కొల్లాజెన్, కొండ్రోయిటిన్, గ్లూకోసమైన్, హైలురోనిక్ యాసిడ్ వంటి పోషకాలను నింపండి. గుడ్డు షెల్ ముక్కలు కరిగిపోయే వరకు మిశ్రమాన్ని రెండు రోజుల పాటు ఉంచండి. ఈ ద్రావణాన్ని పుండ్లు, గాయాలపై రుద్దడం వల్ల త్వరగా ఉపశమనం లభిస్తుంది.
గృహన్ని శుభ్రపరిచే ఉత్పత్తులు సున్నితమైన చర్మాన్ని చికాకుపెడతాయి. అటువంటి సందర్భాలలో గుడ్డు పెంకులు ఇంటిని శుభ్రపరిచేందుకు సాయపడతాయి. గుడ్డు పెంకులను పొడి చేయండి. మూసివున్న కంటైనర్‌లో నిల్వ చేయండి. అవసరమైనప్పుడు ఈ పొడితో ఇంటి ఉపరితలాలను శుభ్రం చేయండి. స్పాంజ్ లేదా గుడ్డను ఉపయోగించి మరకలు, గ్రీజును తుడిచివేయండి. ఎగ్‌షెల్ మురికిని సమర్థవంతంగా తొలగిస్తాయి.
మెుక్కలకు వేయండి
మీ ఇంట్లో పెరిగే మొక్కలు గుడ్డు పెంకులోని పోషకాల నుండి ప్రయోజనం పొందవచ్చు. మిగిలిన గుడ్డు పెంకులను పగులగొట్టి, వాటిని మీ ఇంట్లో పెరిగే మొక్కల మెుదలు దగ్గర వేయండి. మొక్కల ఆరోగ్యానికి అవసరమైన కాల్షియం, ఇతర ఖనిజాలను దొరుకుతాయి. గుడ్డు పెంకులను బాగా కడిగి ఇలా వేయాలి. వాటిని చిన్న ముక్కలుగా చేసి మెుక్క ఉన్న మట్టిలో వేయాలి. గుడ్డు పెంకులు మట్టిలో కలిసిపోతాయి. మీ ఇంట్లో పెరిగే మొక్కలు బలంగా పెరుగుతాయి.
కాఫీలో గుడ్డు పెంకులను ఉడకబెట్టడం అనేది పురాతన ట్రిక్. కాఫీలో చేదు తగ్గేందుకు ఇలా చేసేవారు. బాగా మరిగించిన కాఫీకి బాగా కడిగిన గుడ్డు పెంకులను జోడించడం వల్ల దాని రుచి పెరుగుతుంది.
ఇలా పొడి చేసి వాడుకోండి
గుడ్డు పెంకును ఎండలో ఆరబెట్టాలి. అనంతరం మెత్తగా పొడి చేయాలి. ఈ పొడిలో ఇతర పోషకాలను జోడించి ఉపయోగించవచ్చు. వెనిగర్‌ను గుడ్డు షెల్ పౌడర్‌తో కలిపి పేస్ట్ చేసి ఆ మిశ్రమాన్ని ముఖానికి మసాజ్ చేయవచ్చు.
గుడ్డు పెంకులో రెండు చెంచాల తేనె కలుపుకోవాలి. తేమగా ఉన్న ముఖం మీద రాస్తే ప్రయోజనం ఉంటుంది. పౌడర్, తేనె కలిపి చిక్కటి పేస్ట్ లాగా చేసుకోవాలి. గాయాలపై రాయడం వలన తేడా ఉంటుంది.
గుడ్డు పెంకుల పొడిలో కలబంద జెల్ మిక్స్ చేసి ముఖానికి రాయవచ్చు. దీని ఉపయోగం వల్ల చర్మానికి అవసరమైన తేమ దొరుకుతుంది. ముఖానికి కాంతి వస్తుంది.
గుడ్డు పెంకుతో తయారు చేసిన పౌడర్‌కు నిమ్మరసం లేదా వెనిగర్ అప్లై చేయవచ్చు. దీంతో చర్మం మచ్చలు లేకుండా ఉంటుంది. ఇన్‌ఫెక్షన్స్ రావు. స్కిన్‌పై ఎలాంటి ఇన్ఫెక్షన్స్ ఉన్నా ఈ రెమెడీ ఉపయోగించవచ్చు.
గుడ్డు పెంకుతో చేసిన పొడికి కొద్దిగా చక్కెర పొడిని కలపవచ్చు. తర్వాత గుడ్డులోని తెల్లసొన కలుపుకోవాలి. వారానికి ఒక్కసారి దీన్ని మాస్క్ లాగా అప్లై చేయండి. కొన్ని రోజులకు చర్మంలో తేడా కనిపిస్తుంది.
దంతాలు పసుపు రంగులో ఉంటే గుడ్డు పెంకు పొడితో మీ దంతాలను శభ్రం చేయాలి. ఇలా చేయడం చేస్తే మీ దంతాలు సహజసిద్ధంగా తెల్లగా అవుతాయి.