Cone Coffee : కోన్ కాఫీ.. మెుదట కాఫీ తాగి.. ఆ తర్వాత కోన్ తినేయెుచ్చు-how to prepare cone coffee which is trending in social media ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Cone Coffee : కోన్ కాఫీ.. మెుదట కాఫీ తాగి.. ఆ తర్వాత కోన్ తినేయెుచ్చు

Cone Coffee : కోన్ కాఫీ.. మెుదట కాఫీ తాగి.. ఆ తర్వాత కోన్ తినేయెుచ్చు

Anand Sai HT Telugu
Feb 12, 2024 03:30 PM IST

Cone Coffee Recipe : కోన్ కాఫీ ఇప్పుడు ఎక్కువగా సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది. దీనిని ఈజీగా తయారు చేయవచ్చు. కాఫీ తాగేసి కోన్ తినేయవచ్చు.

కోన్ కాఫీ
కోన్ కాఫీ (Unsplash)

కాఫీ తాగడం అంటే చాలా మందికి ఇష్టం. ఇందులోనూ వివిధ రకాలు చేసుకుని తాగేస్తూ ఉంటారు. అయితే మీరు కొత్తగా ట్రై చేసేందుకు మరో పద్ధతి ఉంది. కోన్ కాఫీని తాగితే చాలా బాగుంటుంది. కొత్త రకమైన రుచి, కొత్త అనుభూతి కలిగిస్తుంది. ఈ కోన్ కాఫీని తయారు చేయడం కూడా సులువే. ఈ వాలెంటైన్స్ డేకు మీ ప్రియమైన వారికి సర్ ప్రైజ్ ఇచ్చేందుకు కోన్ కాఫీని ప్రయత్నించండి.

కోన్ కాఫీ ఈమధ్య బాగా ట్రెండ్ అవుతోంది. ఈ కోన్ కాఫీ చాలా స్పెషల్. కోన్ లో కాఫీ తాగడం, ఆ కోన్ తింటే కొత్త అనుభూతి కలుగుతుంది. ఎలా తయారుచేయాలో చూద్దాం:

కోన్ కాఫీకి కావాల్సిన పదార్థాలు

1 టేబుల్ స్పూన్ కాఫీ పౌడర్, 2 టేబుల్ స్పూన్ల చక్కెర, 2 కప్పుల వేడి పాలు, కోన్ (ఐస్ క్రీమ్ కోన్ మార్కెట్లో దొరుకుతాయి)

కోన్ కాఫీ తయారీ విధానం

1 టేబుల్ స్పూన్ కాఫీ పౌడర్, 2 టేబుల్ స్పూన్ల చక్కెర, 1 టేబుల్ స్పూన్ వేడి నీరు వేసి బాగా కరిగించాలి. చక్కెర పూర్తిగా కరిగిన తర్వాత 1/2 కప్పు వేడి పాలను పోయాలి. చెంచాతో కదిలించాలి. కాఫీ సిద్ధం అవుతుంది. అప్పుడు కాఫీని కోన్‌లో పోసి వెంటనే సర్వ్ చేయండి. ఐస్ క్రీమ్ కోన్ మార్కెట్లో దొరుకుతాయి. కాఫీ అందులో నుంచి బయటకు రాకుండా క్రీమ్ కాపాడుతుంది.

మీరు ఇన్‌స్టంట్ కాఫీ చేయాలనుకుంటే ముందుగా పాలను పంచదారతో మరిగించి, ఆపై కాఫీ పొడిని వేసి తక్కువ మంటపై మరిగించాలి. ఆపై కోన్‌లో పోయాలి. తర్వాత కాఫీని తాగాలి. కోన్ ఐస్ క్రీమ్ తిన్నట్టుగా.. కోన్ కాఫీని తాగేయెుచ్చు. ఈ కాఫీ ఆలోచన చాలా సరదాగా ఉంటుంది. అయితే మీరు కోన్ కోసం కాఫీ తయారుచేసేటప్పుడు కొంచెం తక్కువ చక్కెరను జోడించాలి. ఎందుకంటే కోన్ కూడా తియ్యగా ఉంటుంది. అందుకే కాఫీలో పంచదార కొంచెం తగ్గిస్తే టేస్ట్ బాగుంటుంది.

కాఫీ ఆరోగ్య ప్రయోజనాలు

కాఫీలోని కెఫిన్ అలసటను నివారిస్తుంది. శరీరానికి శక్తిని ఇస్తుంది. టైప్ 2 డయాబెటిస్ ప్రమాదాన్ని నివారించడంలో సహాయపడుతుంది. మెదడు ఆరోగ్యానికి కాఫీ మంచిదని చాలా అధ్యయనాలు చెబుతున్నాయి. ఇది పార్కిన్సన్స్ ప్రమాదాన్ని నివారిస్తుంది. బరువు నియంత్రణలో కూడా ఉపయోగపడుతుంది. కాఫీ తాగడం వల్ల శరీరంలో కొవ్వు తగ్గుతుంది. కాఫీ తాగితే డిప్రెషన్‌ లేకుండా రిఫ్రెష్ ఫీల్ ఇస్తుంది. కాలేయ ఆరోగ్యానికి కూడా ఇది మంచిది. కాలేయంలోని మలినాలను బయటకు పంపుతుంది. అయితే కొత్త టేస్ట్ కోసం కోన్ కాఫీ ట్రై చేయండి.