Rakhi 2024: మీ సోదరుడి రాశి ప్రకారం ఈ రంగు రాఖీలు కట్టండి. వాళ్లకు మరింత అదృష్టం, ఐశ్వర్యం-how to choose rakhi colors for brothers based on their zodiac signs ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Rakhi 2024: మీ సోదరుడి రాశి ప్రకారం ఈ రంగు రాఖీలు కట్టండి. వాళ్లకు మరింత అదృష్టం, ఐశ్వర్యం

Rakhi 2024: మీ సోదరుడి రాశి ప్రకారం ఈ రంగు రాఖీలు కట్టండి. వాళ్లకు మరింత అదృష్టం, ఐశ్వర్యం

Koutik Pranaya Sree HT Telugu
Aug 17, 2024 01:30 PM IST

Rakhi 2024: సోదరుడి మంచి కోరి కట్టే రాఖీని వాళ్ల రాశి ప్రకారం ఎంచుకోండి. రాశి ప్రకారం వాళ్లకు నప్పు రాఖీ కట్టారంటే అన్ని సంతోషాలు వాళ్లకు అందుతాయి. మీ సోదరుడి రాశికి నప్పే రంగు రాఖీలు ఏవో, వాళ్లకు ఇవ్వదగ్గ మంచి బహుమతులేవో చూడండి.

రాశిని బట్టి రాఖీ
రాశిని బట్టి రాఖీ (freepik)

రాఖీ అంటే సోదరుడి మంచి కోరి కట్టేది. తోబుట్టువుల బంధానికి చిహ్నం. మీ సోదరుడికి మీరు కట్టే రాఖీ వల్ల మంచి జరగాలని కోరుకుంటూ.. వారి రాశిని బట్టి రాఖీ ఎంచుకోండి. దీంతో వాళ్లకు మరింత మంచి జరుగుతుంది. అదృష్టం, ఐశ్వర్యం, ఆరోగ్యం పెరుగుతుంది. మీ సోదరుడి రాశి ప్రకారం ఏ రంగు రాఖీ ఎంచుకోవాలో చూడండి. ఎలాంటి బహుమతులివ్వాలో చూడండి.

మేషం:

మేష రాశిలో పుట్టిన వాళ్లయితే వాళ్ల కోసం ఎరుపు, ఆరెంజ్, పసుపు పచ్చ రంగులో రాఖీ ఎంచుకోండి. సాధారణంగా మేష రాశి వాళ్లకు ఆటలంటే ఇష్టం ఉంటుందట. మీ సోదరుడికి కూడా అలాంటి ఆసక్తే ఉంటే స్పోర్ట్స్ కి సంబంధించిన ఏదైనా గ్యాడ్జెట్ మీరూ బహుమతిగా ఇవ్వొచ్చు.

వృషభం:

ఈ రాశిలో పుట్టిన వాళ్లకి నీలం లేదా సిల్వర్ రంగు రాఖీలు ఎంచుకోండి. ఇవి వాళ్లకు మరింత మేలు చేకూరుస్తాయి. మంచి స్వభావం ఉన్నా.. కాస్త కదలడానికి కూడా బద్ధకంగా ఉండే రకం వీళ్లు. అందుకే వీళ్ల కోసం బ్లాంకెట్లు, కస్టమైజ్డ్ దిండ్లు బహుమతిగా ఇచ్చేయండి.

మిథునం:

ఈ రాశిలో పుట్టిన సోదరుడి కోసం ఆకుపచ్చ రంగు రాఖీ ఎంచుకోండి. వీళ్లు తెలివితేటలున్నవాళ్లు. చాలా ఎక్కువగా చలాకీగా మాట్లాడతారు. వాళ్ల తెలివి తేటలు మరింత పెంచే పుస్తకాలు వాళ్లకు బహుమతిగా ఇవ్వండి.

కర్కాటకం:

ముత్యాలు, సిల్క్ దారాలతో చేసిన రాఖీ వీళ్లకు శ్రేయస్కరం. వీళ్ల మనసు లాగే అవీ మృదువుగా ఉంటాయి. చేతితో తయారు చేసిన ఏదైనా వస్తువు వీళ్లకు బహూకరించొచ్చు.

సింహం:

ఈ రాశి వాళ్లకోసం ఆరెంజ్, గులాబీ, ఎరుపు రంగు రాఖీ కొనండి. ఏదైనా జ్యువెలరీ, కాస్మోటిక్స్, పర్ఫ్యూమ్స్, గ్రూమింగ్ కిట్ బహుమతిగా ఇవ్వొచ్చు.

కన్య రాశి:

సిల్క్ దారాలతో చేసిన రాఖీ లేదా ఆకుపచ్చ, తెలుపు రంగు రాఖీలు ఎంచుకోవచ్చు. ఎప్పుడూ అన్ని వస్తువులు సర్దుకునే వీల్లకు దానికి సంబంధించిన ఆర్గనైజర్లు, మ్యాగజైన్ బాస్కెట్ , వాచీ లాంటివి బహుమతిగా ఇవ్వొచ్చు.

తుల:

తుల రాశిలో పుట్టిన మీ సోదరుడికి పర్పుల్ రంగు రాఖీ కట్టడండి. త్రాసును సూచించే ఈ రాశిలో పుట్టినవాళ్లకి ప్రేమ, భావోద్వేగాలు ఎక్కువ. వాళ్ల మనసుకు ప్రశాంతత ఇచ్చే సెంటెడ్ సబ్బులు, లోషన్లు, క్యాండిల్స్ గిఫ్ట్ గా ఇవ్వండి.

వృశ్చికం:

ఎరుపు రంగు రాఖీ వీళ్లకు కడితే మంచిది. వాళ్ల లుక్ గురించి ఎక్కువ శ్రద్ధ తీసుకుంటారు. కాబట్టి సన్ గ్లాసెస్, షూ లాంటివి మంచి బహుమతులవుతాయి.

ధనస్సు:

మీ సోదరుడు ధనస్సు రాశిలో పుడితే వాళ్ల కోసం పసుపు రంగు రాఖీ ఎంచుకోండి. వీళ్లు నీతి , నిజాయతీ ఉన్న వాళ్లు. వాళ్ల ఇష్టం తెల్సుకుని బహుమతినిస్తేనే మెచ్చుతారు.

మకరం:

గులాబీ రంగు రాఖీ వీళ్ల కోసం కొనండి. వీళ్లు లక్ష్య సాధన దిశగా పనిచేసే వ్యక్తులు. వాళ్ల ఉద్యోగం, విజయానికి సాయపడే ఏ బహుమతినైనా ఇవ్వండి.

కుంభం:

ఏదైనా ముదురు రంగు రాఖీ కుంభ రాశిలో పుట్టిన సోదరుడికి కట్టండి.. మీరిచ్చే బహుమతి వాళ్లకి నచ్చాలంటే ఏదైనా టెక్నాలజీ గ్యాడ్జెట్ కొనివ్వండి.

మీనం:

తెలుపు, పసుపు రంగు రాఖీలు వీళ్లకి శుభప్రదం. అందానికి, లగ్జరీకి సంబంధించిన ఏదైనా వస్తువు వీళ్లకి బహుమతిగా ఇవ్వండి. వాళ్లకు నచ్చేస్తుంది.