Chanakya Niti Telugu : తల్లిదండ్రులు ఈ 4 పనులు చేస్తే పిల్లల భవిష్యత్ బాగుంటుంది
Chanakya Niti In Telugu : ఆచార్య చాణక్యుడు తన చాణక్య నీతిలో తల్లిదండ్రుల కోసం చాలా ముఖ్యమైన అంశాలను అందించాడు. ఈ సూత్రాలను అనుసరించడం ద్వారా ఎవరైనా తమ బిడ్డను గొప్ప వ్యక్తిగా మార్చొచ్చు.
ఆచార్య చాణక్య ప్రకారం తల్లిదండ్రులు తమ పిల్లలను ఎలా గొప్పవారిగా మార్చగలరు? పిల్లలను ఎలా చూసుకోవాలో తెలుసా? చాణక్య నీతిలో ఒక వ్యక్తి జీవితానికి సంబంధించిన అనేక విషయాలు ఉన్నాయి. పిల్లలను సమర్థులుగా తీర్చిదిద్దేందుకు చాణక్యుడు ఎన్నో విషయాలు చెప్పాడు.
చాణక్యుడు చెప్పిన మాటలు నేటికీ సంబంధితంగా ఉన్నాయి. ఆ విషయాలను ఇప్పటికీ పాటించేవారు ఉన్నారు. తల్లిదండ్రులు తమ పిల్లలను ఎలా చూసుకోవాలో చాణక్యుడు చెప్పిన విషయాలు మీకోసం..
ఆచార్య చాణక్యుడు ప్రకారం, ప్రతి తల్లిదండ్రులు తమ పిల్లలకు మంచి అలవాట్లను అందించాలి. పిల్లలు తమ తల్లిదండ్రుల నుండి ప్రతిదీ నేర్చుకుంటారు. మంచి మర్యాదగల పిల్లలు ఎల్లప్పుడూ మంచి లక్షణాలతో ఉంటారు. తల్లిదండ్రులు పిల్లల్లో మంచి అలవాట్లు పెంపొందిస్తే అలాంటి పిల్లలు తల్లిదండ్రుల పేరును వెలుగులోకి తెస్తారు.
ఒక వ్యక్తి తన జీవితంలో చీకటిని తొలగించాలంటే విద్య చాలా ముఖ్యం. విద్య మనిషి జీవితంలోని అన్ని రకాల చీకట్లను తొలగిస్తుంది. విద్య ద్వారా మనిషి తన జీవితాన్ని సార్థకం చేసుకోగలడు. తల్లిదండ్రులు తమ పిల్లలను చదువులో ఎప్పుడూ ప్రోత్సహించాలి. తమ పిల్లలకు మంచి విద్యను అందించడంలో ఎప్పుడూ విఫలం కాకూడదు. విద్య లేని వాడు వింత పశువు అని అందుకే అంటారు.
చాణక్యుడు ప్రకారం, తల్లిదండ్రులు మొదటి నుండి పిల్లలకు మంచి చెడుల గురించి అవగాహన కల్పించాలి. పిల్లలు కూడా నిజం మాట్లాడేలా ప్రోత్సహించాలి. మీ బిడ్డ ఏదైనా తప్పు చేస్తున్నట్లు మీరు చూస్తే, వారిని సమర్థించే బదులు ఏది ఒప్పో ఏది తప్పుదో నేర్పించాలి. అలాగే జీవితంలో స్ఫూర్తిని పొందేందుకు వారిని ఎల్లప్పుడూ ప్రేరేపించాలి.
తల్లిదండ్రులు మొదటి నుండి పిల్లలకు క్రమశిక్షణ నేర్పాలి. పిల్లల్లో క్రమశిక్షణ ఉంటేనే జీవితంలో అన్నీ సమయానికి జరుగుతాయి. క్రమశిక్షణ ద్వారా, పనిని సమయానికి పూర్తి చేయడం ప్రాముఖ్యతను అర్థం చేసుకుంటారు. క్రమశిక్షణ కలిగిన పిల్లలు మెరుగైన లక్ష్యాలను సులభంగా సాధిస్తారని చాణక్యుడు చెప్పాడు.
ప్రతి తల్లిదండ్రులు తమ పిల్లలకు పై లక్షణాలను నేర్పించాలని చాణక్యుడు అన్నాడు. ఈ విషయాలను తల్లిదండ్రులు పిల్లలకు నేర్పిస్తే భవిష్యత్తులో సమాజంలో మంచి పౌరులుగా ఎదుగుతారని చాణక్యుడు నమ్మాడు.