irregular periods: పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? ఇవి తినండి
irregular periods: ఇర్రెగ్యులర్ పీరియడ్స్ సమస్య ఉన్నప్పుడు తీసుకోవాల్సిన ఆహారాలేంటో చూద్దాం.
irregular periods (pexels)
పీరియడ్స్ వచ్చిన మొదటి రోజుకు తరువాత పీరియడ్ మొదటి రోజు మద్య సమయం చాలా మందిలో సరాసరిగా 26 నుంచి 35 రోజుల మధ్య ఉంటుంది. కొంతమందిలో 21 రోజుల కన్నా తక్కువ సమయం, ఇంకొంత మందిలో 35 రోజుల కన్నా ఎక్కవ రోజుల తరువాత కూడా నెలసరి రావచ్చు. కానీ రెండు లేదా మూడు వారాలు ఆలస్యంగా కూడా నెలసరి రాకపోతే మీకు ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఉన్నట్లే.మన శరీరంలో హార్మోన్ల స్థాయుల్లో, అండం విడుదలయ్యే సమయంలో కూడా దీని ప్రభావం ఉంటుంది. తినే ఆహారం, వ్యాయామం దీనికి కారణం కావచ్చు. కొన్ని రకాలు ఆహారాల ద్వారా ఇంట్లోనే ఈ సమస్య కాస్త తగ్గించుకోవచ్చు. కానీ కారణం తెలుసుకోడానకిి ముందుగా వైద్యుల్ని తప్పకుండా సంప్రదించాలి.
పీరియడ్స్ క్రమం తప్పకుండా వచ్చేలా చేసే ఆహారాలు:
- వాము: దీన్ని నీళ్లలో ఉడికించి చల్లారాక నీళ్లు తాగాలి. పీరియడ్స్ క్రమంగా వచ్చేలా చేయడంతో పాటూ పీడియడ్స్ సమయంలో వచ్చే నొప్పి కూడా తగ్గిస్తుందిది.
- అనాస పువ్వు: దీంట్లో మహిళల హర్మోన్ల స్థాయుల్ని నియంత్రించే అనేక గుణాలున్నాయి. దీని చూర్ణాన్ని తేనెతో కలిపి తీసుకున్నా, లేదా నీళ్లలో మరిగించుకుని తాగినా మంచిదే.
- పైనాపిల్: దీంట్లో ఉండే ప్రత్యేక హర్మోన్ వల్ల వాపు ప్రక్రియను తగ్గించి పీరియడ్స్ క్రమంగా వచ్చేలా, ఆలస్యంగా అవ్వకుండా చేస్తుంది.
- పసుపు: గోరువెచ్చని పాలలో కొంచెం పసుపు, తేనె కలుపుకుని పడుకునే ముందు తాగాలి. దీనివల్ల కూడా మంచి ఫలితం ఉంటుంది.
- కలబంద: కలబందలో విటమిన్ ఏ, సి, ఈ , బీ12 , ఫోలిక్ యాసిడ్, అమైనో యాసిడ్లు, సాలిసిలిక్ యాసిడ్ ఉంటాయి. ఇవి పీరియడ్స్ ని నియంత్రించే హార్మోన్ స్థాయుల్ని క్రమబద్దీకరిస్తాయి. దానివల్ల నెలసరి ప్రతి నెలా క్రమం తప్పకుండా వస్తుంది.
- దాల్చిన చెక్క: ఇన్సులిన్ స్థాయులు కూడా నెలసరి క్రమాన్ని ప్రభావితం చేస్తాయి. దాల్చిన చెక్క ఇన్సులిన్ స్థాయుల్ని నియంత్రించి నెలసరి వచ్చేలా సాయపడుతుంది.
- డార్క్ చాకోలేట్: డార్క్ చాకోటేల్ లో ఫ్లవనాయిడ్లు ఉంటాయి. ఇవి ఈస్ట్రోజెన్ లా పనిచేసి పీరియడ్స్ ని నియంత్రిస్తాయి. అయితే ఇది ఎక్కువగా తినకూడదు. బరువు పెరగడంతో పాటూ, హార్మోన్ల స్థాయుల్లో హెచ్చుతగ్గులు వచ్చే అవకాశం ఉంటుంది.
- విటమిన్ డి: విటమిన్ డి క్రమంగా నెలసరి రావడంలో ముఖ్య పాత్ర పోషిస్తుంది. అయితే ఇది చాలా తక్కువ ఆహార పదార్థాల్లో ఉంటుంది. పాలు, పాల ఉత్పత్తులు, ట్యూనా చేపలు, గుడ్డు, సాల్మన్ చేపల్లో ఎక్కువగా ఉంటుంది.
టాపిక్