Computer Eye Strain : స్క్రీన్ ఎక్కువగా చూస్తున్నారా? అయితే 20-20-20 రూల్ పాటించండి-heres computer eye strain prevention tips and quick remedies ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Computer Eye Strain : స్క్రీన్ ఎక్కువగా చూస్తున్నారా? అయితే 20-20-20 రూల్ పాటించండి

Computer Eye Strain : స్క్రీన్ ఎక్కువగా చూస్తున్నారా? అయితే 20-20-20 రూల్ పాటించండి

Anand Sai HT Telugu
Feb 20, 2023 05:18 PM IST

Eye Care Tips : డిజిటల్ స్క్రీన్స్ కారణంగా కంటి సమస్యలు ఇటీవలి కాలంలో ఎక్కువయ్యాయి. చాలా మంది ఫోన్‌లు, ట్యాబ్స్, కంప్యూటర్ మానిటర్‌లు, టెలివిజన్‌లను ఎక్కువ సమయం చూస్తున్నారు. దీంతో లేనిపోని సమస్యలు వస్తున్నాయి.

స్క్రీన్ తో కంటి సమస్యలు
స్క్రీన్ తో కంటి సమస్యలు

ఈ ఆధునిక కాలంలో ఉదయం లేచినదగ్గర నుంచి.. రాత్రి పడుకునే వరకూ స్క్రీన్(Screen) ముందు ఉంటారు. ఉద్యోగాల కోసం ఎక్కువసేపు స్క్రీన్‌లను చూడవలసి ఉంటుంది. ఈ పరిస్థితిని కంప్యూటర్ విజన్ సిండ్రోమ్(computer vision syndrome) అని కూడా పిలుస్తారు. కంటికి అలసట, కళ్ళు పొడిబారడం, ఇతర లక్షణాలతో పాటు తలనొప్పికి కారణమవుతుంది. డిజిటల్(Digital) యుగంలో కంటి సమస్య సాధారణమైపోతోంది. కంప్యూటర్లు, ఫోన్‌లు, టాబ్లెట్‌లు వంటి డిజిటల్ పరికరాలను ఉపయోగించడం వల్ల కలిగే కంటి ఒత్తిడిని డిజిటల్ ఐ స్ట్రెయిన్(digital eye strain) అంటారు.

మనం సాధారణంగా నిమిషానికి 15 నుంచి 20 సార్లు రెప్పవేయడం వల్ల కంటిలోని నీరు.. కళ్లపై సమానంగా వ్యాప్తి చెందుతాయి. అవి పొడిబారకుండా, చికాకుగా మారకుండా చూస్తాము. అయితే ప్రజలు చదివేటప్పుడు, చూసేటప్పుడు, ఆడుతున్నప్పుడు తక్కువ రెప్పలు కొడతారు. దీంతో సమస్యలు వస్తాయి.

కంప్యూటర్ స్క్రీన్(Computer Screen) వలన కళ్లు పొడిబారుతాయి. అయితే కొన్ని ఐ డ్రాప్స్(Eye Drops) దొరుకుతాయి. వాటిని ఉపయోగించొచ్చు. మీ కళ్ళు సరిగా కనిపించనప్పుడు కూడా ఉపయోగించండి. మీ కంటికి ఎలాంటి చుక్కలు సరిపోతాయో.. మీ వైద్యుడిని అడగండి. కంటి చుక్కలను అవసరమైన వరకూ ఉపయోగించొచ్చు. అయితే మరీ ఎక్కువగా వాడడం మంచిది కాదు.

మీరు డిజిటల్ డిస్‌ప్లే(Digital Display)కు దగ్గరగా పని చేస్తుంటే.. అప్పుడప్పుడు బ్రేక్ తీసుకోండి. మీ కళ్ళకు విశ్రాంతిని ఇవ్వడానికి దాని నుండి దూరంగా చూడండి. కంప్యూటర్ స్క్రీన్‌ను చూస్తూ లేదా పుస్తకాన్ని చదివిన తర్వాత వెచ్చని కంప్రెస్‌ని ఉపయోగించడం వల్ల మీ కంటి కండరాలను రిలాక్స్ చేయవచ్చు. పొడి కళ్ళ నుండి ఉపశమనం పొందవచ్చు. ఈ పద్ధతిలో మెత్తగా ఉండి, శుభ్రమైన గుడ్డను గోరువెచ్చని నీటిలో ముంచి.. కను రెప్పల మీద పెట్టుకోవాలి.

వేళ్లను శుభ్రం చేసుకుని కంటికి మసాజ్ చేయడం కూడా మంచిది. కనురెప్పలు, కనుబొమ్మల పైన కండరాలు, కళ్ల కింద మసాజ్ చేయండి. ఇది కళ్ళకు రక్త ప్రసరణను పెంచుతుంది. అదే సమయంలో కంటి ఒత్తిడిని తగ్గిస్తుంది. కొన్ని చుక్కల ఆలివ్ ఆయిల్, అలోవెరా జెల్ మరింత రిలాక్సింగ్‌గా చేయడానికి ఉపయోగించవచ్చు.

మీ అద్దాలు లేదా కాంటాక్ట్ లెన్స్‌లు(Contact Lenses) లేకుండా కిటికీ లేదా సూర్యరశ్మిని పుష్కలంగా పొందే ప్రదేశం ముందు నిలబడండి. మీ కళ్ళు మూసుకోండి. సూర్యకాంతి మీ కనురెప్పలను మీద పడనీయండి. ఉబ్బిన కళ్ల నుండి ఉపశమనం పొందడానికి, కంటి చుట్టూ రక్త ప్రసరణను పెంచడానికి.. కనీసం 10 నిమిషాల పాటు కనురెప్పలకు చల్లని అలోవెరా జెల్‌తో మసాజ్ చేయండి.

మీరు ఎలక్ట్రానిక్ పరికరాలను ఉపయోగించే విధానానికి కొన్ని మార్పులు చేస్తే మంచిది. మీరు కంప్యూటర్‌ని ఉపయోగిస్తుంటే స్క్రీన్ మీ ముఖానికి దాదాపు 25 అంగుళాల దూరంలో, ఒక చేయి పొడవులో ఉండేలా చూసుకోండి. స్క్రీన్ మధ్యలో కంటి స్థాయి కంటే 10-15 డిగ్రీలు తక్కువగా ఉండాలి. 20-20-20 నియమాన్ని అనుసరించండి. ప్రతి 20 నిమిషాలకు కనీసం 20 సెకన్ల పాటు కనీసం 20 అడుగుల దూరంలో ఉన్న వస్తువును చూడండి. కంప్యూటర్‌(Computer)లో పని చేస్తున్నప్పుడు.. స్క్రీన్ కోసం అద్దాలు దొరుకుతాయి. వాటిని వాడుకోవచ్చు.

Whats_app_banner