Late Night Dinner Recipe। అర్ధరాత్రి ఆకలి వేస్తుందా..? ఇదిగో మినీ మీల్స్ రెడీ!
ప్రస్తుతం చాలా మంది అర్ధరాత్రి వరకు మేల్కొనే ఉంటున్నారు. రాత్రివేళ ఆకలిగా ఉంటే త్వరగా, సులభంగా చేసుకోగలిగే Late Night Dinner Recipe ఇక్కడ అందిస్తున్నాం చూడండి.
Late Night Dinner Recipe: ఒకప్పుడు సెకండ్ షో సినిమా చూసి వస్తుంటే, రాత్రి ఆహారం గురించి బెంగ ఉండేది. ఎక్కడైనా, ఏదైనా రెస్టారెంట్ తెరిచి ఉందా అని వెతికేవారు. కానీ ఇప్పుడు OTT ప్లాట్‌ఫారమ్‌లు మన జీవనశైలిలో భాగం అయిపోయాయి. OTTలు వచ్చిన దగ్గర్నించీ సెకండ్ షోలు, మిడ్ నైట్ షోలు ఇలా షోల మీద షోలు, సినిమాలు, సిరీస్‌లు చూడడం చాలా మందికి ఒక వ్యసనంగా మారింది. చివరకు డిన్నర్ చేయాలనే విషయం కూడా మరిచిపోతారు. ఆపై అర్ధరాత్రికి చాలా ఆకలి వేస్తుంది. కానీ, మన శరీరంలోని వ్యవస్థలు పగటిపూట ఆహారాన్ని జీర్ణం చేయడానికి సెట్ చేసి ఉంటాయి. మరి మిడ్ నైట్ మంచింగ్ అంటే ఎలా? అదికూడా ఆ రాత్రి భోజనం వండుకొని తినడం అంటే అసలు ఆసక్తి ఉండదు. అయినప్పటికీ మీ జీర్ణవ్యవస్థకు అంతరాయం కలిగించని ఆరోగ్యకరమైన మినీ మీల్స్ మీరు అప్పటికప్పుడు చేసుకోవచ్చు.
రెండు నిమిషాల్లో సులభంగా బ్రెడ్ ఆమ్లెట్, నూడుల్స్ చేసుకోవచ్చు. ఐదు నిమిషాల్లో అద్భుతమైన స్నాక్స్ చేసుకోవచ్చు. ఇంతకంటే తేలికైన, ఆరోగ్యకరమైన టేంపర్డ్ బ్రెడ్ మరొక ఆప్షన్‌గా ఉంది. దాని రెసిపీ ఈ కింద చూడండి.
Tempered Bread/ Tadka Bread Recipe
- 4 బ్రెడ్ ముక్కలు
- 1 టమోటా
- 2 టేబుల్ స్పూన్లు కూరగాయల లేదా ఆలివ్ నూనె
- 1/4 టీస్పూన్ ఆవాలు
- 1 ఉల్లిపాయ
- 2 పచ్చిమిర్చి
- 1/4 టీస్పూన్ పసుపు
- 1/2 టీస్పూన్ చక్కెర (ఐచ్ఛికం)
- 1/4 tsp జీలకర్ర పొడి
- 1/4 స్పూన్ ఉప్పు
- 1 టేబుల్ స్పూన్ పెరుగు
- 1 స్పూన్ నిమ్మరసం
- తాజా కొత్తిమీర
తడ్కా బ్రెడ్ ఎలా తయారు చేయాలి
1. ఒక చిన్న సాస్ పాన్‌లో నూనె వేడి చేసి, ఆవాలు వేయండి. అవి చిటపటలాడిన తర్వాత, ఉల్లిపాయ ముక్కలు, మిరపకాయ ముక్కలను వేసి ఒక నిమిషం పాటు కదిలించండి.
2. ఆ తర్వాత పసుపు, పంచదార, జీలకర్ర, ఉప్పు వేసి 1 నిముషం పాటు వేయించాలి.
3. ఆపై పెరుగు, నిమ్మరసం వేసి కలుపుతూ ఉండాలి.
4. ఇప్పుడు బ్రెడ్‌లను చిన్న చిన్న ముక్కలుగా క్యూబ్ ఆకారంలో కత్తిరించుకొని వేయించిన మసాలాలో వేయాలి. ఎక్కువగా నలిగిపోకుండా జాగ్రత్తగా కలపండి.
4. చివరగా కొత్తిమీర ఆకులు, సన్నగా తరిగిన టొమాటో ముక్కలు చల్లుకుంటే తడ్కా బ్రెడ్ లేదా బ్రెడ్ మసాలా రెడీ.
సంబంధిత కథనం