Coriander Rice Recipe। కొత్తిమీర అన్నం.. చేయడం సులభం, తింటే ఎంతో ఆరోగ్యం!
Coriander Rice Recipe: కొత్తిమీరను ఆహారంలో చేర్చుకొని తినడం చాలా ఆరోగ్యకరం. మీకు ఇక్కడ కొత్తిమీర అన్నం రెసిపీని తెలియజేస్తున్నాం. ఎలా చేయాలో ఈ కింద ఇచ్చిన సూచనలు చదవండి.
Quick Rice Recipes: కొత్తిమీరను ఆహారంలో చేర్చుకొని తినడం చాలా ఆరోగ్యకరం. మీకు ఇక్కడ కొత్తిమీర అన్నం రెసిపీని తెలియజేస్తున్నాం. ఈ బ్రౌన్ రైస్ ఉపయోగించి చేసే ఈ రెసిపీలో ఫైబర్, మినరల్స్, బి6, నియాసిన్ వంటి విటమిన్లు ఉంటాయి. అదనంగా కొత్తిమీరలో ఉన్న పోషకాలను పొందవచ్చు.
కొత్తిమీర ఆకులు విటమిన్ ఎ, విటమిన్ సి లకు అద్భుతమైన మూలం. ఇంకా, డైటరీ ఫైబర్, ఐరన్, మాంగనీస్, కాల్షియం, విటమిన్ కె, ఫాస్పరస్ మొదలైన అనేక పోషకాలు ఉంటాయి. అంతే కాకుండా, మీ శరీర జీవక్రియకు సహాయపడే ఎంజైమ్‌లను కలిగి ఉంటాయి. ఆకుపచ్చని కొత్తిమీర ఆకులను ఆహారంతో పాటు తినడం ద్వారా మెరుగైన కంటిచూపు ఉంటుంది, రోగనిరోధక శక్తి పెరుగుతుంది, కొత్తిమీరలోని పొషకాలు చర్మాన్ని ఆరోగ్యాన్ని ఉంచడంలో సహాయపడతాయి. కొత్తిమీర ఆకులలో మంచి మొత్తంలో ఫైబర్ ఉంటుంది, ఇది జీర్ణ సమస్యల నుండి ఉపశమనం కలిగిస్తుంది. కొత్తిమీరలోని యాంటీఆక్సిడెంట్లు ఎంజైమ్ కార్యకలాపాలను ప్రోత్సహించడంలో సహాయపడతాయి. ఇన్సులిన్ స్రావాన్ని ప్రేరేపిస్తుంది, రక్తంలో చక్కెర స్థాయిలను నిర్వహించడంలో సహాయపడవచ్చు. రక్తంలో చెడు కొలెస్ట్రాల్ కూడా తగ్గుతుంది. కొత్తిమీర రైస్ ఎలా చేయాలో ఈ కింద ఇచ్చిన సూచనలు చదవండి.
Coriander Rice Recipe కోసం కావలసినవి
- 1 కప్పు బ్రౌన్ రైస్
- 1 ఆకుపచ్చ క్యాప్సికమ్
- 1 ఉల్లిపాయ
- 1 tsp అల్లం వెల్లుల్లి పేస్ట్
- 1/4 కప్పు పెరుగు
- 2 టేబుల్ స్పూన్లు కొత్తిమీర- పుదీనా - పచ్చిమిర్చి పేస్ట్
- 1 స్పూన్ గరం మసాలా
- 1 బిరియానీ ఆకు
- 1/2 tsp ధనియాల పొడి
- 1 చిటికెడు పసుపు
- 1 స్పూన్ ఆలివ్ నూనె
- రుచికి తగినంత ఉప్పు
కొత్తిమీర రైస్ ఎలా తయారు చేయాలి
- ముందుగా ఒక నాన్ స్టిక్ పాత్రలో నూనె వేడి చేసి, వేడయ్యాక జీలకర్రను వేయించాలి. ఆపైన బిరియానీ ఆకు తరిగిన ఉల్లిపాయలు, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించండి.
- ఇప్పుడు కొత్తిమీర పుదీనా పేస్ట్, పెరుగు వేసి బాగా ఉడికించాలి. మసాలా బాగా ఉడికిన తర్వాత, మనోహరమైన సువాసన వస్తుంది.
- అనంతరం క్యాప్సికమ్ ముక్కలు వేసి బాగా కలపి ఒక నిమిషం ఉడికించండి.
- ఇప్పుడు బాగా కడిగిన బ్రౌన్ రైస్, 2 కప్పుల నీరు వేసి బాగా కలిపి, మూత పెట్టి 15 నిమిషాలు లేదా అన్నం పూర్తయ్యే వరకు ఉడికించాలి.
- చివరగా కొంచెం కొత్తిమీరతో గార్నిష్ చేయాలి.
అంతే, ఘుమఘుమలాడే రుచికరమైన కొత్తిమీర రైస్ రెడీ. రైతాతో తింటే అద్భుతంగా ఉంటుంది.
సంబంధిత కథనం
టాపిక్