Green tea: గ్రీన్ టీ ఆరోగ్యమే కానీ రుచి నచ్చడం లేదా? వీటిని కలుపుకుని తాగితే ఎంతో టేస్టీగా ఉంటుంది
Green tea: గ్రీన్ టీ ఆరోగ్యానికి ఎంతో మంచిది. కానీ దీన్ని తాగాలంటే రుచి కాస్త చేదుగా, వగరుగా ఉండడం వల్ల తాగాలనిపించదు. గ్రీన్ టీలో కొన్ని రకాల పదార్థాలు కలపడం ద్వారా దాని రుచిని మెరుగుపరుచుకోవచ్చు.
గ్రీన్ టీ ప్రయోజనాలు ఇన్నీ అన్నీ కావు. కానీ దాని ఆస్ట్రిజెంట్ రుచి కారణంగా చాలా మంది దీన్ని తాగేందుకు ఇష్టపడరు. మీరు ఆరోగ్యంగా ఉండటానికి, ముఖ్యంగా జీవక్రియ వ్యవస్థను సరిచేయడానికి గ్రీన్ టీ తాగాల్సిందే. బరువు తగ్గాలనుకునేవారికి కూడా గ్రీన్ టీ ఎంతో మేలు చేస్తుంది. అయితే రుచి కారణంగా ఎంతో మంది దీన్ని తాగేందుకు ఇష్టపడరు.
గ్రీన్ టీలో కొన్ని రకాల పదార్థాలు కలపడం వల్ల ఆ టీ రుచిని మెరుగుపరచడమే కాకుండా ఆరోగ్యానికి రెట్టింపు ప్రయోజనాలను అందిస్తాయి. ఎన్నో రుచులతో కూడిన గ్రీన్ టీ మార్కెట్ లో అందుబాటులో ఉన్నప్పటికీ సహజసిద్ధంగా తయారుచేసిన గ్రీన్ టీ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. గ్రీన్ టీ రుచిని ఏ పదార్థాలు మెరుగుపరుస్తాయో తెలుసుకోండి.
ఆపిల్ సిడర్ వెనిగర్
ఆపిల్ సైడర్ వెనిగర్ రుచి కొద్దిగా పుల్లగా, తీపిగా ఉంటుంది. దీన్ని గ్రీన్ టీలో కలిపి తీసుకుంటే గ్రీన్ టీలో ఉండే జిడ్డును తగ్గిస్తుంది. ఒక కప్పు గ్రీన్ టీలో ఒక టీస్పూన్ ఆపిల్ సైడర్ వెనిగర్ వేసి త్రాగాలి. ఇది రుచిని పెంచడమే కాకుండా బరువు తగ్గే ప్రక్రియను మరింత సులభతరం చేస్తుంది. వాస్తవానికి, చాలా మంది బరువు తగ్గడానికి ఆపిల్ సైడర్ వెనిగర్ తాగుతారు.
నిమ్మరసం
గ్రీన్ టీ రుచిని పెంచడానికి చాలా మంది నిమ్మరసం కలుపుతారు. ఇది రుచిని పెంచడంతో పాటు ఆరోగ్యానికి మేలు చేస్తుంది. నిమ్మరసం గ్రీన్ టీలో యాంటీఆక్సిడెంట్లను పెంచుతుంది. ఇది రోగనిరోధక శక్తిని పెంచుతుంది. ఇది వేగంగా బరువు తగ్గడానికి సహాయపడుతుంది.
ఎర్ర ద్రాక్షలు
మార్కెట్లో ఎర్ర ద్రాక్షలు లభిస్తాయి. గ్రీన్ టీ తయారు చేసేటప్పుడు, ఒక ద్రాక్షను నీటిలో మరిగించి, ఆపై గ్రీన్ టీలో కలపండి. ఇది ద్రాక్ష రుచిని గ్రీన్ టీకి ఇస్తుంది. గ్రీన్ టీకు ఉండే ఆస్ట్రింజిని కూడా తగ్గిస్తుంది. వీటితో పాటు గ్రీన్ టీ ఆరోగ్యానికి కూడా మేలు చేస్తుంది.
గ్రీన్ టీ తాగడం వల్ల ఆరోగ్యానికి జరిగే మేలు అంతా ఇంతా కాదు, గ్రీన్ టీలో యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. ఇవి మన శరీరానికి అత్యవసరమైనవి. డయాబెటిస్ ఉన్నవారు కచ్చితంగా తాగాల్సిన పానీయాల్లో ఇది ఒకటి. గ్రీన్ టీ తాగడం వల్ల బరువు త్వరగా తగ్గుతారు. అలాగే వారి మెదడు కూడా చురుగ్గా పనిచేస్తుంది. కీళ్ల నొప్పులు ఉన్న వారు కూడా గ్రీన్ తాగడం అలవాటు చేసుకుంటే మంచిది. ఒత్తిడి నుంచి కూడా ఉపశమనం కలుగుతుంది. ప్రత్యేకంగా మెదడు కోసం కచ్చితంగా గ్రీన్ టీ తాగడం అలవాటు చేసుకుంటే మంచిది.
టాపిక్