ఈ సమస్యలతో ఉన్న వారు ఎండు ద్రాక్షలను ఎక్కువగా తినకూడదు
Photo: Pexels
By Chatakonda Krishna Prakash Jul 28, 2024
Hindustan Times Telugu
ఎండు ద్రాక్షల్లో ముఖ్యమైన విటమిన్లు, మినరల్స్ లాంటి పోషకాలు లాంటివి పుష్కంలగా ఉంటాయి. వీటిని ప్రతీరోజు తినడం వల్ల ఆరోగ్యానికి మేలు జరుగుతుంది. అయితే కొన్ని సమస్యలు ఉన్న వారు ఎండు ద్రాక్షలను మరీ ఎక్కువగా తినకూడదు. అవేంటో ఇక్కడ చూడండి.
Photo: Pexels
డయాబెటిస్ ఉన్న వారు, బ్లడ్ షుగర్ లెవెల్స్ ఎక్కువగా ఉన్న వారు ఎండు ద్రాక్షలను అతిగా తినకూడదు. వీటిలో గ్లెసెమిక్ ఇండెక్స్ ఎక్కువగా ఉంటుంది. దీంతో బ్లడ్ షుగర్ లెవెల్స్ మరింత పెరిగే అవకాశాలు ఉంటాయి.
Photo: Pexels
వాంతులు, డయేరియాతో బాధపడుతున్న సమయంలో ఎండు ద్రాక్షలను ఎక్కువగా తినకూడదు.
Photo: Pexels
ఆహారం జీర్ణమయ్యేందుకు ఇబ్బందిగా ఉన్న సమయంలోనూ ఎండు ద్రాక్షను ఎక్కువగా తీసుకోకూడదు. జీర్ణక్రియను ద్రాక్ష నెమ్మది చేయగలదు. దీనివల్ల మలబద్దకం, గ్యాస్ సమస్యలు రావొచ్చు.
Photo: Pexels
ఊబకాయంతో ఉండే వారు ఎండు ద్రాక్షలను అతిగా తినకూడదు. వీటిలో క్యాలరీలు అధికంగా ఉంటాయి. ఇవి ఎక్కువగా తీసుకుంటే బరువు పెరిగే అవకాశాలు ఉంటాయి.
Photo: Pexels
శ్వాసకోశ అలర్జీలు ఉన్న వారు కూడా ఎందుద్రాక్షలను ఎక్కువగా తినకూడదు. ఇవి అతిగా తీసుకుంటే శ్వాస ఇబ్బందులు ఎక్కువయ్యే రిస్క్ ఉంటుంది. అందుకే శ్వాస సమస్యలు ఉన్నప్పుడు ఎండు ద్రాక్ష ఎక్కువగా తినకూడదు.
Photo: Pexels
చలికాలంలో ఈ జ్యూస్‍తో మెండుగా రోగ నిరోధక శక్తి.. రోజూ తాగండి!