Gongura Kodi pulao: గోంగూర కోడి పులావ్ ఇలా చేశారంటే రెసిపీ అదిరిపోతుంది, ఇంటిల్లిపాదికి పండగే-gongura kodi pulao recipe in telugu know how to make this pulao ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Gongura Kodi Pulao: గోంగూర కోడి పులావ్ ఇలా చేశారంటే రెసిపీ అదిరిపోతుంది, ఇంటిల్లిపాదికి పండగే

Gongura Kodi pulao: గోంగూర కోడి పులావ్ ఇలా చేశారంటే రెసిపీ అదిరిపోతుంది, ఇంటిల్లిపాదికి పండగే

Haritha Chappa HT Telugu
Feb 06, 2024 12:24 PM IST

Gongura Kodi pulao: కోడి పులావ్ అంటే ఎంతోమందికి ఇష్టం. ఎప్పుడూ దీన్ని ఒకేలా కాకుండా ఓసారి కొత్తగా గోంగూర కోడి పులావ్ చేసి చూడండి. దీని రెసిపీ చాలా సులువు.

గోంగూర కోడి పులావ్ రెసిపీ
గోంగూర కోడి పులావ్ రెసిపీ (pixabay)

Gongura Kodi pulao: కోడిపులావ్ పేరు వింటేనే నోరూరిపోతుంది. ఇక దానికి గోంగూర జత అయితే రుచి మామూలుగా ఉండదు. దీన్ని ఇంట్లోనే చాలా సులువుగా తయారు చేసుకోవచ్చు. నోరు చప్పగా అనిపిస్తున్నప్పుడు, బయట చలిగా ఉన్నప్పుడు వేడివేడిగా ఇలా గోంగూర కోడి పులావ్ చేసుకుంటే టేస్ట్ అదిరిపోతుంది. దీన్ని చాలా సులువుగా చేయొచ్చు. పిల్లలకు, పెద్దలకు ఇది నచ్చుతుంది. పుట్టినరోజులు, పెళ్లిరోజులు వంటి వేడుకలు సమయంలో ఇది చాలా స్పెషల్ గా ఉంటుంది. గోంగూర కోడి పులావ్ రెసిపీ ఇప్పుడు ఎలాగో చూద్దాం.

గోంగూర కోడి పులావ్ రెసిపీకి కావాల్సిన పదార్థాలు

బాస్మతి బియ్యం - రెండు కప్పులు

చికెన్ - 300 గ్రాములు

గోంగూర - ఒక కట్ట

ఉల్లిపాయలు - రెండు

లవంగాలు - రెండు

వెల్లుల్లి రెబ్బలు - మూడు

అల్లం - చిన్న ముక్క

పచ్చిమిర్చి - రెండు

జీలకర్ర - ఒక స్పూను

ఆవాలు - ఒక స్పూను

జీలకర్ర పొడి - ఒక స్పూను

ధనియాల పొడి - ఒక స్పూను

ఉప్పు - రుచికి

సరిపడా - నూనె

నీళ్లు - తగినంత

కారం - అర స్పూను

పసుపు - పావు స్పూను

గోంగూర కోడి పులావ్ రెసిపి

1. బియ్యాన్ని నీటిలో శుభ్రంగా కడిగి, అరగంట పాటు నానబెట్టాలి.

2.ఇప్పుడు స్టవ్ మీద కళాయి పెట్టి నూనె వేయాలి. అందులో జీలకర్ర, ఆవాలు వేసి బాగా వేయించాలి.

3. తర్వాత నిలువుగా తరిగిన ఉల్లిపాయ ముక్కలను వేసి వేయించాలి.

4. సన్నగా తరిగిన అల్లం, వెల్లుల్లిని వేసి వేయించుకోవాలి.

5. ఇప్పుడు చికెన్ వేసి బాగా కలిపి మగ్గనివ్వాలి. ఇందులోనే నిలువుగా తరిగిన పచ్చిమిర్చి, జీలకర్ర పొడి, ధనియాల పొడి ఉప్పు వేసి బాగా కలపాలి.

6. శుభ్రంగా కడిగిన గోంగూర ఆకులను వేసి మూత పెట్టి బాగా మగ్గనివ్వాలి.

7. అర స్పూను కారం, పావు స్పూను పసుపు వేసుకొని బాగా కలపాలి.

8. లవంగాలు, గరం మసాలా వేసి బాగా కలపాలి.

9. ఇప్పుడు స్టవ్ మీద మూత పెట్టి అది ఇగురులా అయ్యేవరకు మగ్గించుకోవాలి.

10. తర్వాత స్టవ్ మంట తగ్గించి ముందుగా నానబెట్టిన బియ్యాన్ని, గ్లాసు నీటిని వేసి 15 నుంచి 20 నిమిషాలు ఉడకనివ్వాలి.

11. అన్నం పొడిపొడిగా వచ్చేంతవరకు ఉడికించి స్టవ్ కట్ చేయాలి. అంతే వేడివేడిగా గోంగూర కోడి పులావ్ రెడీ అయినట్టే.

మీకు స్పైసీగా తినాలనిపిస్తే పచ్చిమిర్చి మీదే ఆధారపడాలి. కారం వేస్తే రంగు మారిపోయే అవకాశం ఉంది. గోంగూర కోడి పులావ్ కాస్త ఆకుపచ్చ రంగులో వస్తుంది, కాబట్టి పచ్చిమిర్చిని వేస్తే మంచిది. కారం ఎక్కువగా కావాలనుకునే వారు పచ్చిమిర్చిని సన్నగా తరిగి ఎక్కువగా వేసుకోవాలి. సాధారణంగా తినేవారు మూడు పచ్చిమిర్చిని వేసుకుంటే సరిపోతుంది. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. వేడిగా ఉన్నప్పుడు తింటేనే దీని రుచి మరింతగా తెలుస్తుంది.

Whats_app_banner