Egg Curry Recipe: డిన్నర్లో గోంగూర కోడిగుడ్డు కూర ఇలా చేసేయండి, నోరూరిపోవడం ఖాయం-gongura egg curry recipe in telugu know how to make egg curry ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Egg Curry Recipe: డిన్నర్లో గోంగూర కోడిగుడ్డు కూర ఇలా చేసేయండి, నోరూరిపోవడం ఖాయం

Egg Curry Recipe: డిన్నర్లో గోంగూర కోడిగుడ్డు కూర ఇలా చేసేయండి, నోరూరిపోవడం ఖాయం

Haritha Chappa HT Telugu
Jan 30, 2024 05:30 PM IST

Egg Curry Recipe: గోంగూర కోడిగుడ్డు కాంబినేషన్ అదిరిపోతుంది. దీన్ని ఒక్కసారి తిన్నారంటే మళ్ళీ మళ్ళీ తినాలనుకుంటారు. వేడివేడి అన్నంలో గోంగూర కోడి గుడ్డు కూరను కలుపుకొని తిని చూడండి.

కోడిగుడ్డు కూర
కోడిగుడ్డు కూర (Sriharsha Cooking channel/youtube)

Egg Curry Recipe: గోంగూరతో చేసే వంటలు పుల్లపుల్లగా టేస్టీగా ఉంటాయి. గోంగూర పచ్చడికి అభిమానులు ఎక్కువ. అలాగే గోంగూర మటన్, గోంగూర రొయ్యలు, గోంగూర చికెన్.. ఇవన్నీ చాలా ఫేమస్. అలాగే గోంగూర కోడి గుడ్డు కూర చాలా టేస్టీగా ఉంటుంది. ఒక్కసారి దీన్ని తిన్నారంటే మళ్ళీ మీకే తినాలనిపిస్తుంది. వేడివేడి అన్నంలో ఈ గోంగూర కోడిగుడ్డు కూరను ఒక్కసారి ట్రై చేయండి. ఎంత రుచిగా ఉంటుందో పిల్లలకు ఇది కచ్చితంగా నచ్చుతుంది.

గోంగూర కోడి గుడ్డు కూర రెసిపీకి కావలసిన పదార్థాలు

గోంగూర - మూడు కట్టలు

గుడ్లు - నాలుగు

ఉల్లిపాయ - రెండు

పచ్చిమిర్చి - ఆరు

ఉప్పు - రుచికి సరిపడా

కారం - రెండు స్పూన్లు

పసుపు - అర స్పూన్

ధనియాల పొడి - ఒక స్పూను

లవంగాలు - నాలుగు

దాల్చిన చెక్క - చిన్న ముక్క

ఎండుమిర్చి - మూడు ః

నీళ్లు - సరిపడినన్ని

యాలకులు - రెండు

ఉప్పు - రుచికి సరిపడా

గోంగూర కోడి గుడ్డు కూర రెసిపీ

1. స్టవ్ మీద కళాయి పెట్టి గోంగూరను వేసి వేయించాలి. అందులోనే పచ్చిమిర్చిని కూడా వేయాలి.

2. గోంగూర ముద్దలా అయ్యే వరకు ఉడికించాలి. తర్వాత తీసి పక్కన పెట్టుకోవాలి.

3. గోంగూర చల్లారాక దాన్ని మిక్సీలో వేసి మెత్తని పేస్టులా చేసుకోవాలి.

4. మరోపక్క గుడ్లను కూడా ఉడికించి పొట్టు తీసి పక్కన పెట్టుకోవాలి.

5. ఇప్పుడు స్టవ్ మీద కళాయి పెట్టి దాల్చిన చెక్క, లవంగాలు, యాలకులు, ఎండుమిర్చి వేసి ఒక నిమిషం పాటు వేయించాలి.

6. ఇప్పుడు సన్నగా తరిగిన ఉల్లిపాయలను వేసి వేయించాలి.

7. ఉప్పు వేసి వేయిస్తే ఉల్లిపాయలు త్వరగా వేగుతాయి.

8. అందులోనే అల్లం వెల్లుల్లి పేస్టును వేసి వేయించాలి.

9. పచ్చివాసన పోయే వరకు దాన్ని వేయించుకోవాలి.

10. అందులో ధనియాల పొడి, పసుపు, కారం వేసి బాగా కలపాలి.

11. ముందుగా ఉడికించి పొట్టు తీసి పెట్టుకున్న కోడిగుడ్లను వేసి కలపాలి.

12. మూత పెట్టి చిన్న మంట మీద మూడు నిమిషాల పాటు ఉంచాలి.

13. తర్వాత ముందుగా పేస్ట్ చేసుకున్న గోంగూరను అందులో వేసి బాగా కలపాలి.

14. ఒక గ్లాసు నీళ్లు వేసి కలిపి మూత పెట్టాలి.

15. కూర దగ్గరగా అయ్యేవరకు ఉడికించాలి. నూనె పైకి తేలితే కూర రెడీ అయినట్టే.

16. వేడి వేడి గోంగూర కోడి గుడ్డు కూరను అన్నంలో వేసుకొని తిని చూడండి. చాలా టేస్టీగా ఉంటుంది.

గోంగూర మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. దీనిలో మన ఆరోగ్యానికి అవసరమైన విటమిన్ ఏ, విటమిన్ బి, మెగ్నీషియం, క్యాల్షియం, ఫాస్ఫరస్, విటమిన్ సి, ఐరన్ వంటివన్నీ ఉన్నాయి. ఇవి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. వారంలో రెండు సార్లు గోంగూర తింటే ఎంతో మేలు జరుగుతుంది. కాలేయానికి గోంగూర ఎంతో మేలు చేస్తుంది. ఇది రక్తాన్ని శుద్ధి చేసి శరీరంలో రక్తప్రసరణ సవ్యంగా జరిగేలా చేస్తుంది. దీనివల్ల కాలేయ ఆరోగ్యం బాగుంటుంది. కోడిగుడ్లలో విటమిన్ ఇ, ఐరన్, జింక్, పొటాషియం వంటివి అధికంగా ఉంటాయి. దీనిలో ప్రోటీన్లు సమృద్ధిగా ఉంటాయి. రోజుకో గుడ్డు తినమని ప్రభుత్వం చెబుతోంది. వారానికి ఒకసారి రెండు మూడు సార్లు కోడిగుడ్ల కూర వండుకుంటే ఎంతో మంచిది.

Whats_app_banner