Ganesh Chaturthi Songs 2023: వినాయకుని మండపాల్లో ఎక్కువగా వినిపించేవి ఈ పాటలే..
Ganesh Chaturthi Songs Telugu: జయ జయ శుభకర వినాయకా అన్నా.. జై జై గణేశ అంటూ గంతులేసినా.. గణపతి బప్పా మోరియా అంటూ మాస్ స్టెప్స్ వేసినా అది తెలుగు ప్రేక్షకులకే దక్కింది. ఎందుకంటే తెలుగు సినిమాల్లో ఎక్కువగా వినాయకుని మీద పాటలను చిత్రీకరిస్తారు కాబట్టి. టాప్ సాంగ్స్ లిస్ట్ ఇప్పుడు తెలుసుకుందాం.
Ganesh Chaturthi Songs Telugu 2023: వినాయక చవితి సమయంలో ప్రతి మండపం వినాయకుని పాటలతో మార్మోమ్రోగుతూనే ఉంటాయి. మన తెలుగు చిత్రాల్లో గణేషుని మీద ఇప్పటికే చాలా పాటలు వచ్చాయి. అయితే కొన్ని పాటలను ప్రేక్షకులు సైతం సొంతం చేసుకున్నారు. అంతే కాకుండా డీజే పాటలతో.. వినాయకచవితి స్పెషల్ పాటలతో కుర్రకారు సందడి చేస్తూ ఉంటారు. అయితే సినిమాల్లో మనల్ని బాగా అలంకరించిన కొన్నిసాంగ్స్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
1. వక్రతుండ మహాకాయ
ఏ ఇంట్లో అయినా.. ఏ మండపంలో అయినా.. వినాయకచవితి సమయంలో వక్రతుండ మహాకాయ పాట మోగాల్సిందే. ఈ పాటను తెలుగు ప్రేక్షకులు అంతగా ఓన్ చేసుకున్నారు. దేవుళ్లు సినిమాలోని ఈ పాటను బాలసుబ్రహ్మణ్యంగారు పాడారు. ఈ పాట గణేష్ గొప్పతనాన్ని వివరిస్తుంది. 'వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమ ప్రభ, నిర్విఘ్నం కురుమేదేవ సర్వకరేషు సర్వదా' అనే సాధారణ ప్రార్థనతో ప్రారంభమవుతుంది.
2. దండాలయ్య.. ఉండ్రాలయ్య
తెలుగులో ఈ ఫంకీ అండ్ క్యాచీ గణేశ పాట కూలీ నెం.1 చిత్రంలోనిది. ఈ పాటలో గణేష్ నిమజ్జనం సమయంలో వచ్చే పాట ఇది. వెంకటేష్, టబుని టీజ్ చేస్తూ సాగిన ఈపాట ప్రతి మండపంలో మార్మోమోగుతుంది. ‘దండాలయ్యా ఉండ్రాలయ్యా కరుణించయ్య దేవా, నీ అంద దండ ఉండలయ్యా చూపించయ్య దేవా’ అంటూ సాగే ఈ పాటను ది గ్రేట్ బాల సుబ్రహ్మణ్యంగారు పాడారు.
3. జై జై గణేశ.. జై కొడతా గణేశ
తెలుగులో బాగా హిట్ అయిన ఈ పాట జై చిరంజీవ సినిమాలోనిది. గణేష్ చతుర్థి రోజున ఈ పాట ప్రతి మండపంలో లూప్‌లో ఉంటుంది. 'జై జై గణేశా జై కొడ్త గణేశా జయములు ఇవ్వు బొజ్జ గణేశా' అని అంటూ సాగే ఈ పాటలో చిరంజీవి డాన్స్ చేయగా.. బాలసుబ్రహ్మణ్యం గారు తన గొంతు అందించారు.
4. గణపతి బప్పామోరియా
గణపతి బప్పామోరియా అంటూ సాగే ఈ పాట ఇద్దరమ్మాయిలతో సినిమాలోనిది. ఇది సాంప్రదాయ పాట కంటే ఆధునిక కాలపు పాటగా చెప్పవచ్చు. ఈ పాటను సూరజ్ జగన్ పాడారు. 'వక్రతుండ మహాకాయ గణపతి బప్పా మోరియా సూర్యకోటి సమ ప్రభ గణపతి బప్పా మోరియా' అంటూ ఈ పాట సాగుతుంది.
5. తిరు తిరు గణనాధ
ఈ పాట 100% లవ్ సినిమాలోనిది. ఎగ్జామ్స్‌కి ప్రిపేర్ అయ్యే ప్రతి విద్యార్థి పాడుకునే పాట ఇదని చెప్పవచ్చు. ఈ పాట సాంప్రదాయకమైన హాస్య కోణాన్ని కలిగి ఉంటుంది. ‘తిరు తిరు గణనాధ ది ది ది తై, ఆశీర్వదించు ఆ చదువులమ్మ తోడై’ అంటూ సాగిన ఈ పాటలో తమన్నా మెయిన్ రోల్లో కనిపిస్తుంది.
ఇలా చెప్పుకుంటూపోతే ఒకటా రెండా.. వినాయకుని మీద చాలా పాటలు తెలుగు చిత్రాల్లో వినిపిస్తున్నాయి. వినిపిస్తూనే ఉంటాయి.
సంబంధిత కథనం