Ganesh Chaturthi Wishes : మీ బంధుమిత్రులకు వినాయకచవితి శుభాకాంక్షలు ఇలా చెప్పండి-ganesh chaturthi 2022 wishes send quotes to sent in social media through your loved one ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  Lifestyle  /  Ganesh Chaturthi 2022 Wishes Send Quotes To Sent In Social Media Through Your Loved One

Ganesh Chaturthi Wishes : మీ బంధుమిత్రులకు వినాయకచవితి శుభాకాంక్షలు ఇలా చెప్పండి

Geddam Vijaya Madhuri HT Telugu
Aug 30, 2022 02:14 PM IST

Ganesh Chaturthi Wishes : పండుగ అంటే అందరూ కలిసి చేసి చేసుకునేది. మనకు దూరంగా ఉంటున్న కుటుంబ సభ్యులకు, మిత్రులకు, శ్రేయోభిలాషులకు పండుగ శుభాకాంక్షలు చెప్పాలని చూస్తాము. అయితే ఈ వినాయక చవితి సందర్భంగా మీ బంధుమిత్రులకు ఇలాంటి సందేశాలతో విష్ చేయండి.

వినాయక చవితి శుభాకాంక్షలు
వినాయక చవితి శుభాకాంక్షలు

Ganesh Chaturthi Wishes : మీరు, మీ ప్రియమైనవారు గణేష్ చతుర్థి లేదా వినాయక చవితిని దూరంగా ఉంటూ జరుపుకుంటున్నట్లయితే.. వారికి Facebook, WhatsApp, Instagram ద్వారా శుభాకాంక్షలు తెలపండి. అయితే మీరు విష్ చేయడానికి వీలుగా ఇక్కడ కొన్ని సందేశాలు ఉన్నాయి. వీటిలో మీకు నచ్చినవి.. మీ బంధుమిత్రులకు పంపేయండి.

గణేష్ చతుర్థి 2022 శుభాకాంక్షలు, సందేశాలు:

* కొత్త సూర్యోదయం, కొత్త ప్రారంభం, దివ్య గణేశుడి ఆశీస్సులతో మన రోజును ప్రారంభిద్దాం. గణేష్ చతుర్థి శుభాకాంక్షలు.

* మీకు, మీ కుటుంబ సభ్యులకు వినాయక చవితి శుభాకాంక్షలు.

* గణపతి బప్పా మోరియా. వినాయకుడు మీకు జ్ఞానం, తెలివి, శ్రేయస్సు, ఆనందం, విజయాన్ని అందిచాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను. మీకు గణేష్ చతుర్థి శుభాకాంక్షలు.

* మన హృదయాలలో వినాయకుడు ఉంటే.. జీవితంలో దేని గురించి చింతించాల్సిన పని లేదు. మీకు, మీ ప్రియమైన వారికి గణేష్ చతుర్థి శుభాకాంక్షలు.

* గణేశుడు మన జీవితాలను ప్రకాశవంతం చేస్తూ ఎల్లప్పుడూ ప్రేమ, విజయాన్ని అనుగ్రహించాలని కోరుకుంటున్నాను. మీకు వినాయక చవితి శుభాకాంక్షలు.

* మీకు మీ కుటుంబసభ్యులకు అందమైన, ఉల్లాసమైన వినాయక చతుర్థి శుభాకాంక్షలు. ఈ పండుగ సందర్భం మీకు మరెన్నో చిరునవ్వులు, వేడుకలను తీసుకురావాలని కోరుకుంటున్నాను.

* మీకు ఐశ్వర్యం, దీర్ఘాయుష్షు కలగాలని గణేశుడిని ప్రార్థిస్తున్నాను. గణేష్ చతుర్థి శుభాకాంక్షలు.

* మీకు వినాయక చతుర్థి శుభాకాంక్షలు. గణేశుడి అనుగ్రహం మీ జీవితాలను ప్రకాశవంతం చేస్తుంది.

* ఈ వినాయక చవితి మన దుఃఖాలన్నింటినీ పోగొట్టి.. మన సంతోషాన్ని పెంచి.. మనందరికీ ఆయన అనుగ్రహాన్ని ప్రసాదించాలని నేను గణేశుడిని ప్రార్థిస్తున్నాను. గణేష్ చతుర్థి శుభాకాంక్షలు.

* ఓం గన్ గణపతయే నమో నమః! శ్రీ సిద్ధివినాయక నమో నమః! అస్త వినాయక్ నమో నమః! గణపతి బప్పా మోరియా! గణేష్ చతుర్థి శుభాకాంక్షలు.

* విఘ్నహర్తుడైన గణేశుడు మన జీవితాల నుంచి అన్ని అడ్డంకులను, దుఃఖాలను తొలగించాలని కోరుకుంటూ.. గణేష్ చతుర్థి శుభాకాంక్షలు.

* గణేశుడి ఆశీస్సులు మీకు ఎల్లప్పుడు ఉండుగాక. వినాయక చతుర్థి శుభాకాంక్షలు.

WhatsApp channel

సంబంధిత కథనం