Facebook: ఫేస్‌బుక్ ఆదాయంలో తగ్గుదల.. చరిత్రలో ఇదే తొలిసారి-facebook parent meta posts first revenue decline in history ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Facebook: ఫేస్‌బుక్ ఆదాయంలో తగ్గుదల.. చరిత్రలో ఇదే తొలిసారి

Facebook: ఫేస్‌బుక్ ఆదాయంలో తగ్గుదల.. చరిత్రలో ఇదే తొలిసారి

HT Telugu Desk HT Telugu
Jul 28, 2022 10:50 AM IST

ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ మాతృ కంపెనీ మెటా తొలిసారిగా ఆదాయంలో తగ్గుదల నమోదు చేసింది.

ఫేస్ ‌బుక్, ఇన్‌స్టా మాతృ కంపెనీ మెటా లోగో
ఫేస్ ‌బుక్, ఇన్‌స్టా మాతృ కంపెనీ మెటా లోగో (REUTERS)

వాషింగ్టన్, జూలై 28: చరిత్రలో తొలిసారిగా ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ మాతృ సంస్థ మెటా ఆదాయం తగ్గింది. ఆర్థిక వ్యవస్థ క్షీణించడంతో ప్రకటనల ఆదాయం తగ్గడం, ప్రత్యర్థి టిక్‌టాక్ నుండి పోటీ తీవ్రతరం కావడంతో ఫేస్‌బుక్‌కు ఇబ్బంది తప్పలేదు.

డిజిటల్ అడ్వర్టైజింగ్ మార్కెట్‌లో విస్తృత క్షీణతను అనుసరిస్తూ ఫలితాలు వచ్చాయి. మెటా ప్రత్యర్థులైన గూగుల్, ట్విటర్, స్నాప్ ఆదాయం కూడా క్షీణించింది. గూగుల్ మాతృ సంస్థ ఆల్ఫాబెట్ త్రైమాసిక వృద్ధి మందగించింది.

సీఈఓ మార్క్ జుకర్‌బర్గ్ మాట్లాడుతూ మెటా తన పెట్టుబడుల వేగాన్నితగ్గిస్తోందని, ఉద్యోగుల వృద్ధిని క్రమంగా తగ్గించడానికి ప్రణాళికలు వేస్తున్నట్లు చెప్పారు.

ఆర్థిక మాంద్యం కాకుండా మెటా కొన్ని ప్రత్యేక సవాళ్లను ఎదుర్కొంటోంది. దాని చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్, కంపెనీ భారీ ప్రకటనల వ్యాపారం ముఖ్య రూపశిల్పి షెరిల్ శాండ్‌బర్గ్ నిష్క్రమణతో సహా పలు ఇతర సమస్యలు ఎదుర్కొంటోంది.

మెటా ఏప్రిల్-జూన్ కాలంలో 6.69 బిలియన్ డాలర్ల లాభం ఆర్జించింది. ఒక సంవత్సరం క్రితం ఇదే కాలంలో 10.39 బిలియన్ డాలర్లు ఆర్జించింది. ఆదాయం 28.82 బిలియన్ డాలర్లు మాత్రమే సమకూరింది. అంతకు ముందు సంవత్సరం 29.08 బిలియన్ డాలర్లుగా ఉంది.

‘త్రైమాసిక ఆదాయంలో తగ్గుదల మెటా వ్యాపారం ఎంత త్వరగా క్షీణించిందో సూచిస్తోంది..’ అని ఇన్‌సైడర్ ఇంటెలిజెన్స్ విశ్లేషకుడు డెబ్రా అహో విలియమ్సన్ ఒక ఈమెయిల్‌లో తెలిపారు.

మెటా ప్లాట్‌ఫామ్స్ ఐఎన్‌సీ షేర్లు 4.1% పడిపోయాయి. ఈ ఏడాది ప్రారంభం నుంచి మెటా షేరు సగానికి పైగా విలువను కోల్పోయింది.

IPL_Entry_Point

టాపిక్