Flirting Day 2023 : యాంటీ వాలెంటైన్స్ వీక్.. ఫ్లర్టింగ్ డే ఇలా చేసుకోండి
Anti Valentine's Week : యాంటీ వాలెంటైన్స్ వీక్ నడుస్తోంది. ఫిబ్రవరి 17న పర్ఫ్యూమ్ డే తర్వాత.. ఫిబ్రవరి 18న ఫ్లర్టింగ్ డేగా జరుపుకొంటారు.
వాలెంటైన్స్ డే(Valentines Day) తర్వాత.. యాంటీ వాలెంటైన్ వీక్. నాలుగో రోజు ఫిబ్రవరి 18న ఫ్లర్టింగ్ డే జరుపుతారు. యాంటీ-వాలెంటైన్స్ వీక్ వారం రోజులు జరుపుకొంటారు. ఒకవేళ మీకు ఎవరి మీద అయినా.. క్రష్ ఉన్నట్టు అయితే.. ఫ్లర్టింగ్ డే రోజున మాట్లాడి.. మీ లక్ పరీక్షించుకోండి. వారితో మంచి సమయం గడిపేందుకు ట్రై చేయండి. ఇది మీ అవకాశం.. కాబట్టి.. సరికొత్త అనుభవాన్ని పొందేందుకు ప్రయత్నం చేయండి.
ఫ్లర్టింగ్(Flirting) అనే పదం ఫ్రెంచ్ పదం 'ఫ్లూరెట్' నుండి ఉద్భవించింది. దీని అర్థం పూల రేకులను వదలడం ద్వారా ఒకరిని మోహింపజేయడం. ఇది మొదట 16వ శతాబ్దపు పద్యాలలో ఉపయోగించబడింది. ఫ్లర్టింగ్ ద్వారా.. ప్రేమ తలుపులు తెరుచుకునే అవకాశం ఉంది. హృదయంలోకి కొత్త అనుభవాలకు తెరవడానికి అనుమతిస్తుంది. ఇది ప్రేమను కనుగొనే ఆశను కలిగిస్తుంది.
మీకు ఎవరిపైనైనా ప్రేమ ఉంటే, వారికి తెలియజేయడానికి ఫ్లర్టింగ్ డే(Flirting Day) ఉత్తమ సమయం. మీరు చెప్పిన వ్యక్తితో మీ సంబంధానికి ఆటంకం కలిగించకూడదనుకుంటే సైలెంట్ గా ఉండండి. చెప్పాం కదా అని.. అతిగా చేయవద్దు. అది మంచిది కాదు.
ఇలా జరిపేసుకోండి..
మీ స్నేహితులందరినీ, మీ 'స్పెషల్ పర్సన్'ని పార్టీకి ఆహ్వానించండి. మీ క్రష్ కోసం సమయాన్ని వెచ్చించే అవకాశాన్ని ఉపయోగించుకోండి. మీకు వారి మీద ఇంట్రస్ట్ ఉన్నట్టుగా చేయాలి. మీకు చాలా భయంగా అనిపిస్తే, మీ స్నేహితుల్లో ఒకరి నుండి సలహా తీసుకోండి.
మీరు ఒంటరిగా ఉండి.. ఫ్లర్టింగ్ డే(Flirting Day) జరుపుకోవాలనుకుంటే.. డేటింగ్ యాప్స్ ను ఉపయోగించుకోండి. డేటింగ్ యాప్(Dating App)లో సైన్ అప్ అవ్వండి. ఫ్లర్టింగ్ డే.. ఆన్‌లైన్‌లో జరుపుకోవచ్చు. ఎవరికి తెలుసు, బహుశా మీ ప్రేమ కథకు ఆన్ లైన్ దారి చూపిస్తుందేమో..!
ఈ రోజును జంటలు జరుపుకోకూడదనే నియమాలు ఏమీ లేవు. మీ భాగస్వామి/భార్య కోసం సమయాన్ని వెచ్చించండి. మీ ప్రియమైన వ్యక్తిని ప్రత్యేకంగా భావించేలా చేయండి. మీ క్రష్‌పై అదనపు శ్రద్ధ చూపించి.. మంచి డ్రెస్ వేసుకుని ఇంప్రెస్ చేయండి. కేఫ్ లేదా క్లబ్ లో మీరు ఉంటే.. కలిసి డ్యాన్స్ చేయమని వారిని అడగండి.
మీరు 'ఐ లవ్ యు' సందేశాన్ని పంపాల్సిన అవసరం లేదు. కానీ ఖచ్చితంగా ధైర్యాన్ని కూడగట్టుకుని, వారి గురించి మీకు నచ్చిన విషయాన్ని టెక్స్ట్ రూపంలో పంపించొచ్చు.
సంబంధిత కథనం