Bill Gates Date with Paula Hurd: ఒరాకిల్ సీఈఓతో బిల్ గేట్స్ డేటింగ్.. సోషల్ మీడియాలో వార్త వైరల్-microsoft co founder bill gates is dating with paula hurd
Telugu News  /  Entertainment  /  Microsoft Co Founder Bill Gates Is Dating With Paula Hurd
పౌలా హర్డ్‌తో బిల్ గేట్స్
పౌలా హర్డ్‌తో బిల్ గేట్స్ (Twitter)

Bill Gates Date with Paula Hurd: ఒరాకిల్ సీఈఓతో బిల్ గేట్స్ డేటింగ్.. సోషల్ మీడియాలో వార్త వైరల్

09 February 2023, 18:40 ISTMaragani Govardhan
09 February 2023, 18:40 IST

Bill Gates Date with Paula Hurd: మైక్రోసాఫ్ట్ అధినేత బిల్ గేట్స్.. ఒరాకిల్ సీఈఓ పౌలా హర్డ్‌తో డేటింగ్‌లో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. వీరిద్దరూ కలిసి పలు ఈవెంట్లకు హాజరవుతుండటంతో ఈ వార్తలకు మరింత బలం చేకూరింది.

Bill Gates Date with Paula Hurd: ప్రపంచ అపర కుబేరుల్లో ఒకరైన బిల్ గేట్స్ రెండేళ్ల క్రితం తన భార్య మెలిందా గేట్స్‌తో విడిపోయిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి సింగిల్‌గా ఉంటున్న మైక్రోసాఫ్ట్ అధినేత.. ఇటీవల కాలంలో రిలేషన్‌షిప్‌లో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. ప్రముఖ ఐటీ సంస్థ ఓరాకిల్ సీఈఓ పౌలా హర్డ్‌తో ఆయన ప్రేమలో ఉన్నట్లు పలు ఊహాగానాలు విస్తృతమవుతున్నాయి. పలు అంతర్జాతీయ వెబ్ సైట్ల సైతం వీరి ప్రేమ వ్యవహారం గురించి వార్తలు ప్రచురించాయి. మీడియా కథనాల ప్రకారం గత కొంతకాలంగా వీరిద్దరూ డేటింగ్‌లో ఉన్నట్లు సమాచారం.

ఇటీవల కాలంలో పబ్లిక్‌గా, సోషల్ మీడియా వేదికగా బిల్ గేట్స్.. పౌలాతో డేటింగ్‌లో ఉన్నారంటూ వస్తున్న ఊహాగానాలపై విపరీతంగా బజ్ ఏర్పడింది. ప్రజలు చాలా ఆసక్తికరంగా వీటిని చూస్తున్నారు. 2021 తన భార్య మెలిందాతో బిల్ గేట్స్ విడిపోయినప్పటి నుంచి ఆయన పలువురు మహిళలతో రిలేషన్‌లో ఉన్నారంటూ వార్తలు వచ్చాయి. కానీ అవేవి వాస్తవం కాదని తర్వాత తేలిపోయింది. కానీ పౌలా హర్డ్‌తో మాత్రం అతడి డేటింగ్ వ్యవహారం చర్చనీయాంశంగా మారింది. వీరిద్దరూ కలిసి పలు వేడుకలకు హాజరు కావడం, సన్నిహతంగా ఉండటంతో ఆ ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

పౌరా హర్డ్ విషయానికొస్తే ప్రముఖ సాఫ్ట్ వేర్ కంపెనీ ఓరాకిల్‌కు సీఈఓగా పనిచేస్తున్నారు. మార్క్ హర్డ్‌ను వివాహం చేసుకున్న పౌలా ఆయన 2019లో చనిపోయేంత వరకు 30 ఏళ్ల పాటు కలిసి జీవనం సాగించింది. మార్క్ మరణం తర్వాత బిల్ గేట్స్‌కు దగ్గరైనట్లు తెలుస్తోంది. వీరిద్దరూ పలు ఈవెంట్లకు హాజరుకావడంతో టెక్ పరిశ్రమలో హాట్ టాపిక్‌గా నిలిచారు.

పౌలా హర్డ్‌తో బిల్ గేట్స్ రిలేషన్‌షిప్ గురించి మిశ్రమ స్పందనలు వ్యక్తమవుతున్నాయి. కొంతమంది వీరి జోడీకి మద్దతుగా మాట్లాడుతుండగా.. మరికొంతమంది మాత్ర వ్యతిరేకిస్తున్నారు. వీరి సంబంధాన్ని ప్రశ్నిస్తున్నారు. అయితే చాలా వరకు సానుకూలంగా స్పందిస్తున్నారు. అయితే వీరిద్దరూ చాలా సంతోషంగా ఉన్నారని, వారి సమయాన్ని ఆస్వాదిస్తున్నారని సన్నిహిత వర్గాలు పేర్కొన్నాయి.

అయితే చాలామందిని బిల్ గేట్స్-పౌలా హర్డ్ రిలేషన్‌షిప్ ఆశ్చర్యాన్ని కలిగించింది. అయితే వీరి బంధంలో మాత్రం పూర్తి సంతోషంగా ఉన్నట్లు తెలుస్తోంది. పబ్లిక్ ఇంట్రెస్ట్ ఎలా ఉన్నప్పటికీ తమ బంధం గురించి ప్రస్తుతానికి ఇద్దరూ గోప్యంగా ఉంచాలనుకుంటున్నారు. మరి భవిష్యుత్తులో వీరి బంధం ఎటు వైపు వెళ్తుందో వేచి చూడాలి.

సంబంధిత కథనం

టాపిక్