Hisense U7H QLED TVs । కళ్లు చెదిరే ఫీచర్లతో రెండు స్మార్ట్ టీవీలను లాంచ్ చేసిన హైసెన్స్!-fifa 2022 world cup sponsor hisense launches u7h qled tv series in india ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Hisense U7h Qled Tvs । కళ్లు చెదిరే ఫీచర్లతో రెండు స్మార్ట్ టీవీలను లాంచ్ చేసిన హైసెన్స్!

Hisense U7H QLED TVs । కళ్లు చెదిరే ఫీచర్లతో రెండు స్మార్ట్ టీవీలను లాంచ్ చేసిన హైసెన్స్!

HT Telugu Desk HT Telugu
Sep 28, 2022 03:33 PM IST

Hisense అనే కంపెనీ ప్రీమియం ఫీచర్లతో భారతీయ మార్కెట్లో 2 సరికొత్త స్మార్ట్ టీవీ (Hisense U7H TV & Hisense A7H Tornado 2.0 TV) లను విడుదల చేసింది. ధరలు, ఫీచర్లు ఎలా ఉన్నాయో చూడండి.

Hisense U7H QLED TV Series and Hisense A7H Tornado 2.0 TV
Hisense U7H QLED TV Series and Hisense A7H Tornado 2.0 TV

చైనాకు చెందిన కన్స్యూమర్ ఎలక్ట్రానిక్స్ బ్రాండ్ హైసెన్స్ (Hisense), భారతీయ మార్కెట్లో 2 సరికొత్త స్మార్ట్ టీవీలను విడుదల చేసింది. ఇందులో మొదటి మోడల్ Hisense U7H TV సిరీస్ కాగా, రెండోది Hisense A7H టోర్నాడో 2.0 TV. రెండో మోడల్ కంటే మొదటి మోడల్ టీవీలు ప్రీమియం ఫీచర్లతో వచ్చాయి, కాబట్టి కాస్త ఖరీదైనవి.

Hisense U7H TV సిరీస్ లో స్క్రీన్ సైజ్ ఆధారంగా రెండు వేరియంట్లు ఉన్నాయి. బేస్ వేరియంట్ Hisense U7H సిరీస్ TV 55-అంగుళాలతో రాగా, టాప్ స్పెక్ వేరియంట్ Hisense U7H సిరీస్ TV 65-అంగుళాలతో వచ్చింది. ప్రారంభోత్సవ ఆఫర్ కింద ఈ టీవీల కొనుగోళ్లపై Amazon Fire TV Stick 4Kతో అందిస్తున్నారు.

ఈ Hisense U7H సిరీస్ స్మార్ట్ టీవీలు గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ సందర్భంగా అమెజాన్ ద్వారా కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉంటాయి.

మరొక మోడల్ అయినటువంటి Hisense A7H Tornado 2.0 TV ఏకైక వేరియంట్లో 55- అంగుళాల స్క్రీన్ పరిమాణంతో లభిస్తుంది. ఇది అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ రెండింటిలోనూ అందుబాటులో ఉంటుంది. సరికొత్త Hisense స్మార్ట్ టీవీలు 3 సంవత్సరాల వారంటీతో వస్తున్నాయి.

ఈ స్మార్ట్ టీవీలలోని ఫీచర్లు ఎలా ఉన్నాయి, ధర ఎంత, ఆఫర్లకు సంబంధించిన వివరాలను ఇక్కడ తెలుసుకోండి.

Hisense U7H Series QLED TVs ఫీచర్లు, స్పెసిఫికేషన్లు

  • 4K వీడియో క్వాలిటీ అందించే 55/65- అంగుళాల QLED డిస్‌ప్లే
  • 120Hz రిఫ్రెష్ రేట్, 178-డిగ్రీల వైడ్ వ్యూయింగ్ యాంగిల్‌
  • 20W స్పీకర్లు - డాల్బీ అట్మాస్, సరౌండ్ సౌండ్
  • Google TV OS
  • ఆటో లేటెన్సీ మోడ్ (ALLM), వేరియబుల్ రిఫ్రెష్ రేట్ (VRR)
  • అమెజాన్ అలెక్సా, Google అసిస్టెంట్- టీవీ రిమోట్

ఇంకా Wi-Fi, బ్లూటూత్ v5.0, రెండు USB పోర్ట్‌లు, 3.5mm జాక్ , గేమింగ్ కన్సోల్‌ల కోసం e-ARC మద్దతుతో HDMI 2.1 పోర్ట్ ఉన్నాయి.

Hisense U7H Series QLED TVs ధరలు

55-అంగుళాల టీవీ మోడల్ ధర రూ. 51,990/-

65-అంగుళాల టీవీ మోడల్ ధర రూ. 71,990/-

Hisense A7H Tornado 2.0 TV ఫీచర్లు, స్పెసిఫికేషన్లు

  • 4K వీడియో క్వాలిటీ అందించే 55 అంగుళాల LED డిస్‌ప్లే
  • 175-డిగ్రీల వైడ్ వ్యూయింగ్ యాంగిల్‌
  • డాల్బీ విజన్, డాల్బీ అట్మోస్‌ సపోర్ట్
  • 102W సౌండ్ అవుట్‌పుట్‌ను కలిగిన 6-స్పీకర్ JBL సిస్టమ్‌
  • Google TV OS
  • ఆటో లేటెన్సీ మోడ్ (ALLM), వేరియబుల్ రిఫ్రెష్ రేట్ (VRR)
  • Google అసిస్టెంట్- టీవీ రిమోట్

కనెక్టివిటీ కోసం HDMI, 3.5mm పోర్ట్, బ్లూటూత్ v5.0, రెండు USB పోర్ట్‌లు, Wi-Fi ఉన్నాయి.

ధర రూ. 42,990/-

అంతేకాదు ఈ టీవీలను కొనుగోలు చేసిన లక్కీ విన్నర్లకు ఖతార్‌లో జరిగే FIFA 2022 ప్రపంచ కప్‌ను ప్రత్యక్షంగా వీక్షించే అవకాశం Hisense కంపెనీ కల్పిస్తోంది.

WhatsApp channel

సంబంధిత కథనం

టాపిక్