Samsung 32-inch HD TV । అతితక్కువ ధరకే శాంసంగ్ స్మార్ట్ టీవీ, పండగ ఆఫర్లు కూడా..-at affordable price samsung 32 inch hd tv launched check flipkart cashback offers ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  Lifestyle  /  At Affordable Price Samsung 32-inch Hd Tv Launched, Check Flipkart Cashback Offers

Samsung 32-inch HD TV । అతితక్కువ ధరకే శాంసంగ్ స్మార్ట్ టీవీ, పండగ ఆఫర్లు కూడా..

HT Telugu Desk HT Telugu
Sep 25, 2022 10:59 AM IST

శాంసంగ్ కంపెనీ అతి తక్కువ ధరలోనే Samsung 32-inch HD TV అనే సరికొత్త స్మార్ట్ టీవీని భారత మార్కెట్లో లాంచ్ చేసింది. నెలకు కేవలం రూ. 1499 EMI చెల్లించి కూడా ఈ టీవీని సొంతం చేసుకోవచ్చు. పండగ ఆఫర్లు కూడా ఉన్నాయి.

Samsung 32-inch HD TV
Samsung 32-inch HD TV

దక్షిణ కొరియాకు చెందిన ప్రముఖ ఎలక్ట్రానిక్ కంపెనీ శాంసంగ్ తమ స్మార్ట్ టీవీ లైనప్‌ను భారత మార్కెట్లో మరింత విస్తరించింది. తాజాగా ఒక బడ్జెట్ టీవీని విడుదల చేసింది. ఈ పండగ సీజన్‌లో తక్కువ ధరకే స్మార్ట్ టీవీని కొనుగోలు చేయాలనుకునే వారికోసం శాంసంగ్ స్మార్ట్ టీవీ రూ. 15 వేల లోపే అందుబాటులో ఉంటుంది. అలాగే ఆకర్షణీయమైన ఎర్లీ బర్డ్ క్యాష్‌బ్యాక్ ఆఫర్‌లు కూడా అందిస్తోంది.

శాంసంగ్ ఏకైక వేరియంట్లో కొత్త టీవీని విడుదల చేసింది. స్క్రీన్ సైజ్ 32-అంగుళాలతో వచ్చిన సరికొత్త Samsung HD టీవీ త్రీ-సైడ్ బెజెల్-లెస్ డిస్‌ప్లేతో పాటు అనేక స్మార్ట్ ఫీచర్లను కలిగి ఉంది. ఈ టీవీలో హై డైనమిక్ రేంజ్, PurColor టెక్నాలజీ అందించారు. దీనివల్ల వెలుతురు ఉన్నప్పుడు, అలాగే చీకట్లోనూ సరైన దృశ్యాన్ని చూడవచ్చు. అలాగే ఇందులోని దీని అల్ట్రా క్లీన్ వ్యూ టెక్నాలజీ ఒరిజినల్ కంటెంట్‌ను విశ్లేషిస్తుంది, నాణ్యమైన చిత్రాలను ప్రసరింపజేస్తుంది. ఇంకా కాంట్రాస్ట్ ఎన్‌హాన్సర్ అనే ఫీచర్ చిత్రాలను మెరుగైన డెప్త్‌తో చూపిస్తూ వీక్షకులు దృశ్యానికి లీనమయ్యే అనుభవాన్ని అందిస్తుంది.

Samsung 32-inch HD TV కేవలం దృశ్య పరంగానే కాదు, శ్రవణపరంగానూ మెరుగైన ఆడియో స్పెక్స్ కలిగి ఉంది. ఈ టీవీ డాల్బీ డిజిటల్ ప్లస్‌ టెక్నాలజీని కలిగి 3డి సరౌండ్ సౌండ్ ఎఫెక్ట్‌ను అందిస్తుంది.

TVలోని కొన్ని ఫంక్షనల్ ఫీచర్లు PC మోడ్, గేమ్ మోడ్, స్క్రీన్ మిర్రరింగ్ సహా వీక్షకులు తమ ప్రాధాన్యత ప్రకారం ఏమి చూడాలనుకుంటున్నారో త్వరగా నిర్ణయించడంలో సహాయపడే యూనివర్సల్ గైడ్ కూడా ఉంది. అదనంగా ఎలాంటి ఫీచర్లు ఉన్నాయి, ధర ఎంత మొదలగు వివరాలు ఇప్పుడు చూద్దాం.

Samsung 32-inch HD TVలోని ఫీచర్లు, స్పెసిఫికేషన్లు

  • 32-అంగుళాల బెజెల్-లెస్ HD డిస్‌ప్లే
  • ALLM లేదా ఆటో లో- లేటెన్సీ మోడ్
  • Samsung TV Plus- Tizen OS
  • డాల్బీ డిజిటల్ ప్లస్, 3డి సరౌండ్ సౌండ్
  • 20W స్పీకర్ సిస్టమ్
  • 2 HDMI పోర్ట్‌లు, 1 USB పోర్ట్
  • ధర, రూ. 12,499/-

Samsung 32-inch HD TV శామ్‌సంగ్ అధికారిక ఆన్‌లైన్ స్టోర్, Samsung షాప్ అలాగే ఫ్లిప్‌కార్ట్‌లో కొనుగోలుదారులకు అందుబాటులో ఉంటుంది. బ్యాంక్ క్యాష్‌బ్యాక్ ఆఫర్‌లతో పాటు రూ. 1,499 మొదలయ్యే నో-కాస్ట్ EMI ఆఫర్లు కూడా ఉన్నాయి.

WhatsApp channel