Egg Pakoda: చికెన్ పకోడీలాగే ఓసారి ఎగ్ పకోడి చేయండి, స్నాక్స్ గా అదిరిపోతుంది
Egg Pakoda Recipe: కోడిగుడ్డుతో చేసే వంటకాలు చాలా టేస్టీగా ఉంటాయి. గుడ్డుతో చేసే స్నాక్స్ పిల్లలకు నచ్చుతాయి. ఓసారి ఎగ్ పకోడా చేసి చూడండి. దీని రెసిపీ చాలా సులువు.
Egg pakoda Recipe: గుడ్డుతో చేసే ఎగ్ పకోడా చేయడానికి కనీసం 40 నిమిషాలు పడుతుంది. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. ఒక్కసారి వండుకుంటే మళ్లీ మళ్లీ మీకే తినాలనిపిస్తుంది. దీన్ని చేయడానికి పెద్దగా కష్టపడక్కర్లేదు. గుడ్డులోని తెల్లసొనతో మాత్రమే ఎగ్ పకోడా వండుతారు. దీని రెసిపీ ఎలాగో తెలుసుకోండి.
ఎగ్ పకోడా రెసిపీకి కావాల్సిన పదార్థాలు
కోడిగుడ్లు - అయిదు
కారం - అర స్పూను
అల్లం తరుగు - అర స్పూను
వెల్లుల్లి తరుగు - ఒక స్పూను
బ్రెడ్ ముక్కలు - రెండు
గరం మసాలా పొడి - పావు స్పూను
గుడ్డులోని తెల్లసొన - ఒక స్పూను
కరివేపాకులు - గుప్పెడు
రెడ్ చిల్లీసాస్ - ఒక స్పూను
కరివేపాకులు - గుప్పెడు
ఉప్పు - రుచికి సరిపడా
కార్న్ ఫ్లోర్ - పావు కప్పు
ఎగ్ పకోడా రెసిపీ
1. కోడిగుడ్లను ఉడకబెట్టి పొట్టు తీయాలి. పచ్చసొనను పక్కన పెట్టి తెల్లసొనను మాత్రమే తీసుకోవాలి.
2. తెల్ల సొనను ముక్కలుగా కోసుకుని ఒక గిన్నెలో వేయాలి.
3. ఆ గిన్నెలో వెల్లుల్లి తరుగు, అల్లం తరుగు, గరం మసాలా పొడి, కారం, కార్న్ ఫ్లోర్, ఉప్పు, గుడ్డులోని తెల్లసొన వేసి బాగా కలపాలి.
4. బ్రెడ్ ముక్కలు మిక్సీలో వేసి పొడిలా చేసుకోవాలి. ఆ పొడిని గుడ్ల మిశ్రమంలో వేసి బాగా కలపాలి.
5. స్టవ్ మీద కళాయి పెట్టి నూనె వేయాలి. నూనె వేడెక్కాక ఈ గుడ్డు మిశ్రమాన్ని పకోడీల్లా వేసుకోవాలి.
6. గుడ్డు పకోడీలను తీసి ఒక ప్లేటులో వేసుకోవాలి.
7. ఇప్పుడ మరొక కళాయి పెట్టి రెండు స్పూన్ల నూనె వేయాలి.
8. ఆ నూనె వేడెక్కాక అల్లం, వెల్లుల్లి తరుగు, కరివేపాకులు, పచ్చి మిర్చి వేసి వేయించాలి.
9. ఇందులో రెడ్ చిల్లీ సాస్ వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమంలో గుడ్డు పకోడీలను కూడా వేసి టాస్ చేయాలి.
10. ఈ మిశ్రమంలో కొత్తిమీర తరుగను చల్లుకోవాలి. అంతే ఎగ్ పకోడా రెడీ అయినట్టే. ఇవి చాలా రుచిగా ఉంటాయి.
కోడిగుడ్డుతో చేసిన వంటకాలు రుచిగా ఉంటాయి. వీటిని తినడం వల్ల మన శరీరానికి ఎన్నో పోషకాలు అందుతాయి. కోడిగుడ్డులో విటమిన్ ఎ, పొటాషియం, ఐరన్, విటమిన్ బి12, మెగ్నీషియం, విటమిన్ బి6 ఉంటాయి. ఇవి మన ఆరోగ్యానికి అత్యవసరమైనవి. మెదడు ఆరోగ్యానికి కోడిగుడ్డు మంచిది. గర్భిణులకు, పిల్లలకు, బాలింతలకు కోడిగుడ్డును రోజూ తినిపించాలి. మహిళలు గుడ్లు తినడం వల్ల రొమ్ము క్యాన్సర్ వచ్చే అవకాశం తగ్గుతుంది. గుడ్డును ప్రతిరోజూ తినడం వల్ల విటమిన్ ఎ అధికంగా అందుతుంది. ఇది కళ్లను ఆరోగ్యంగా ఉంచుతుంది.
టాపిక్