Vankaya Pakodi: వంకాయ పకోడీ రెసిపీ ఇదిగో, దీన్ని చేయడం చాలా సులువు-vankaya pakodi recipe in telugu know how to make this snacks ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Vankaya Pakodi: వంకాయ పకోడీ రెసిపీ ఇదిగో, దీన్ని చేయడం చాలా సులువు

Vankaya Pakodi: వంకాయ పకోడీ రెసిపీ ఇదిగో, దీన్ని చేయడం చాలా సులువు

Haritha Chappa HT Telugu
Mar 27, 2024 03:30 PM IST

Vankaya Pakodi: ఎప్పుడూ ఒకేలా పకోడీ చేసుకునే బదులు ఓసారి కొత్తగా వంకాయ పకోడీ ట్రై చేయండి. వంకాయ కూరను తినని వారు వంకాయలను పకోడీల రూపంలో తినవచ్చు. దీని రెసిపీ ఎలాగో తెలుసుకోండి.

వంకాయ పకోడి రెసిపీ
వంకాయ పకోడి రెసిపీ

Vankaya Pakodi: వంకాయలు చాలా తక్కువ మందికి నచ్చుతాయి. నిజానికి వంకాయ వల్ల మన ఆరోగ్యానికి అవసరమైన పోషకాలు ఎన్నో ఉన్నాయి. అయినా కూడా వంకాయ కూరను చూసి మూతి ముడుచుకునే వారు ఎంతోమంది. వంకాయ కూర నచనివారు ఓసారి వంకాయ పకోడీని తిని చూడండి. ఎప్పుడూ ఒకేలాంటి పకోడీ తినడం వల్ల మూసాగా అనిపిస్తుంది. ఇలా వంకాయ పకోడీ చేసుకుంటే కొత్తగా ఉంటుంది. పైగా వంకాయని తిన్నట్టు ఉంటుంది.

వంకాయ పకోడీ రెసిపీకి కావాల్సిన పదార్థాలు

వంకాయలు - ఐదు

శెనగపిండి - రెండు కప్పులు

ధనియాల పొడి - అర స్పూను

కారం - అర స్పూను

పసుపు - పావు స్పూను

ఉప్పు - రుచికి సరిపడా

నూనె - డీప్ ఫ్రై చేయడానికి సరిపడా

వంటసోడా - చిటికెడు

వంకాయ పకోడి రెసిపీ

1. వంకాయ పకోడీలను చేయాలంటే ముందుగా వంకాయలను నిలువుగా, సన్నగా కోసుకొని పక్కన పెట్టుకోవాలి.

2. ఇప్పుడు వాటిని నీటిలో వేసి ఉంచాలి.

3. ఒక గిన్నెలో శెనగపిండిని వేసి అందులో పసుపు, కారం, గరం మసాలా, జీలకర్ర, ధనియాలపొడి, రుచికి సరిపడా ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి.

4. ఇప్పుడు వంకాయలను తీసి మిశ్రమంలో వేయాలి.

5. సరిపడా నీటిని వేసి దీన్ని పకోడీ పిండిలా కలుపుకోవాలి.

6. ఇప్పుడు స్టవ్ మీద కళాయి పెట్టి డీప్ ఫ్రై చేయడానికి సరిపడా నూనెను వేయాలి.

7. నూనె బాగా వేడి అయ్యాక వంకాయలు కలిపిన శెనగపిండిని పకోడీల్లా నూనెలో వేసుకోవాలి.

8. పకోడీలు బంగారు రంగు వచ్చేవరకు వేయించి తర్వాత తీసి ప్లేట్లో పెట్టుకోవాలి. ఇవి చాలా టేస్టీగా ఉంటాయి. ఒక్కసారి తిన్నారంటే మళ్ళీ మళ్ళీ మీరు కచ్చితంగా తింటారు.

వంకాయను కొంతమంది చాలా చులకనగా చూస్తారు. కానీ వంకాయ తినడం చాలా ముఖ్యం. వారానికి కనీసం రెండు నుంచి మూడుసార్లు వంకాయలు తినడం వల్ల మన శరీరానికి అవసరమైన ఎన్నో పోషకాలు లభిస్తాయి. అలాగే కొన్ని రకాల వ్యాధులనుండి రక్షణ కల్పిస్తుంది. వంకాయలో పైల్స్, హేమ రాయిడ్స్ తగ్గించే లక్షణం ఉంది. అలాగే కీళ్ల నొప్పులతో బాధపడుతున్న వారు వంకాయను తరచూ తినాలి. శరీరం నుంచి దుర్వాసన వస్తున్న వారు కూడా వంకాయతో చేసిన ఆహారాలను తినడం వల్ల ఆ సమస్య నుంచి బయటపడవచ్చు. దీనిలో ఫైబర్ అధికంగా ఉంటుంది. వంకాయలను అధికంగా తినడం వల్ల పెద్ద పేగులో విషాలు, రసాయనాలు పేరుకుపోకుండా ఇది నివారిస్తుంది. అలాగే పెద్ద పేగును క్యాన్సర్ బారిన పడకుండా కాపాడుతుంది.

వంకాయను ఆహారం రూపంలో తీసుకుంటే పీచుపదార్థాలు శరీరానికి అందుతాయి. అలాగే బి విటమిన్లు, విటమిన్ సి, విటమిన్ కె, విటమిన్ ఈ కూడా వంకాయలో ఉంటాయి. వీటితో పాటు పొటాషియం, మాంగనీస్, ఫాస్ఫరస్, క్యాల్షియం, మెగ్నీషియం, ఐరన్ వంటి ఖనిజాలు కూడా అధికంగానే వంకాయలో లభిస్తాయి. వంకాయలు తినడం వల్ల శరీరానికి అందే కేలరీలు తక్కువ. కాబట్టి బరువు పెరుగుతారన్న సమస్య లేదు. దీనిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు శరీరానికి రక్షణను కల్పిస్తాయి.

వంకాయలు తినడం వల్ల రోగనిరోధక శక్తిని పెంచుకోవచ్చు. స్థూలకాయం, గుండె జబ్బులు, హై బీపీ వంటి వాటి బారిన పడకుండా వంకాయ కాపాడుతుంది. డయాబెటిస్ పేషెంట్లు కచ్చితంగా తినాల్సిన ఆహారాలలో వంకాయ ఒకటి. ఎందుకంటే దీని గ్లైసెమిక్ ఇండెక్స్ చాలా తక్కువ. మీరు ఎంత తిన్నా రక్తంలో చక్కెర స్థాయిలు పెరగవు. అలాగే వంకాయల్లో నీరు అధికంగా ఉంటుంది. పోషకాలు సమృద్ధిగా ఉంటాయి. అధిక రక్తపోటుతో బాధపడుతున్న వారు రెండు రోజులకు ఒకసారి వంకాయను ఆహారంలో భాగం చేసుకోండి. బీపీ పెరగకుండా ఉంటుంది. ఇది రక్తంలో చెడు కొలెస్ట్రాల్ పేరుకుపోకుండా కూడా అడ్డుకుంటుంది.

టాపిక్