Eating An Egg Before Bed । నిద్రపోయే ముందు ఒక గుడ్డు తినండి, ఎందుకో తెలుసుకోండి!
Eating An Egg Before Bed: సాయంత్రం వేళ, రాత్రి భోజనంలో లేదా నిద్రపోయే ముందు కూడా గుడ్డు తినడం మీ ఆరోగ్యానికి మేలు చేస్తుందని నిపుణులు అంటున్నారు.
Eating an egg before bed: సండే అయినా, మండే అయినా రోజూ గుడ్డు తినాలని చెబుతారు. గుడ్లు తినడం వల్ల చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ముఖ్యంగా గుడ్లు ఉడకబెటుకొని తినడం చాలా మంచిది. గుడ్డులో కండరాలను బలపరిచే ప్రోటీన్లు ఉంటాయి, దీనిలోని ఒమేగా -3 మెదడుకు అనేక విధాలుగా మేలు చేస్తుంది. అయితే రోజూ గుడ్డు తినడమే కాదు, సరైన సమయంలో తినడం కూడా ముఖ్యమేనంటున్నారు. చాలా మంది గుడ్డును అల్పాహారంలో తినడానికి ఇష్టపడతారు, రాత్రికి తింటే అరగదు అని భావిస్తారు. అయితే, సాయంత్రం వేళ, రాత్రి భోజనంలో లేదా నిద్రపోయే ముందు కూడా గుడ్డు తినడం మీ ఆరోగ్యానికి మేలు చేస్తుందని నిపుణులు అంటున్నారు. సాయంత్రం స్నాక్స్ లాగా లేదా డిన్నర్ తర్వాత ఒక గుడ్డు తింటే కొన్ని ప్రయోజనాలు ఉంటాయంటున్నారు, అవేమిటో ఇక్కడ తెలుసుకోండి.
ఒత్తిడిని తగ్గిస్తుంది
సాయంత్రం పూట గుడ్లు తినడం వల్ల కలిగే అతిపెద్ద ప్రయోజనం ఏమిటంటే, ఇది ఒత్తిడిని తగ్గించడంలో సహాయపడుతుంది. గుడ్డులో ట్రిప్టోఫాన్ పుష్కలంగా ఉంటుంది, ఈ ట్రిప్టోఫాన్ మీ మనస్సును శాంతపరుస్తుంది, శరీరంలోని హార్మోన్ల ఆటంకాలను తగ్గిస్తుంది. ఈ కారణంగా, రోజంతా అలసిపోయినపుడు మీరు సాయంత్రం ఒక గుడ్డు తినాలి.
నిద్రను మెరుగుపరుస్తుంది
నిద్రను మెరుగుపరచడంలో మెలటోనిన్ ప్రధాన పాత్ర పోషిస్తుంది. ఇది మీ నరాల పనితీరును మెరుగుపరచడంలో సహాయపడుతుంది, శరీరాన్ని నిద్రపోయేలా సూచిస్తుంది. మెలటోనిన్ అనేది శరీర గడియారాన్ని సెట్ చేసే హార్మోన్ , నిద్ర లేమిలో పెద్ద పాత్ర పోషిస్తుంది.
విటమిన్ డి పెంచుతుంది
విటమిన్ డి అధికంగా ఉండే గుడ్లు మీ ఎముకలు, మెదడు కణాల పనితీరును మెరుగుపరుస్తాయి. మీరు రాత్రి వేళ గుడ్డు తింటే, అది మంచి కొలెస్ట్రాల్ రూపంలో శరీరంలో నిల్వ అవుతుంది, ఉదయం మీ శరీరానికి సూర్యరశ్మి తగిలినప్పుడు, శరీరం వాటి నుండి విటమిన్ డిని తయారు చేయడం ప్రారంభిస్తుంది.
బరువు తగ్గడంలో సహాయపడుతుంది
సాయంత్రం పూట గుడ్లు తినడం బరువు తగ్గడానికి రెండు రకాలుగా పనిచేస్తుంది. మొదటిది, ఇది మీ పేగు కదలికను వేగవంతం చేస్తుంది, రెండవది, దానిలోని ప్రోటీన్ శరీరాన్ని చాలా కాలం పాటు నిండుగా ఉంచుతుంది. తద్వారా రాత్రి భోజనాన్ని తగ్గిస్తుంది. ఇలా మీ బరువు తగ్గడంలో సహాయపడుతుంది. ఇది మాత్రమే కాకుండా మీ కండరాలను బలపరుస్తుంది, హార్మోన్ల పనితీరును సమతుల్యంగా ఉంచుతుంది.
సంబంధిత కథనం
టాపిక్