Course For Couple : భార్యాభర్తలకు కోర్సు.. సిలబస్ ఏంటి? ఫీజు ఎంత?
Dulha Dulhan Course : మీరు ఎప్పుడైనా ఆదర్శవంతమైన భార్య లేదా భర్తగా శిక్షణ పొందారా? ప్రీ-మ్యారేజ్, పోస్ట్ మ్యారేజ్ ట్రైనింగ్ కోర్సుగా కూడా ఇస్తున్నారు. 'దుల్హా దుల్హన్ కోర్సు' అది. సిలబస్ కూడా ఉంది.
ఇంట్లో భార్యభర్తలు(Wife and Husband) ప్రశాంతంగా ఉండాలి. ఎలాంటి ఇబ్బందులు లేకుండా జీవితాన్ని సాగించాలి. అయితే ఇదే ఆలోచనతో హైదరాబాద్ కు చెందిన ఓ వ్యక్తి.. ఓ సంస్థను పెట్టాడు. దాంట్లో కోర్సులు కూడా ప్రవేశపెట్టాడు. ఏం లేదు.. మీరు ఆదర్శవంతమైన భాగస్వామిగా ఎలా ఉండాలో అందులో చెబుతారు. దీనికోసం సిలబస్ కూడా ఏర్పాటు చేశారు. ఫీజు కూడా నిర్ణయించారు. ఈ కోర్సు పెళ్లి అయిన వారికి, పెళ్లి కాని వారికి కూడా ఉంది. మహ్మద్ ఇలియాస్ ఇన్స్టిట్యూట్ స్థాపించారు.
భర్త చేసే తప్పులు, భార్య ప్రాథమిక అవసరాలు, చేయవలసినవి, చేయకూడనివి, ఆదర్శవంతమైన భర్త లేదా భార్య ఎలా ఉండాలి. వివాహంపై మూర్ఖపు అంచనాలు, మీ భర్తను ఎలా గెలవాలి వంటి అనేక అంశాలు ఈ కోర్సులో ఉన్నాయి. కోర్సు ఫీజు రూ. 5,000గా నిర్ణయించారు. 15 సెషన్లు 45 నిమిషాలకు పైగా ఉంటాయి. వీటిలో కొన్ని టాపిక్స్ కవర్ చేస్తారు. మరో ఇంట్రస్టింగ్ విషయం ఏంటంటే.. ఈ కోర్సు అత్తమామలకు కూడా ఉంటుంది. వారు కోడలితో ఎలా ఉండాలి? త్వరగా బిడ్డకు జన్మనివ్వమని ఒత్తిడి చేయకుండా ఉండేందుకు మార్గాలను ప్రత్యేకంగా బోధిస్తారన్నమాట.
'ఈ శిక్షణ కెరీర్(Career)కే కాకుండా వ్యక్తిగత జీవితానికి ప్రాధాన్యత ఇవ్వడంపై దృష్టి పెడుతుంది. సంప్రదాయాలను ఎవరూ మార్చలేరు. అత్తమామలు మనతో బాగా ప్రవర్తించకపోయినా లేదా ఓపెన్‌గా ఉండకపోయినా., మనం వారికి సేవ చేయడం కొనసాగించాలి. 2017లో కోర్సును ప్రారంభించినప్పటి నుండి 1200 మందికి పైగా శిక్షణ పొందారని.' మహ్మద్ ఇలియాస్ అంటున్నారు. 70 కంటే ఎక్కువ జంటలు తమ సమస్యను పరిష్కరించుకున్నాయట.
దుల్హా దుల్హన్(Dulha Dulhan) కోర్సు పోస్టర్ సోషల్ మీడియా(Social Media)లో వైరల్ అయిన తర్వాత కోర్సులో చేరాలనుకునే వ్యక్తుల నుండి తనకు రోజుకు కనీసం 100 కాల్స్ వస్తున్నాయని ఇలియాస్ చెప్పేమాట. సంతోషకరమైన జీవితానికి కొట్లాటలు కూడా అవసరమని కూడా అతను నమ్ముతున్నాడు. ఎందుకంటే ఎక్కువ ఆనందం ఉన్న ఒక వ్యక్తి పిచ్చిగా మారిపోతాడట.
అయితే పెళ్లయి 25 ఏళ్లు దాటిన వారు మాత్రం ఇది డబ్బులు లాగేసే కోర్సు అని విమర్శిస్తున్నారు. 'నేటి తరానికి ఇలాంటి కోర్సు అవసరం లేదు. అలాంటి కోర్సు అవసరమని మాకు ఎప్పుడూ అనిపించలేదు.' అని కొంతమంది చెబుతున్నారు. కోర్సు అత్తమామల ప్రవర్తనను మార్చుతుందని కొత్తగా పెళ్లయిన కొన్ని జంటలు చెబుతున్నాయి.
కోర్సు, ఇతర సమస్యలతో పాటు వాటిని బోధిస్తుంది: 'వివాహం అంటే ఏమిటి', 'అండర్‌స్టాండింగ్ మంత్రం', 'వివాహం ఎందుకు', 'కోపం ఎలా కంట్రోల్ చేయాలి', 'నియమాలు మరియు బాధ్యతలు', 'భర్తలు చేసే తప్పులు', 'భార్య ప్రాథమిక అవసరాలు', 'భర్తలు చేయవలసినవి మరియు చేయకూడనివి', 'మీరు ఆదర్శ భర్తగా ఎలా ఉండగలరు', 'ఆనందం మంత్రం, 'మూర్ఖపు అంచనాలు', 'మీరు ఆదర్శవంతమైన భార్యగా ఎలా ఉండగలరు', మీ భర్తను ఎలా గెలవాలి' 'ఇంటికి నిర్వహణ మరియు నిర్ణయాల ప్రభావం'. ఇలా ఉన్నాయన్నమాట కోర్సులు. పాఠాలు వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా లేదా ఆడియో పాఠాలుగా అందిస్తారు. ఈ పాఠాలు హిందీ, ఆంగ్లంలో ఉంటాయి.