Garlic Tea - Weight loss | అధిక బరువుతో ఆయాసపడుతున్నారా? వెల్లుల్లి టీ తాగితే సునాయాసంగా తగ్గొచ్చు!
Garlic tea for weight loss: బరువు తగ్గడానికి వెల్లుల్లి టీని ప్రయత్నించండి. గార్లిక్ టీ రెసిపీని, ఆరోగ్య ప్రయోజనాలు ఏం ఉన్నాయో ఈ కింద చూడండి.
Garlic tea for weight loss: అధిక బరువుతో ఆయాస పడుతున్నారా? మీరు బరువు తగ్గడానికి అన్ని ప్రయత్నాలు చేసి ఓడిపోయినట్లయితే, కచ్చితంగా ఒకసారి వెల్లుల్లి టీని ప్రయత్నించండి. వెల్లుల్లిని ఆయుర్వేదంలో ఒక మూలికగా ఉపయోగిస్తారు. ఇది బరువు తగ్గించటంలో ప్రభావవంతంగా ఉండటమే కాకుండా ఇతర అనేక ఆరోగ్య ప్రయోజనాలను చేకూరుస్తుంది. వెల్లుల్లి టీలో ప్రోటీన్, కార్బోహైడ్రేట్లు, విటమిన్లు A, B, C, ఇంకా సల్ఫర్ వంటి అనేక పోషకాలు పుష్కలంగా ఉన్నాయి. వెల్లుల్లిలో ఉండే అల్లిసిన్ అనే సమ్మేళనం మంచి యాంటీ బాక్టీరియల్, యాంటీ ఆక్సిడెంట్ గుణాలను ప్రదర్శిస్తుంది. అదనంగా వెల్లుల్లిలో ఎంజైమ్‌లు, సపోనిన్‌లు, ఫ్లేవనాయిడ్‌లు రక్తంలో చక్కెర తగ్గించడానికి, చెడు కొలెస్ట్రాల్ కరిగించటానికి, క్యాన్సర్ నిరోధకతకు సహాయపడతాయి.
మీరు వెల్లుల్లిలోని ఈ పోషకాలను పొందేందుకు గార్లిక్ టీ తాగడం మంచి ఎంపిక అవుతుంది. గార్లిక్ టీ ఎలా చేయాలి, రెసిపీని ఈ కింద చూడండి.
Garlic Tea Recipe- వెల్లుల్లి టీ రెసిపీ
- వెల్లుల్లి టీ చేయడానికి, ముందుగా ఒక గ్లాసు నీటిని మరిగించండి.
- ఈ నీటిలో తాజా 1 స్పూన్ అల్లం తురుము, 1 వెల్లుల్లి రెబ్బ వేసి సుమారు 20 నిమిషాలు ఉడకబెట్టండి.
- అనంతరం స్టవ్ ఆఫ్ చేసి కొద్దిగా చల్లబరచండి.
- ఆపై ఒక కప్పులో వడగట్టి అందులో ఒక చెంచా నిమ్మరసం, ఒక చెంచా తేనె కలుపుకుని తాగాలి.
వెల్లుల్లి టీ ఆరోగ్య ప్రయోజనాలు
వెల్లుల్లి టీ తాగడం వల్ల మరిన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఏం ఉన్నాయో తెలుసుకోండి.
బరువు తగ్గడం
ప్రతిరోజు ఉదయం లేచిన తర్వాత ఒక కప్పు వెల్లుల్లి టీ తాగడం అలవాటు చేసుకోండి. ఇది మీ జీవక్రియను ప్రారంభిస్తుంది, మీ శరీరంలోని అదనపు కొవ్వును కరిగిస్తుంది, మంచి శరీర ఆకృతిని పొందడానికి సహాయపడుతుంది. అలాగే వెల్లుల్లిలో యాంటీబయాటిక్ మూలకాలు పుష్కలంగా ఉంటాయి. ఇది శరీరంలోని టాక్సిన్స్ తొలగించడంలో సహాయపడుతుంది.
ఫంగల్ ఇన్ఫెక్షన్
మీకు ఏదైనా ఫంగల్ ఇన్ఫెక్షన్ ఉన్నట్లయితే వెల్లుల్లి టీ తాగడం ద్వారా చర్మ వ్యాధుల నుంచి రక్షణ లభిస్తుంది. ఇది కాకుండా, మీరు వెల్లుల్లిని మెత్తగా నూరి ప్రభావిత ప్రాంతంలో అప్లై చేయవచ్చు. ఇలా చేయడం వల్ల మీకు ఇన్ఫెక్షన్ నుంచి చాలా ఉపశమనం లభిస్తుంది.
పంటి నొప్పి ఉపశమనం
పంటి నొప్పికి, దంతాల సమస్యకు వెల్లుల్లి గొప్ప ఔషధం. మీకు పంటి నొప్పి ఉన్నట్లయితే, మీరు వెల్లుల్లి టీ సిప్ చేకుంటూ త్రాగవచ్చు. ఇలా చేయడం వల్ల మీకు పంటి నొప్పి నుంచి ఉపశమనం లభిస్తుంది. అదనంగా మీరు నొప్పి ఉన్న దంతాలపై ఒక కాటన్ బాల్ సహాయంతో వెల్లుల్లి నూనెను వర్తించవచ్చు, దీనితో మీకు పంటి నొప్పి నుంచి తక్షణ ఉపశమనం లభిస్తుంది.
రోగనిరోధక శక్తి బలోపేతం
వెల్లుల్లి టీ వ్యాధులతో పోరాడే రోగనిరోధక వ్యవస్థ సామర్థ్యాన్ని పెంచడంలో సహాయపడుతుంది. హానికర బ్యాక్టీరియాలు, క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధికారక కణాలు పెరగకుండా మీకు రక్షణ కల్పిస్తుంది.
రక్తపోటు నుండి ఉపశమనం
రక్తపోటు, మధుమేహం వంటి వ్యాధులతో పోరాడడంలో వెల్లుల్లి బాగా ఉపయోగపడుతుంది. వెల్లుల్లిని తీసుకోవడం వల్ల జీర్ణవ్యవస్థ పటిష్టంగా ఉంటుంది. హైపర్‌టెన్షన్‌తో బాధపడేవారు వెల్లుల్లి టీ తాగడం వల్ల ప్రయోజనం ఉంటుంది.
సంబంధిత కథనం
టాపిక్