Dragon Fruit Tea । ఇది మతి పోగొట్టే వెరైటీ.. ఒక్కసారి తాగితే, ఇక అంతే!
Dragon Fruit Tea: డ్రాగన్ ఫ్రూట్ టీ తాగితే అలా ఇలా ఉంటుందని వాళ్లు వీళ్లు చెప్పడమే తప్ప, ఎవరికీ తెలియదు. మీకు ఆ రుచి తెలియాలంటే ఈ మరిపోగొట్టే రెసిపీని చూడండి.
పండ్లు ఆరోగ్యానికి చాలా మంచివి. సీజనల్‌గా లభించే ఎలాంటి పండ్లనైనా తరచుగా తింటూ ఉండాలి. ఈ సీజన్‌లో డ్రాగన్ ఫ్రూట్ ఎక్కువగా లభిస్తుంది. ఈ డ్రాగన్ ఫ్రూట్ తినడం ద్వారా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు లభిస్తాయి. మరి డ్రాగన్ ఫ్రూట్ ఎలా తినాలి? కోసుకొని ముక్కలు చేసుకొని తినాలా.. లేకపోతే జ్యూస్ చేసుకొని తాగాలా? వెరైటీగా చాయ్ చేసుకొని తాగితే ఎలా ఉంటుంది? ఎప్పుడైనా ఆలోచించారా? కానీ రోడ్ సైడ్ చాయ్ వాలా ఆలోచించాడు. ఓ పిల్లవాడు డ్రాగన్ ఫ్రూట్‌తో చేసిన ఒక వీడియో ఇప్పుడు ఇంటర్నెట్‌ను మిల్క్ షేక్ చేస్తుంది.
Dragon Fruit Tea Recipe చాలా సింపుల్. ముందుగా చాయ్ చేసుకోవాలి. అందులో డ్రాగన్ ఫ్రూట్ పండు గుజ్జును కలుపుకోవాలి. ఆపై నెయ్యిలాంటి పదార్థం కలుపుకోవాలి. అప్పుడు ఆ టీ రంగు, రుచి, చిక్కదనం మారిపోతాయి. అంతే, అదే డ్రాగన్ ఫ్రూట్ టీ.
మైసూర్ పాక్‌లో మైసూర్ ఉన్నట్లు, పులిహోరలో పులి ఉన్నట్లు, ఈ డ్రాగన్ ఫ్రూట్‌లో డ్రాగన్ ఉన్నట్లుగా ఈ టీలో టేస్ట్ ఉంటుందో, లేదో అనేది తాగిన వారికే తెలుస్తుంది. మీకు తెలియాలంటే మీరూ తాగి చూడండి. అన్నట్లు ఈ డ్రాగన్ ఫ్రూట్ చాయ్ చేసిన పిల్లవాడి చాయ్ బండి బంగ్లాదేశ్ లో ఉంది. అక్కడికి వెళ్లి తాగలేరు కాబట్టి ఎలా చేశాడో ఆ వీడియోను మీకు ఇక్కడ అందిస్తున్నాం. చూసి నేర్చుకోండి, చేసుకొని తాగండి.
Dragon Fruit Tea Video
శాస్త్రవేత్తలు ప్రయోగాలు చేస్తేనే కొత్తకొత్తవి పుట్టుకొస్తాయి. అలాగే ఇలా వంటలతో కొత్త రుచులను పుట్టించే వారు కూడా శాస్త్రవేత్తలకేం తక్కువ కాదు. టాలెంట్‌ని ఎంకరేజ్ చేయడం ముఖ్యం. ఫైవ్ స్టార్ హోటళ్లలో చెఫ్‌లు పైనాపిల్ టీ చేస్తే తాగినపుడు రోడ్ సైడ్ చాయ్ వాలా డ్రాగన్ ఫ్రూట్ చేస్తే ఎందుకు తాగకూడదు.
మొన్నామధ్య ఒకరు మిక్స్‌డ్ ఫ్రూట్ టీ చేసి రికార్డ్ బద్దలు కొట్టారు. రసగుల్లా టీ, మ్యాంగో నూడుల్స్, మురికి అన్నం ఇలా చాలా వెరైటీలు ఉన్నాయి. మీరు ఇలా కొత్తగా ట్రై చేసే వారైతే కంటిన్యూ చేయండి, సోషల్ మీడియాలో పెట్టేయండి.
సంబంధిత కథనం