Think Differen'T' | రసగుల్లా ఛాయ్.. చటుక్కున తాగరా భాయ్!
ఏదో సినిమాలో వెరైటీ పుల్లయ్య లాగా వడలకే రంధ్రాలు ఎందుకు ఉండాలి, ఇడ్లీలకు ఎందుకు ఉండకూడదు అన్నట్లుగా.. కొత్తగా ఏదైనా తినాలి అని ఆలోచిస్తే ఎన్నో రకాల వెరైటీ రుచులను ఆస్వాదించవచ్చు.
కాఫీలు తాగారా.. టిఫినీలు చేశారా? లేక ఎప్పుడూ అవే కాఫీలు, టిఫినీలు అని విసిగిపోయారా? సృజనాత్మకత ఉండాలే కానీ ఎన్నో రకాల వెరైటీ రుచులను ఆస్వాదించవచ్చు. కొత్తగా ఏదైనా చేయాలి, కొత్తగా ఏదైనా తినాలి అని ఆలోచించగలగాలి. ఇడ్లీలు తెల్లగానే ఎందుకు ఉండాలి? నల్లగా ఎందుకు ఉండకూడదు అని బ్లాక్ ఇడ్లీలు.. అలాగే మసాల దోశలో మసాలానే ఎందుకు ఉండాలి? చాక్లెట్ ఎందుకు వద్దు అని చాక్లెట్ దోశలు చేయడం ఆ మధ్య వైరల్ అయిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఆ జాతికి చెందిన ఓ కళాకారుడే కొత్తగా ఒక ఛాయ్ కనిపెట్టాడు. అదే రసగుల్లా ఛాయ్.
ఇపటివరకు మీరు అల్లం టీ తాగి ఉంటారు, బెల్లం టీ తాగి ఉంటారు. నార్మల్ టీ తాగి ఉంటారు, హెర్బల్ టీ తాగి ఉంటారు. ఇప్పుడు సరికొత్తగా రసగుల్లా టీ వచ్చేసింది. మరి దీనినెప్పుడైనా ట్రై చేశారా? ఇప్పుడు ఈ రసగుల్లా టీ కొత్తగా ట్రెడ్ అవుతుంది. దీనిని తయారు చేసుకోవడం కూడా చాలా సింపులే.
పాలు వేడి చేయాలి, దానిలో ఛాయ్ పత్తి వేసి బాగా మరిగించాలి. ముఖ్య గమనిక- ఇక్కడ షుగర్ వేసుకోకూడదు. దీనికి బదులుగా ఒక రసగుల్లాను కొద్దిగి పిసికి అది టీకప్పులో వేసి అందులో ఈ మరిగించిన ఛాయ్ పోయాలి. అంతే ఇదే రసగుల్లా ఛాయ్. ఇందులో బ్రెడ్, బిస్కెట్స్ వేసుకోనవసరం లేదు.
కింద వీడియో చూడండి.. ఇది కోల్‌కతా నగరంలో ఈ కొత్తరకం రసగుల్లా ఛాయ్ వైరల్ అవుతుంది. బెంగాలీలకు రసగుల్లాలు, ఆలుగడ్డలు, చేపలు ఎంత ఇష్టమో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అందుకేనేమో ఇలా ట్రై చేసి ఉంటారు.
Watch Here:
సంబంధిత కథనం