Cancer and Fasting: తరచూ ఉపవాసం చేయడం క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గిస్తుందా? ఆరోగ్య నిపుణులు ఏం చెబుతున్నారు
Cancer and Fasting: ఉపవాసం చేయడం ద్వారా శరీరానికి కొన్ని రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ఉపవాసం చేయడం ద్వారా క్యాన్సర్ ప్రమాదాన్ని తప్పించుకోవచ్చని కొంతమంది అభిప్రాయం.
Cancer and Fasting: అత్యంత ప్రమాదకరమైన వ్యాధుల్లో క్యాన్సర్ ఒకటి. దీనికి చికిత్స చాలా కష్టతరంగా ఉంటుంది. అలాగే ఈ వ్యాధిని నివారించడానికి ఎన్నో పరిశోధనలు నిరంతరం జరుగుతూనే ఉన్నాయి. ఆ అధ్యయనాల్లో కొన్ని విషయాలు బయటపడుతూ ఉంటాయి. అయితే ఒక తాజా పరిశోధనలో ఉపవాసం చేయడం వల్ల క్యాన్సర్‌ను నయం చేయవచ్చని తెలిసింది. మెమోరియల్ స్లోన్ కెట్టెరింగ్ క్యాన్సర్ సెంటర్ చేసిన పరిశోధనలో ఉపవాసం చేయడం అనేది క్యాన్సర్ కణాలను తీవ్రంగా ప్రభావితం చేస్తుందని నిరూపించింది.
కిల్లర్ కణాలకు శక్తి...
ముందుగా ఈ అధ్యయనాన్ని ఎలుకలపై చేశారు. ఉపవాసం అనేది క్యాన్సర్‌కు వ్యతిరేకంగా పనిచేసే శరీర సహజ రక్షణ వ్యవస్థను పటిష్టంగా మారుస్తుందని తెలిసింది. క్యాన్సర్ కణాలను అడ్డుకునే శక్తి... రోగనిరోధక వ్యవస్థకు ఉపవాసం చేయడం వల్ల పెరుగుతుందని తెలుస్తోంది. ఉపవాస సమయంలో సహజంగానే తన శరీరంలోని కిల్లర్ కణాలు శక్తి కోసం చక్కెరపై కాకుండా కొవ్వు పై ఆధారపడి ఉంటాయి. జీవక్రియ మార్పు వల్ల అవి క్యాన్సర్ కణాలను ఉత్పత్తి చేసే సామర్థ్యాన్ని పొందుతాయి. ఉపవాసం కారణంగా ఈ కణాలు కణితుల్లో కూడా ఉత్పత్తి అవుతాయి. దీనివల్ల క్యాన్సర్‌తో పోరాడే సామర్థ్యం పెరుగుతుందని ఈ కొత్త అధ్యయనం చెబుతోంది.
ఎలుకలపై పరిశోధన
ఉపవాసం వల్ల క్యాన్సర్ తగ్గే అవకాశం ఉందని అంతకుముందు చేసిన పరిశోధనల్లో కూడా తేలింది. 2012లో ఎలుకలపై ఈ ఉపవాస పరీక్షను నిర్వహించారు. వాటిని కొంతకాలం పాటు ఉపవాసం ఉంచారు. అలాగే కీమోథెరపీ ఔషధాల దుష్ప్రభావాలు కూడా ఎంతవరకు ప్రభావం చూపుతున్నాయో కనుగొన్నారు. ఈ ఉపవాసం చేయడం వల్ల కీమోథెరపీ ఔషధాల దుష్ప్రభావాలు కూడా తగ్గుతున్నట్టు తేలింది. అలాగే 2016లో చేసిన అధ్యయనంలో స్వల్పకాలిక తరచూ ఉపవాసం చేయడం వల్ల శరీరంలోని విషపదార్థాలు కూడా తగ్గుతున్నట్టు తేలింది. అడపా దడపా ఉపవాసం చేయడం అనేది కాలేయ ఆరోగ్యాన్ని కూడా మెరుగుపరుస్తుందని, క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గిస్తుందని అధ్యయనాలు తేల్చాయి. అలాగే కాలేయంలో కొవ్వు పేరుకుపోవడం, కాలేయ వాపు, కాలేయ క్యాన్సర్ వచ్చే అవకాశాలు కూడా ఉపవాసం వల్ల తగ్గించుకోవచ్చు
ఉపవాసం చేయడం వల్ల ఇన్సులిన్ స్థాయిలు తగ్గుతాయి. ఇవి కాన్సర్ కణాల పెరుగుదలను కూడా తగ్గిస్తాయి. ఉపవాసం అనేది శరీరంలో సహజ యాంటీ ఆక్సిడెంట్లను పెంచుతుంది. ఇది క్యాన్సర్ వల్ల కలిగే నష్టాల్ని తగ్గించి కణాలను కాపాడుతుంది. అయితే ఇంకా ఈ విషయంలో పరిశోధన అవసరమని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు. ఏది ఏమైనా అప్పుడప్పుడు ఉపవాసం చేయడం అనేది శరీరానికి మేలే చేస్తుంది.
టాపిక్