Fruit for Diabetes: ఈ పండు పేరేమిటో ఎవరికైనా తెలుసా? డయాబెటిస్ పేషెంట్లు కచ్చితంగా తినాల్సిన పండు ఇది-do you know the name of this fruit this is a fruit that diabetic patients must eat ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Fruit For Diabetes: ఈ పండు పేరేమిటో ఎవరికైనా తెలుసా? డయాబెటిస్ పేషెంట్లు కచ్చితంగా తినాల్సిన పండు ఇది

Fruit for Diabetes: ఈ పండు పేరేమిటో ఎవరికైనా తెలుసా? డయాబెటిస్ పేషెంట్లు కచ్చితంగా తినాల్సిన పండు ఇది

Haritha Chappa HT Telugu
Sep 03, 2024 08:00 AM IST

Fruit for Diabetes: డయాబెటిస్ ఉన్న వారు కచ్చితంగా తినాల్సిన పండ్లు కొన్ని ఉన్నాయి. వాటిలో లుకుమా పండు ఒకటి. లుకుమాను 'గోల్డ్ ఆఫ్ ఇన్కాస్' అని కూడా పిలుస్తారు. ఈ పండు పురాతన కాలం నుంచి ఉంది. అందుకే దీన్ని అలా అంటారు.

ఈ పండు పేరేమిటో తెలుసా?
ఈ పండు పేరేమిటో తెలుసా? (Etsy)

రోజూ ఒక పండును మీ ఆహారంలో చేర్చుకోవడం వల్ల కలిగే అనేక ప్రయోజనాలు ఉంటాయి. ఆపిల్, దానిమ్మ వంటి పండ్లనే ఎక్కువగా తింటారు. అయితే డయాబెటిస్ వారికి ఎంతో మేలు చేసే పండు ఒకటి ఉంది. అదే లుకుమా పండు. దీన్ని చూస్తే బంగారమే గుర్తొస్తుంది. పసుపు రంగులో నిగనిగా మెరుస్తుందిది.

లుకుమా పండు పేరు చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు. కానీ ఆరోగ్యానికి మాత్రం ఇది చేసే మేలు ఎంతో. ఈ పండు డయాబెటిస్ ఉన్న వారికి ఒక వరం అనే చెప్పాలి. లుకుమా అనేది దక్షిణ అమెరికాలో కనిపించే ఒక పండు. దీన్ని నొక్కితే గట్టిగా ఉంటుంది. బయట వైపు తొక్క ఆకుపచ్చ రంగులో లేదా పసుపు రంగులో ఉంటుంది. లోపల గుజ్జు మాత్రం కేవలం పసుపు రంగులోనే ఉంటుంది.

లుకుమా పండు రుచి స్వీట్ పొటాటోలాగా అనిపిస్తుంది. దీన్నే 'గోల్డ్ ఆఫ్ ది ఇన్కాస్' అని కూడా పిలుస్తారు. లుకుమాలో ఉండే పోషకాల గురించి ఎంత చెప్పినా తక్కువే. దీనిలో క్యాల్షియం, పొటాషియం, ఫైబర్, విటమిన్-సి పుష్కలంగా ఉంటాయి. ఇవి ఆరోగ్యానికి ఎన్నో అద్భుతమైన ప్రయోజనాలను అందిస్తాయి. లుకుమా పండు తినడం వల్ల పొందే డయాబెటిస్ ఉన్న వారికి, లేని వారికి కూడా అమేజింగ్ బెనిఫిట్స్ ఉన్నాయి.

ఫైబర్ రెండు రకాలు. ఒకటి కరిగే ఫైబర్, మరొకటి కరగని ఫైబర్. ఈ రెండూ కూడా పొట్ట ఆరోగ్యాన్ని కాపాడుకోవడంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. లుకుమాలో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ఇది జీర్ణవ్యవస్థను ఆరోగ్యంగా ఉంచడం ద్వారా మలబద్దకం నుండి ఉపశమనం పొందటానికి సహాయపడుతుంది. దీని వల్ల జీర్ణక్రియ మెరుగ్గా ఉండి పేగు ఆరోగ్యం కూడా బాగుంటుంది.

డయాబెటిస్ అదుపులో ఉంటుంది

లుకుమాలో అధిక గట్ కెరోటినాయిడ్లు ఉంటాయి. ఇది డయాబెటిస్‌ను నియంత్రించడంలో సహాయపడుతుంది. అదనంగా, లుకుమా పండు తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్‌ను కలిగి ఉంటుంది. దీని తినడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు పెరగకుండా అదుపులో ఉంటాయి. ఇది డయాబెటిక్ రోగులకు ప్రయోజనం చేకూరుస్తుంది.

లుకుమాలో ఉండే యాంటీఆక్సిడెంట్లు, విటమిన్ సి, బీటా కెరాటిన్ అధికంగా ఉంటాయి. ఇవి ఫ్రీ రాడికల్స్ నుండి చర్మాన్ని రక్షించడం ద్వారా అకాల వృద్ధాప్యం నుంచి ఉపశమనం పొందవచ్చు. ఇది చర్మాన్ని మృదువుగా, ప్రకాశవంతంగా ఉంచడానికి సహాయపడతాయి.

హై ఎనర్జీ ఫ్రూట్

లుకుమా పండులో పొటాషియం, కాల్షియం, ఐరన్, విటమిన్ సితో పాటు ఫైబర్, కార్బోహైడ్రేట్లు ఉంటాయి. ఇందులో లుకుమా అధిక శక్తిని ఇచ్చే పండ్ల జాబితాలో ఉంది. ఇది శరీరానికి బలాన్ని ఇస్తుంది. లుకుమా పండు మీకు ఎక్కడా దొరికినా కూడా వదలకండి. ఆన్ లైన్ మార్కెట్లో ఇవి లభించే అవకాశాలు ఉన్నాయి.

మెరుగైన రోగనిరోధక శక్తి

లుకుమా పండులో ఉండే రిబోఫ్లేవిన, విటమిన్ బి 2 వంటివి శరీరానికి వ్యాధులతో పోరాడే శక్తిని అందిస్తాయి. రోగనిరోధక శక్తిని బలోపేతం చేస్తాయి. కాబట్టి ఈ పండు మనకు దొరకదులే అనుకోకండి. అప్పుడప్పుడు విదేశీ పండ్లు మనదేశంలోకి అమ్మకానికి వస్తాయి. ఇవి కూడా కొన్ని చోట్ల లభిస్తాయి. కనిపిస్తే డయాబెటిస్ రోగులు కచ్చితంగా ఈ పండును తినండి.

టాపిక్