Grinding teeth in sleep: నిద్రలో పళ్లు నూరుతున్నారా? ఈ అలవాటు మానేందుకు 7 టిప్స్-do you grind your teeth in sleep find 7 effective tips to prevent bruxism ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  Lifestyle  /  Do You Grind Your Teeth In Sleep Find 7 Effective Tips To Prevent Bruxism

Grinding teeth in sleep: నిద్రలో పళ్లు నూరుతున్నారా? ఈ అలవాటు మానేందుకు 7 టిప్స్

Parmita Uniyal HT Telugu
Jan 24, 2023 08:00 PM IST

Grinding teeth in sleep: నిద్రలో పళ్లు నూరుతున్నారా? ఈ అలవాటు మానేందుకు 7 టిప్స్

నిద్రలో పళ్లు నూరుతున్నారా? అలవాటు మానేందుకు 7 టిప్స్
నిద్రలో పళ్లు నూరుతున్నారా? అలవాటు మానేందుకు 7 టిప్స్ (Freepik)

నిద్ర పోయాక పళ్లు నూరుతున్నారా? నిద్రలో పళ్లు కొరకడాన్ని బ్రక్సిజం అంటారు. అంటే నిద్రలో గానీ, మెలకువతో ఉన్నప్పుడు గానీ తెలియకుండానే పళ్లు కొరకడం, పళ్లు నూరడం అన్నట్టు. ఇది చాలా అసౌకర్యానికి దారితీస్తుంది. తలనొప్పి, దవడ నొప్పి రావడంతో పాటు దంతాలు అరిగిపోవచ్చు. ఇలా జరగడానికి అధిక స్థాయిలో ఒత్తిడి ఉండడం కావొచ్చు. లేదా యాంగ్జైటీ, కొన్ని నిర్ధిష్ట ఔషధాలు కారణమై ఉండొచ్చు. నిద్రలో దంతాలు అరగదీసే వారు కొన్ని నిద్ర సంబంధిత సమస్యలతో బాధపడుతుండొచ్చు. గురక, శ్వాసలోపాలు కారణమై ఉండొచ్చు. బ్రక్సింగ్ వల్ల మీ దంతాల ఎనామిల్ దెబ్బతింటుంది. దంతాలు విరిగిపోవడం, కోల్పోవడం, తరచూ మెలకువ రావడం, దవడ కండరాలు అలసిపోవడం, దవడ నొప్పి, బుగ్గల లోపల గాయాలు, నిద్రలో అంతరాయం వంటి సమస్యలు ఈ బ్రక్సింగ్ వల్ల కలుగుతాయి.

మీరు బ్రక్సింగ్ వదులుకోవాలంటే రాత్రి పూట కొన్ని టిప్స్ ఆచరించాలని స్మైల్ క్రాఫ్ట్ డెంటల్ స్టూడియో ఫౌండర్, డెంటల్ సర్జన్ డాక్టర్ నీరాలి పాటిల్ సూచనలు ఇచ్చరు.

1. mouth guard: మౌత్ గార్డ్ వాడాలి

నిరంతరాయంగా పళ్లు నూరుతుండడం వల్ల దంతాల ఎనామిల్ దెబ్బతింటుంది. క్యావిటీలకు కారణమవుతుంది. అయితే మౌత్ గార్డ్ ధరించి నిద్ర పోవడం వల్ల మీ దంతాలకు రక్షణ ఉంటుంది. స్టోర్‌లో కొనడం కంటే మీకు తగినట్టుగా చేయించుకుని వాడడం మంచిది. రాత్రి పూట అంతా ఇది వాడడం వల్ల దంతాలు నూరడం నుంచి రక్షించుకోవచ్చు.

2. Start exercising: వ్యాయామం మొదలు పెట్టండి

మీరు వ్యాయామం చేయకపోతే.. ఇక నెమ్మదిగా ప్రారంభించంది. స్ట్రెస్, యాంగ్జైటీ, టెన్షన్ వల్లే ఈ బ్రక్సింగ్ వస్తుంది. వ్యాయామం వల్ల మీలో ఒత్తిడి తగ్గుతుంది.

3. Relax right before bed: నిద్రకు ముందు రిలాక్స్ అవ్వండి

మీ టెన్షన్ అంతా మీ దవడల్లోకి వస్తుండడంతో మీకు బ్రక్సింగ్ సమస్య వస్తోంది. అందువల్ల మీరు నిద్రకు ముందు రిలాక్సింగ్ టెక్నిక్స్ పాటించాలి. వేడి నీటి స్నానం వల్ల మీ దవడ కండరాలు రిలాక్స్ అవుతాయి. లేదా మీ దవడకు హీటింగ్ ప్యాడ్ పెట్టుకోండి. కెఫైన్ లేని టీ గానీ, హెర్బల్ టీ గానీ తాగండి. మీ నోరు వెచ్చగా ఉంచుకోండి.

4. Massage your jaw muscles: దవడం కండరాలకు మర్థన

ఒత్తిడి గల సందర్భాలను ఎదుర్కొన్నప్పుడు మీ దవడ గట్టిగా పట్టుకుని ఉన్నట్టు రోజులో ఎప్పుడైనా గమనించారా? అలా గమనిస్తే మీరు రిలాక్స్ అయ్యేందుకు దవడం ప్రాంతంలో కండరాలకు మర్ధన (మసాజ్) చేసుకోండి. అలా చేయడం వల్ల ఒత్తిడి తగ్గుతుంది. రోజంతా ఎదుర్కొన్న ఒత్తిడి రిలీజ్ అవుతుంది.

5. conscious of your clenching: బిగింపుపై అవగాహన అవసరం

మీరు రోజులో కూడా పళ్లు బిగిస్తూ ఉండొచ్చు. కానీ గమనించి ఉండకపోవచ్చు. అందువల్ల రోజులో కూడా మీ ఒత్తిడిని తగ్గించుకునేందుకు మీరు రిలాక్స్ టెక్నిక్స్ పాటించాలి. అలాంటి సందర్భాలను గమనించాలి. ఎలాంటి సందర్భాల్లో పళ్లు బిగుసుకుపోతున్నాయో గమనించాలి. అలాంటి సందర్భం వచ్చినప్పుడు మీ దవడ తెరిచి ఉంచుకోండి. నెమ్మదిగా కదిలించి దవడను సౌకర్యవంతమైన పొజిషన్‌కు మార్చండి.

6. Stop chewing everything but food: ఆహారం తప్ప మిగిలినవి నమలొద్దు

రోజంతా ఏదో ఒకటి నములుతున్నారా? పనిచేసేటప్పుడు ఒత్తిడిలో ఏదైనా నములుతున్నారా? పెన్ క్యాప్ వంటివి నమలడం చేస్తుంటే అలాంటివన్నీ ఆపేయండి. దీని వల్ల మీ దవడలు బిగుసుకుపోతాయి. మీరు కేవలం ఆహారం తీసుకునే సమయంలో తప్ప మిగిలిన సందర్భంల నమలడం ఆపండి.

7. Avoid chewy foods: నమిలే ఆహారాలకు దూరంగా ఉంండి

పాప్ కార్న్, స్టీక్, టాఫీ వంటి వాటి జోలికి వెళ్లకండి. వీటికి బాగా నమలాల్సిన అవసరం ఉంటుంది. మీ దవడకు ఇది మరింత ఇబ్బందిగా మారుతుంది. బ్రక్సిజం ఉన్నప్పుడు ఎలాంటి దంత సమస్యలు వచ్చినా డెంటిస్ట్‌ను సంప్రదించండి. బ్రక్సిజానికి కారణాలను వారు నిర్ధారించే అవకాశం ఉంది. వారు మీ దంతాల అలైన్‌మెంట్ కూడా పరిశీలిస్తారు.

WhatsApp channel

టాపిక్